కలియుగ భగీరథుడు

రత్నాగర్భంగా పేరుగాంచిన భరతభూమిలో జన్మించిన ఘనులెందరో. దివి నుంచి పావనగంగాను భూమి మీదకి దించిన భగీరథుని చరిత్ర మనమంత ఎరిగినదే.! కర్నాటకలోని మళనాడు గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌, నీటి కోసం తన తల్లి పడే యాతనలు చూడలేక పోయాడు. సుదూర ప్రాంతాల నుంచి రాత్రి పూట మంచినీరు మోసుకోస్తున్న కన్నతల్లీని చూసి చలించిపోయిన పవన్‌కుమార్‌ తన ఇంటి వెనుకనే 45దినాలు కష్టపడి 52అడుగుల లోతైన బావి త్రవ్వాడు. ఆ బావిలో సమృద్ధిగా ''జలం'' పడటం వల్ల మతృమూర్తి కష్టాలు తొలగిపోయాయి. పరిసర ప్రజలందరూ పవన్‌ను అపర భగీరథుడని కీర్తిస్తున్నారు. - ఈనాడు