అనూహ్య స్పందన

హితం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నరేంద్రమోది ప్రధానిగా ఎన్నో సాహసోపేతమైన బాధ్యతలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్‌ భారత్‌లో ''దొంగ నోట్ల'' వర్షం కురిపిస్తూ మన ఆర్థిక రంగాన్ని అతలకుతలం చేయాలని చూస్తోంది.


 నల్లధనం కూడా దేశానికి ఒక పెద్ద సమస్యగా పరిగమించిన నేపథ్యంలో నవంబరు 9 రాత్రి నుంచి రూ.100.500 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి ఆదేశాలు ఇచ్చారు. గతవారం నుంచి బ్యాంక్‌లలో ఎటిఎంలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్ప టికీ కూడా దేశ ప్రజలందరూ ప్రధాని చర్యను శ్లాఘిస్తు న్నారు. ప్రతి పక్షాలు రెచ్చగొట్టినప్పటికీ కూడా ప్రజలు ప్రభుత్వ చర్యను సమర్ధించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలి గిస్తున్నది. మోది ప్రభుత్వం ఏర్పాడి రెండున్నర సంవ త్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా మోదిపై ఎటువంటి ''తిష్ఠ వ్యతిరేకత'' (ఎంటీ ఇన్‌కంబెన్సీ) లేకపోవడం గమ నార్హం. ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని ఈ విధం గా సమర్థిచండం మన చరిత్రలోనే అరుదు.