సమకాలిన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోవటమే మన బలహీనత

పాక్‌ ప్రేరిపిత ఉగ్రవాద మూకలు మరో దారుణానికి ఒడిగట్టాయి. జమ్ములోని నగ్రోటలో సైనిక స్థావరంపై నవంబరు 29న దాడి చేశారు.ఆ క్రమంలో ఏడుగురు జవానులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పోలీసు దుస్తులతో ఆర్మీ ఉన్న ప్రదేశాలలో ప్రవేశించి రెండు భవ నాలలోకి వెళ్లి సైనికులపై కాల్పులు ప్రారం భించారు. ఆ భవనాలలో 12మంది జవాన్లు, ఇద్దరు మహిళలు, నెలల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని రక్షించేందుకు సైన్యం ఆచితూచి పోరాటం చేయాల్సి వచ్చింది. 


ఆ క్రమం లో ఏడుగురు సైనికులు బలిదానమైనారు. పాక్‌ ప్రేరిపిత ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించేందుకు కొత్త కొత్త మార్గలు వెతుకుతున్నారు. ఈ సారి ఒక చిన్నసొరంగంలోని నుంచి ప్రవేశించారు. గతంలో కూడా ఉగ్రవాదులు సైనిక దుస్తులు, పోలీసుల దుస్తులతో ప్రవేశించి తమ పనులు సులువుగా నేరవేర్చుకోవటానికి ప్రయత్నించిన సంఘటనలు జరిగాయి. ఉరి సంఘటనకు ప్రతిగా జరిగిన దాడి తదుపరి వరుసక్రమంలో దాడులు జరుగుతునే ఉన్నాయి. నిరంతర జాగృతితో వ్యవవహారిస్తూ కూడా మన సైనికులు బలిదానం చెందుతున్నారు. పాకిస్తాన్‌ కాళ్ల బేరానికి వచ్చిందని రక్షణమంత్రి ప్రకటించిన కొద్ది కాలానికే ఈ దాడి జరిగింది. తమ ప్రాణాలు గాలిలో కలిసి పోతాయనే విషయం తెలిసి కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. తాము చనిపోతు శత్రువులను చంపుతూ శత్రువులకు నష్టం కలిగించాలని, భయాన్ని కల్పించాలని లేక అభద్రత భావాన్ని నిర్మాణం చేయ్యలనేదే వాళ్ల పాచిక. కశ్మీర్‌లోకి కాని మరో చోటనైన కాని స్థానికుల సహకారం లేకుండా ఏ శత్రు మూకలు తమ పనిని నేరవేర్చుకోలేరు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎవరు సహకరిస్తున్నారో గుర్తించడంలో మనం ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి.
కశ్మీర్‌ లక్ష్యంగా పెట్టుకుని స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల నుంచి పాకిస్తాన్‌ మనతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యుద్ధం చేస్తునే ఉంది. నిరంతరం దాడులు చేయడమనేది దాని మౌలిక లక్ష్యంగా పెట్టుకుంది. అటువంటి శత్రువులకు మనం సరైన సమాధానం చెప్పడంలో విఫలం అవుతున్నా ము. ముంబాయిలో దాడి, కార్గిల్‌ యుద్ధం ఇలా చెప్పుకుంటే పోతే చిన్నా చితక సంఘటనలు అనేకం. పాకిస్తాన్‌ 1948లో కశ్మీర్‌పై దాడి చేసిన సమయం నుంచి ఇప్పటి వరకు మన విధానం ఆత్మరక్షణ గానే కొనసాగుతోంది. దానికి ఇప్పటికే ఎంతో మూల్యం చెల్లించుకున్నాము.
ఇస్లాం చరిత్రను గమనించినట్లయితే దానిపై ఎదురు దాడి చేసిన ప్రతి సంఘటనలో ఇస్లాం సైనికులు వేనకడుగు వేసినట్లు కనబడుతుంది. దాడులను కాచుకుంటూ ఆత్మరక్షణకు మనం చేసే ప్రయత్నం వాళ్లకు మరింత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుందని భారతదేశ చరిత్రలో ఇస్లాం దాడుల చరిత్రను గమనించినట్లయితే మనకు అర్థం అవుతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థి తులలో పాకిస్తాన్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చి ఎదురుదాడి చేయాలి. లేకపోతే పాకిస్తాన్‌ నుంచి ఇదే విధంగా దాడులు కొనసాగు తూనే ఉంటాయి. మన సైనికులు, సామాన్య ప్రజలు బలి పశువులు అవుతూనే ఉంటారు. ఇప్పటికీ మనం ఎటువంటి శత్రువుతో ఎట్లా వ్యవహరించలో నేర్చుకోకపోవటం మన బలహీనత అదే పాకిస్తాన్‌కు బలం.