పడుపు వృత్తి- పసికూనల వ్యాపారం- ముష్టి మాఫీయాల అంతం ఎప్పుడు?

మధ్యయుగాల కాలంలో ముస్లింలు బందీలుగా పట్టుకొన్ని వారిని సంతలలో పెట్టి అమ్మెవారని విన్నాము. ఈ రోజుల్లో కూడా మనుషుల వ్యాపారం సాగుతున్నది అని చెప్పటం నిజంగా సిగ్గుచేటైన విషయం. పశ్చిమ బెంగాల్‌లో ఏళ్ళ తరబడి శిశువుల వ్యాపారం సాగుతున్నది.


కోల్‌కత్తాకు 50 మైళ్ళ దూరంలో బదూరియాలో పసిపిల్లలని క్రయ కేంద్రం నడుస్తున్నది. దత్తతత పేరట సాగే ఈ వ్యాపారంలో వైద్యశాలలు, దళారులు, కోర్టు గుమాస్తాలు, స్వచ్ఛంద సంస్థలు కలగలసి మూడు సం||లకు పైగా ఈ వ్యాపారం చేస్తున్నారని తెలుస్తున్నది. మగ పిల్లలైతే మూడు లక్షలు, ఆడపిల్లలు అయితే లక్ష రూపాయలు వ్యాపారం నడుస్తున్నది. పుట్టి పదిరోజులైన కానీ పసిపిలల్లల్ని గుడ్డలో చుట్టి బిస్కెట్లు సరఫరా చేసే పెట్టేల్లో పెట్టి దొంగచాటుగా తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య రాయపూర్‌ జంక్షన్‌లో 500 మంది అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకొని వారందరిని అక్కడి రైల్వే పోలీసులు కాపాడారు. భారత్‌లో మగపిల్లలని బానిస శ్రామీకులుగా- ఆడపిల్లలని అంగడిబొమ్మలు విక్రయించే ముఠాలు పెచ్చు పెరుగుతున్నాయి.
ఈ పనిలో 60%కి పైగా బీహారీలు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌, సిక్కిం, జార్‌ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అండమాన్‌నికోబార్‌ దీవుల నుంచే ఉన్నాయని తెలుస్తున్నది. ఇంకో భయంకరమైన సత్యం దేశంలోని మెట్రోనగరాలలో వ్యవస్థీకృతంగా ముష్టిమాఫియా యధేచ్ఛగా సాగుతున్నది. ఇట్లా అపహరించి తెచ్చిన పిల్లలె పెట్టుబడిగా ఆ వ్యాపారం సాగుతున్నది. సం||రానికి షుమారుగా లక్షమంది ఇలా అపహరణకు గురి అవుతున్నారని ముష్టి మాఫియా సంపాదన సంవత్సరానికి రూ.180 కోట్లు దాటుతున్నదని ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి.
ఇటువంటి ముఠాల ఆటకట్టించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాలను హెచ్చరించింది. ముష్టికి వచ్చేవాళ్ళ నిజమైన ముష్టివాడు ఎవడు? మాఫీయా చేతుల్లో ఉండే ముష్టివాడు ఎవడూ మనకు తెలియదు. నీచాతి నీచంగా సాగుతున్న పడుపు వృత్తి ఆడప్లిలలను ఎత్తుకెళ్ళి వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ వృత్తిలో దింపి కాసులు పండించుకొంటున్న వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించాలి. అమానుషమైన ఈ మాఫియాలను అంతం చేసేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.