దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక ఇబ్బందులను సహించి అధిగమించాలి

నవంబరు 8వ తేది నాడు ఉరుము లేకుండా పిడుగుపడ్డట్టు మన ప్రధాని నరేద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించాడు.అది దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తూ వచ్చింది. దాని ప్రభావం దేశంలోని సామాన్య ప్రజలనుంచి అసామాన్యుల వరకు అక్రమార్కుల నుంచి అడ్డదారిలో ధనాన్ని కూడాబెట్టే రాజకీయ నాయకుల వరకు అందరిపైన పడింది. ఈ పరిస్థితుల సద్దుమణిగేందుకు కొన్ని నెలలు పట్టేట్లుగానే కనబడుతుంది. ఈలోగా దేశంలోని రాజకీయ నాయకులు ఉదారమేధవులు రోజుకోక ప్రకటనతో ప్రజలను గందరగోళంలోకి నెట్టుతున్నారు. మరో ప్రక్క నోట్ల మార్పిడికి కమిషన్‌ వ్యాపారాలు పెరిగిపోతున్నాయి. కొత్త నోట్లు పాతనోట్లు కుప్పలుకుప్పలుగా చేతులు మారుతూ పట్టుబడుతూనే ఉన్నాయి. సకాలంలో ఏటింఎలను సిద్ధం చేయకపోవడం, సకాలంలో నోట్లను ముద్రణ చేయక పోవటం ఎన్నో సమస్యలకు చికాకులకు కారణమ వుతున్నది. ఇంత జరుగుతున్న పెద్దనోట్ల రద్దుపై ప్రజలలో ఆగ్రహం కలగడం లేదు. పైగా అవినీతిని అంతం చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నారు. దేశంలోని వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా రద్ధు నిర్ణయం మంచిదే అంటూనే విమర్శలు గుప్పిస్తు న్నారు. ఈ మధ్య ప్రతిపక్షాలు ఏకమై నిరసనకు సిద్ధమైనప్పుడు కొన్ని పత్రికలు చాలా వాఖ్యనాలు చేశాయి. చాలా రోజుల తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఒక చోటకు చేరే అవకాశం లభించింది. ఈ రద్ధుకు వ్యతిరేకంగా ఒకే గళంతో దేశ వ్యాప్తంగా బంద్‌కు, నిరసనకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు స్వరం ఆగిపోకముందే ఒకే గళం నుంచి వివిధ గళాలుగా వేరు వేరు స్వరాలు వినిపించాయి. దాని పర్యవసన మే బంద్‌ విఫలం కావటం. దీనితో రద్దుపై ప్రజల సమ్మతి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. నవంబరు 8న రద్దు ప్రకటన నుంచి పార్లమెంట్‌లో ఆదాయపు పన్ను సవరణ బిల్లు వచ్చే వరకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నయానో భయానో అవినీతి పరులు తమంతట తాము నీతిపరులుగా మారేందుకు అవకాశాలు ఇస్తూనే వచ్చింది. దాంతో కలుగులలో దాక్కొని ఉన్న ఎలుకలు బయటకి రావడం ప్రారంభమయ్యింది. అన్ని బయటకు వస్తాయే లేదో వేచిచూడాలి. ఇప్పటికైనా తమ నల్లధనాన్ని బ్యాంకులలో జమచేసి 50% పన్ను కట్టి మిగిలినది సొంతం చేసుకునేం దుకు అవకాశం ఇచ్చింది. అందులో 25% నాలుగు సంవత్సరాల తరువాత తీసుకునేట్లుగా 25% వెంటనే తీసుకు నేందుకు వెసులుబాటు కల్పించారు. ఇది ఇంక సద్ధు మణగముందే నగదురహిత భారత్‌ను నిర్మాణం చేసేందుకు ప్రయాత్నలు ప్రభుత్వ ప్రారంభించింది.
నగదు రహిత భారత్‌ అనటం చాలా సులభం. కాని భారత్‌లో ఉన్న వివిధ వెనుకబడిన సామాజిక శ్రేణులు వాళ్ల దైనందిన జీవితాలు, వాళ్ల కష్టాలు, వాళ్లలో కొరవడిన విద్య ఇవన్ని వారిని నగదురహిత భారత్‌లోకి తీసుకొనివచ్చెందుకు ఎంతో ప్రయాస పడాల్సి వస్తుంది. ఈ దేశంలో తమ బ్రతుకు తామే బ్రతుకే సామాన్య ప్రజలకు సమస్యలు రాకుండా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అట్లా ఉండలేక పోవడమే కొంత చికాకు కారణం అవుతున్నది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశంలోని గిరిజనులకు అతి బీదవారికి ఈ విష యలపై అవగాహన కలిగించి వారు నష్టపోకుండా చూడాలి. నగదు రహిత భారత నిర్మాణంలో ఈ సామాజిక శ్రేణులకు మధ్య దళారు ల వ్యవస్థ నిర్మాణం కాకుండా ప్రభుత్వం ప్రత్యక్షంగా కాని లేదా గుర్తింపు పొందిన ఎన్‌జీవోల ద్వారా కాని పనులు సక్రమంగా జరిగెేటట్లు చూడాలి. దేశంలో దశాబ్దలుగా నల్లధనం పెరగటానికి రాజకీ య నాయకుల పాత్ర చాలా కీలకం. దేశాన్ని అస్థిర పరిచే కుట్రల పన్నుతున్న ఉగ్రవాద మూకల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంది. వీటి అన్నిటి మధ్య దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడం ఒక పెద్ద సవాలు. ఈ సవాలును ఎదుర్కొవటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమైనది. ఈ దిశలో కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వేగవంతం కావాలి. దానికి ఎన్నికల సంస్కరణలు పాలనాపరమైన సంస్కరణలు కూడా రావాలి. అప్పుడే సత్పలితాలు వస్తాయి. లేక పోతే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. మొత్తం మీద దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక ఇబ్బందులు సహించి అధిగమించాటనికి ప్రజలు కూడా సిద్ధం కావాలి.