వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న జీహది మత హింసపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటన

ఇటీవల కాలంలో క్రూరమైన మతహింసలకు పాల్పడుతున్న జిహది శక్తుల వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటలోని రాష్ట్ర ప్రభు త్వాలు ఇలాంటి మతహింస పట్ల కనబరుస్తున్న నిర్లక్ష్యదొరణిని వదిలి తక్షణమే హింసను ప్రేరిపిస్తున్న వారి పట్ల చర్యలు తీసుకుని జిహది శక్తుల పట్ల గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతుంది.
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎన్నికల తరువాత నుంచి ఇప్పటి వరకు హిందూవులపై జరుగు తున్న దాడులలో ఎంతో మంది చనిపోవడం, గాయలపాలు కావడం జరిగింది. ఎన్నో గ్రామా లలో హిందూ మహిళాలపై అత్యాచారం, దాడులు, ఆస్తుల విధ్వంసం, గుళ్లల్లో విగ్రహల ద్వంసం కారణంగా తప్పనిసరి పరిస్థితులలో హిందూవులు ఆ గ్రామాలను విడిచిపోవాల్సి వస్తోంది. ఇంకో దుర్మార్గమైన సంఘటన అక్టోబర్‌ 10నాడు నాడియా జిల్లాలోని హన్సకాళి పోలిస్‌స్టేషన్‌ పరిధిలో వున్న దక్షిణ గంజాపూర్‌ అనే గ్రామంలో మౌ రాజక్‌ అనే వ్యక్తి ఒక దళిత మైనర్‌ బాలికపై దాడి చేసి చంపడం జరిగింది.
దుర్గాపూజ సందర్భంగా పందిళ్లు వేసేటప్పుడు పూజ, నిమజ్జనం చేసే సందర్భాలలో అభ్యంతరాలు తెలుపుతూ దాడులు చేయడంలాంటి సంఘటనలు డజన్‌ల కొద్ది జరిగాయి. ఇలాంటి పరిస్థితులలో శాంతిభద్రలను పర్యవేక్షించే సంస్థలు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కనీసం ఎఫ్‌ఐర్‌ నమోదు చేయాడానికి కూడా నిరాకరించాయి. దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి బలవంతంగా గడువు విధించడం ఆ రాష్ట్ర ప్రభుత్వ పక్షపాత ధొరణిపై కలకత్తా హైకోర్టు ఇది నిస్సందేహంగా 'మైనార్టీల సంతుష్టీకరణ' అని మందలించింది.
తమిళనాడు, కేరళ, కర్నాటక లాంటి దక్షిణ భారత రాష్ట్రాలలో సైతం జిహాదీ ఆగడాల ప్రభావం పెరగడం మనం చూస్తునే ఉన్నాం. హిందూవులపై ప్రత్యేకంగా స్వయంసేవకులపై, జాతీయ వాద సంస్థలలో పని చేస్తున్న వారిపై హింసా పూరితమైన దాడులు జరుగుతున్నావి.
గత రెండు నెలల్లో తమిళనాడులోని ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, బీజేపీ మరియు హిందూ మున్నాని కార్యకర్తలపై కోయంబత్తూర్‌, మధురై, దిండిగల్‌ లాంటి ప్రాంతాలలో విపరీతమైన దాడులు చోటు చేసుకున్నాయి. జిహదీ మూకల మనోధైర్యం పెరగడానికి శాంతి భద్రతలను చూడవలిసిన సంస్థల నిర్లాక్ష్యపు మనో వైఖరి దాని ఫలితంగా సంఘ కార్యకర్తలపై హిందూ మహిళలపై అమానుషమైన దాడులు కోట్లాకోద్ది ఆస్తి ధ్వంసంలాంటి సంఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. అంబూర్‌లో ఒక మహిళా పోలీసుపై జరిగిన దాడి అక్కడ పాలన యంత్రాగానికి ఎలాంటి నియంత్రణ లేదని ఈ సంఘటన విఫులంగా తెలియజేస్తుంది. ఒక మతన్మోద సంస్థకు చెందిన ప్రముఖుడు 'డైరెక్ట్‌ యాక్షన్‌'కి పిలుపు ఇవ్వడాన్ని భవిష్యత్‌ లో జరగబోయే పరిణమాలకు ఒక హెచ్చరికగా చూడాలి. వీటన్నింటి కంటే రాష్ట్రం ప్రభు త్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి విముఖత చూపడం జిహాదీ అట్లాంటి వాటికి తలొగ్గడం జాతీయ వాద శక్తులను వేధించడం వీటిన్నింటి కంటే భయానకమైనది.
ఈ నెల కర్నాటకలో పట్టపగలే బెంగూళుర్‌లో నిత్యం రద్ధీ వుండే వీధిలో ఒక స్వయం సేవకుడు హత్య చేయబడ్డాడు. గత కొన్ని రోజులలో ముడుబిద్రి, కోడుగు మరియు మైసూర్‌లాంటి ప్రదేశాలలో జిహదీలు హిందూవులపై దాడులు హత్యలు చేయడం గమనిస్తున్నాము.
ఇలాంటి దాడులను కేవలం స్థానికంగా మాత్రమే జరిగేవికాదు అని మనం గుర్తించాలి. ఇది దక్షిణ రాష్ట్రాలలో కొన్ని జిహదీ సంస్థలకు అంతర్జాతీ యంగా పనిచేస్తున్న ఇస్తామిక్‌ స్టేట్‌ మధ్య ప్రణాళిక లో బాగంగా కనబడుతున్నాయి. కారణం ఇటీవలే కేరళ,తెలంగాణలో అరెస్టు అయిన ఉగ్రవా దుల విచారణ సందర్భంగా వెలుగు చూసిన సాక్ష్యలు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను తక్షణమే శిక్షించి ఎలాంటి పక్షపాత ధొరణిలేకుండా పరి శోధన చేస్తూ సమాజంలో శాంతకి భంగం కలగ కుండా ఎల్లప్పుడూ అప్రమతత్త తో ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ధృడంగా కోరుకుంటుది.