వకుళమాత గుడి అక్కడే ట్టాలి - హైకోర్టు తీర్పు

ఏడుకొండలవాడి మాత మూర్తి వకుళమాత ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నచోటే పునర్నిర్మించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. చిత్తూరు జిల్లా, తిరుపతి బైపాస్‌ రోడ్డు పేరూరులో శిథిలావస్థలో ఉన్న వందల ఏళ్లనాటి వకుళమాత గుడిని పునర్నిర్మించాలంటూ 2009లో టీటీడీ చేసిన తీర్మానాన్ని సమర్థించింది.


 ఆ తీర్మానాన్ని అనుసరించి.. ఆగమశాస్త్ర ప్రకారం ఆ దేవదేవుడి తల్లి ఆలయాన్ని నిర్మించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఈ గుడిని పునర్నిర్మించాలంటూ టీటీడీ తీసుకున్న నిర?యం వల్ల తాము ఉపాధి కోల్పోతామని.. అక్కడ రాళ్లు కొట్టడానికి వీలుకాదని, కాబట్టి ఆలయాన్ని మరోచోటుకు తరలించాలని కోరుతూ వరాల రెడ్డి అనే ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు.