మాతృశక్తి సహకారంతోనే పరమవైభవం

రాష్ట్ర సేవికా సమితి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు (నవంబర్‌-11, 12, 13) ''ప్రేరణా శిబిర్‌-2016'' ను నిర్వహించబడింది. దీనికి దేశ నలుమూలల నుంచి 2500 మంది సేవికా సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. శిబిర ప్రాంగణం భారత్‌ యొక్క చిన్నరూపం దర్శనమిచ్చింది. 

ఇందులో లడఖ్‌ నుండి కాశ్మీర్‌ వరకు, సౌరాష్ట్ర నుండి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు ఉన్న వివిధ ప్రాంతాల వైవిధ్యతను ప్రతిభింబించేలా వేషధారణ అక్కడ కనబడింది. ఈ ప్రేరణా శిబిరాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సరసంఘచాలక్‌ మాననీయ శ్రీ మోహన్‌ జీ భాగవత్‌ ప్రారంభించారు. వారు తమ ప్రసంగంలో మాట్లాడుతూ ''భారత దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు అని, నేడు అది ప్రపంచానికి ఒక స్ఫూర్తిదా యకం. కుటుంబానికి మనుషులందరినీ ఒక దగ్గరికి చేర్చే శక్తి ఉంది. దానికి కేంద్రబిందువు ఆ మాతృ శక్తి. ఆ మాతృ శక్తి సహకారం లేకుండా దేశాన్ని పరమ వైభవ స్థితికి చేర్చలేము. అట్లే ప్రపంచాన్ని ఆ దిశగా కూడా నడిపించలేము అని అన్నారు. ఇదే వేదికపైన సేవికా సమితి వారి ''ప్రేరణాంజలి'' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గత 80 సంవత్సరా లలో సేవికా సమితి సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రముఖ కార్యవాహిక అన్నదానం సీత వివరించారు. శిబిరం సమారోప్‌ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ సంచాలిక శాంతక్క మాట్లాడుతూ కశ్మీర్‌ లోయలో ఉన్న యువకులను, అదే విధంగా దేశంలోని మిగితా ప్రాంతాలలో ఉన్న యువతను కుల మతాల ఆధారంగా విభజించడానికి పకడ్బందీ ప్రణాళికలు అమలు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కొవడానికి ఇప్పటి యువతరానికి ఒక సానుకూలమైన దిశను చూపడం అట్లే వారిని అందరితో కలుపుకుంటూ సన్మార్గంలో దిశానిర్దేశం చేయడం ప్రస్తుత తరుణంలో అత్యంత ఆవశ్య కం అని అన్నారు. రాష్ట్ర సేవికా సమితి చేపట్టే వివిధ సామజిక కార్యక్రమాల వలన యువత లో చైత్యన్యం తీసుకొని రావడం, దేశభక్తిని జాగూరకత చేస్తూ ఒక నిర్మాణాత్మక దిశలో వారిని నడిపే ప్రయత్నం చేస్తున్నది. సమాజంలో పెరుగుతున్న విభేదాలపై శాంతక్క ఆందోళన వ్యక్తం చేస్తూ భౌతకపరమైన జీవన శైలి మరియు మత్తు పదార్థాల నుండి యువతను దూరం చేయడానికి మనం అందరం ప్రతిజ్ఞ చేయాలి. యువతన ముందు సార్ధక జీవిత లక్షాలను పెట్టడం అవసరం. మన దేశంలోని యువతకు ప్రతిభ, మేధస్సు, శ్రద్ధ లాంటి గుణాలు పుష్కలంగా ఉన్నావి. కేవలం వాటిని మరింత వికాసం చేయాల్సిన కళ మాత్రమే మనం అలవర్చుకోవాలి. వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయడంలో కుటుంబం యొక్క పాత్ర కీలకం. భారతీయ కుటుంబాలలో మంచి సంస్కారాలను అందివ్వడం అనేది మనకు తరతరాలుగా వస్తున్నది. శిబిరంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశిస్తూ అసభ్యంగా, ఆడంబరపూరితమైన జీవనానికి దూరంగా ఉంటూ, మంచి గుణగణాలతో జీవించాలని కోరారు. వివాహం లేదా ఇతర సామాజిక పండుగల సందర్భంలో ఆడంబరాలకు పోకుండా సాధారణ, రుచికరమైన భోజనాన్ని వడ్డించాలి. కార్యకర్తలు తమ సమయాన్ని సమాజం, దేశం సేవ కొరకు మరియు మానవీయ విలువలు పెంపొదించడానికి ఉపయోగించాలి. అందరితో కలిసి పంచుకోవడం, ఆప్యాయతతో ఉంటూ స్వార్థ పూరిత ఆలోచనకు దూరంగా ఉండాలి.
ఇటీవల మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాలో ఏర్పడిన నీటి ఎద్దడిని అక్కడి మహిళలు కులమతాల హద్దులను చెరిపివేస్తూ నీటి సమస్యను పరిష్కరిం చుకున్నారు. వారిని ఈ సందర్భంగా అభినందిం చారు. ప్రపంచ వ్యాప్తంగా క్షీణిస్తున్నా పర్యావరణంపై అందరిలో చింతన ఉన్నది. భారతీయ తత్వజ్ఞానం ప్రకారం మనిషి, ప్రకృతి ఒకే అంశం, ప్రకృతి ఏ విధంగా పంచ భూతాతో ఉంటుందో అదే విధము గా మనవ శరీరం సైతం పంచభూతాలతో నిర్మితం అవుతుందనేది సత్యం అదే మన విశ్వాసం. పర్యావరణానికి హాని తలపెట్టడం అంటే మనకు మనం నష్టం చేసుకోవడమే. పరిమితమైన, అదుపుతో కూడిన వినిమయమే పర్యావరణాన్ని పరిరక్షించడానికి గల ఉత్తమమైన మార్గం. ప్రస్తుతం స్త్రీ పురుషుల మద్య ఉన్న సంబంధాలపై సమాజంలో అనేక విషయంలో విభేదాలను ఈరోజు చూస్తున్నాము. పురుషులు మహిళల పట్ల ఉన్న చిన్న చూపు, వారిని ఒక వినియోగ వస్తువుగా చూసే ధోరణి పోవాలి. స్త్రీ, పురుషుడు ఒకరికి ఒకరు పూరకమే కాని పోటీ కాదు. సమయానుకూలంగా వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకొని విలువలతో కూడిన జీవనం కొనసాగించాలని సమితి భావిస్తోంది.వ్యక్తిగత గౌరవం, ఆత్మ విశ్వాసం, ప్రేమ, సంవేదన అనేవి మహిళల సహజ లక్షణాలు. గత 80 సంవత్సరాలుగా సమితి మహిళలలో అంతర్గతంగా ఉన్న శక్తిని సానబెట్టే పనిలో ఉన్నది. భారతీయ మహిళలు ఇప్పటి వరకు సాధించిన పురోభివృద్ధి, సమాజ గుర్తింపుపై సమితి సంతృప్తి వ్యక్తం చేస్తుంది. ప్రపంచం ఇప్పుడు ఎంతో ఆశతో భారత్‌ వైపు చూస్తోంది. మన పూర్వీకులు అందించిన యోగ, ఆయుర్వేద శాస్త్రాల పట్ల గౌరవ భావాన్ని ఏర్పరుచుకున్నది. భారతీయలు నిత్యం ఉపయోగించే పసుపు, వేపపై హక్కులకై ప్రయత్నాలు జరుగుతున్నవి. ఐక్య రాజ్య సమితి జూన్‌ 21ని అంతర్జాతీయ యోగ దినంగా ప్రకటించింది. భారతీయుల ఆలోచన విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా తమ రోజువారి విషయాలుగా అలవార్చుకుంటు న్నారు. ఇటివలే రామాయ ణం,మహాభారతం,భగ వద్గీతలను నెదర్‌ల్యాండ్స్‌ దేశం వారు 4-11 మధ్య వయసు ఉన్న పిల్లలకు బోధించే పాఠ్యాంశంగా చేర్చారు. గురుపూర్ణిమ, దీపావళి పండుగలను ఈ సంవత్సరం అమెరికా పాఠశాలల్లో,వైట్‌ హౌస్‌లో అధికారికంగా నిర్వహించారు. మహిళలు తమ సంప్రదాయాలను, విలువలను పెంపొదించ్చు కుంటూ దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలి అని ''వసుధైవ కుటుంబకం'' అనేది భారతీయ దృక్పధం అని భారతీయ మహిళలు మాత్రమే మన దేశాన్ని శక్తివంతంగా చేస్తూ స్థిరమైన ప్రపంచ శాంతి కు కావలసిన పునాదులు వేయగల రు అని నమ్మకాన్ని శాంతాక్క తన ప్రసంగంలో వెలిబుచ్చారు.
ఈ శిబిరంలో పాల్గొన్న పార్లమెంట్‌ లోక్‌సభ స్పీకర్‌ శ్రీమతి సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ కుటుంబంలో స్త్రీ యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. ఎందుకంటే సమాజంలో సంస్కృతి, సామజిక సమరసత, ఆర్థిక పురోభివృద్ధికి మూలం కుటుంబం అవుతుంది అందులో స్త్రీలది ప్రముఖ పాత్ర. సమాజం యొక్క ఆధారం కుటుం బం అయితే, కుటుంబం యొక్క ఆధారం స్త్రీ. ఈ శిబిరంలో పారఒలింపిక్‌ రజిత పతక విజేత దీపా మాలిక్‌ను సన్మానించారు. ప్రముఖ శాస్త్రవేత్త డా. వి శుభాజీ తదితరులు పాల్గొన్నారు.