మత రాజకీయంపై 'వేటు'

చట్టంలో ఉన్న నిబంధనను సర్వోన్నత న్యాయ స్థానం ధ్రువపరచింది. ప్రజాప్రాతినిధ్యపు చట్టం- రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ యాక్ట్‌-లోని నూట ఇరవై మూడవ నిబంధన ఎన్నికల అవినీతి పద్ధ తుల- కరప్ట్‌ ప్రాక్టీసెస్‌-ను గురించి వివరిస్తోంది. ఈ నిబంధనలోని మొదటి ఉప నిబంధన ప్రకారం వోటర్లకు లంచం ఇవ్వడం అవినీతి. అక్రమంగా వోటర్లను ప్రభావితం చేయడం రెండవ ఉప నిబంధన ప్రకారం మరో అవినీతి పద్ధతి. 'మతం, వర్ణం కులం, సముదాయం, భాషల ప్రాతిపదికగా తమకు వోటు వేయమని కాని తమ ప్రత్యర్థులకు వోటు వేయరాదని కాని వోటర్లను అభ్యర్థి కాని అతని అనుమతితో అతని ప్రతినిధి- ఏజెంట్‌- కాని ఇతర సహచరులు, అనుచరులు కాని కోరడం అవినీతి పద్ధతి' అని ఈ నిబంధనలోని మూడవ ఉప నిబంధన నిర్దేశిస్తోంది.
పూర్తిగా చదవండి