ఎన్నెన్నో సంబురాల సంక్రాంతి

ఎన్నెన్నో సంబురాలను తెచ్చే సంక్రాంతి పండుగ మళ్లీ వస్తోంది. మంచిని తెచ్చేది, కలిగించేది మళ్లీ మళ్లీ వస్తుండాలి. కోట్లాది భారతీయులు సూర్య గమానాన్ని అనుసరించి జరుపుకునే పండుగ సంక్రాంతి. సూర్యుడు ఈ సమయంలో మకరరాశిలో ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశంతోనే కాల చక్రంలో ఒక క్రాంతి అంటే మార్పు వస్తుంది. దక్షిణాయనం వెళ్లి ఉత్తరాయణం వస్తుంది. రాత్రి సమయం క్రమంగాతగ్గి పగటి సమయం పెరుగుతోంది. అంటే ప్రాణకోటి జీవితం చీకటి నుంచి ఎక్కువ సమయం వెలుగులో ఉంటుంది. మనిషి ఎక్కువ సమయం జాగురుకుడై ఉండటానికి, క్రియాశీలుడు కావాడానికి మంచి పనులను చేసుకోవాటానికి అవకాశముండే కాలం. కాబట్టి ఇది పుర్వకాలం.