గ్రామీణ క్షేత్రానికి పెద్దపీట వేసిన తొలి బడ్జెట్‌

ఫిబ్రవరి 1వ తేదీ నాడు కేంద్ర ఆర్థిక మంత్రి 2గంటల ప్రసంగంతో 2017-18 సం|| బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు.ఆ బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎంతో ఆశపెట్టుకుని ఎదురుచూసారు. ఎందుకంటే పెద్దనోట్ల రద్దు తరువాత జరుగుతున్న పరిణామలను దృష్టిలో పెట్టుకుని ఎంతోకొంత మేలు తమకు జరిగే విధంగా ఉంటుందని ఆశిం చారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఆ ఆశలను నీరు గార్చకుండా చిగురింపచేసే విధంగానే బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ సారి ప్రతిపాదించిన బడ్జెట్‌ సంస్కరణల బడ్జెట్‌ అని అనవచ్చు. 
 

సంభాగ్‌ ఉద్యోగి సాంఘిక్‌ లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌

జనవరి 8, 2017, కేశవ్‌ మెమోరియల్‌ కాలేజీ నారాయణగూడ, సంభాగ్‌ (భాగ్యనగర్‌, సికింద్రాబాద్‌) ఉద్యోగి సాంఘిక్‌లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌ సంక్షిప్తంగా..

సంఘది 91 ఏళ్ల చరిత్ర. సంఘ ప్రారంభపు రోజుల్లో ఎవరూ మనం ఇప్పుడు చూస్తున్న భవ్యదశ్యాన్ని ఊహించి కూడా ఉండరు. కేవలం డాక్టర్జీపై నమ్మకం, విశ్వాసంతో పని చేసుకుంటూ పోయారు. ప్రారంభంలో సంఘం అంటే సమాజంలో ఉపేక్ష భావం ఉండేది. ఎవరూ మనను పట్టించుకునేవారు కాదు. కానీ మన కార్యం పెరిగినకొద్దీ అందరితోపాటు వ్యతిరేకుల దష్టి కూడా మనపై పడింది. నిష్ట, త్యాగాలతో కష్టమైన ఆ కాలఖండాన్ని దాటాం.

మానవ బాంబులే లక్ష్యంగా హైదరాబాద్‌లో కూడా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ 'స్ట్రీట్‌ దావా'

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిమేతర యువతే లక్షంగా చేసుకొని వారిని ఇస్లామిక్‌ తీవ్రవాద సమర్ధకులుగా, సమయాన్నిబట్టి వారిని మనవ బాంబు లాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ''స్ట్రీట్‌ దావా'' అనే ఇస్లామిక్‌ తీవ్ర వాద సంస్థ భారత దేశంలోని కొన్ని నగరాలలో అనధికారికంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తుంది. ప్రస్తుతుం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నయి లాంటి మహా నగరాలలో ప్రధానంగా ఐ టి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై ద ష్టి కేంద్రీకరించి పని చేస్తుంది.
జల్లికట్టు జగడం వెనుక దాగిన నిజాలు

ఇటీవల జలిలకట్టుపై పెద్ద జగడమే జరిగింది. పశుహింసను ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు గగ్గోలు పెడితే, గ్రామీణ సంస్కృతికి ఈ క్రీడ అద్దంపడుతుందని చాలామంది సమర్థించారు. సుప్రీంకోర్టు నిషేధాన్ని తొలగించి జల్లికట్టుకు అనుమతినివ్వాలని వేలాదిమంది ఉద్యమించారు. చివరికి కేంద్రం జోక్యంతో ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు కథ సుఖాంతమైంది. కొన్ని వారాలపాటు దేశప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ మొత్తం ప్రహసనంలో కొన్ని ఆందోళన కలిగించే, ప్రమాదకర ధోరణులు కూడా బయటపడ్డాయి. 

వినాయక నిమజ్జనం, దీపావళి టపాకా యలు, రంగురంగుల హోళీ, కృష్ణాష్టమి ఉట్లు కొట్టే పండుగ, జల్లికట్టు...ఇలా పండుగ, ఉత్సవం ఏదైనా 'పర్యావరణ పరిరక్షకులు', 'మేధావులు', 'జంతు ప్రేమికులు' మాత్రం ఆగ్రహంతో ఊగిపోతారు. ఇవన్నీ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఏర్పరచినవేనని, వాటి వల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదని వాదిస్తారు. వాటిని పూర్తిగా నిషేధిస్తే తప్ప ఈ ప్రపంచం సుఖంగా, శాంతిగా బతకలేదని నొక్కి చెపుతారు. అందుకోసం ఊరేగింపులు, ఉద్యమాలు నిర్వహిస్తారు.వివేకం.. యువత మమేకం..యువజాగరణలో సంస్కృతీ ఫౌండేషన్‌

'ఈ దేశం మీ చేతుల్లో ఉంది' అన్న వివేకా నందుని పిలుపు.. యువత హృదయాలలో ఎల్లప్పుడు మార్మోగి, ఈ దేశ పౌరుల్ని విలువలున్న, ఉత్తమ గుణాలు కలిగిన వివేకవంతులుగా తయారుచేయాల్సిన అవసరం వచ్చిందంటోంది హైదరాబాద్‌కు చెందిన 'సంస్కతి ఫౌండేషన్‌'. వివేకానంద జయంతిని పురస్కరించుకుని పలు స్ఫూర్తి దాయక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది.


జీవన స్ఫూర్తి.. మహిళా శక్తి..

మహిళలు అబలలు కాదు.. సబలలు అని నిరూపించే విధంగా ఎందరో భారతీయ మహిళలు తమ శక్తి సామర్థ్యాలను
ప్రపంచపు నలుమూలల చాటుతున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరు అని ముద్ర పడిపోయిన వృత్తి పనులను వారు కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా వాటిలో ఉత్తమ నైపుణ్యాన్ని కూడా కనబరుస్తున్నారు.
గృహ వైద్యం : వంటింటి పదార్థాలలో అతి ముఖ్యమైన వాము

వంటింటి పదార్థాలలో అతి ముఖ్యమైన వాము లేని వంటిల్లు ఉండదు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఇమిడిఉన్నాయి. వాము చేసే మేలు ఒక్కమాటలో చెప్పలేనిది. ఇది చిన్న చిన్న కడుపునొప్పుల నుండి పెద్ద పెద్ద (క్యాన్సర్‌ వంటి) వ్యాధులను నయం చెయ్యగలిగే ఔషధం.

కడుపు నొప్పిగా ఉన్నప్పుడు వాము, వేడినీళ్ళు, ఉప్పు కలిపిన కషాయం త్రాగవచ్చు. జలుబు చేసినప్పుడు (బాగా పడిశం పట్టినప్పుడు) ఈ వాముగింజలను కుంపటిమీద నిప్పులో వేసి, వచ్చేపొగనిపీల్చడం వల్ల ఉపశమనం కలుగుతుంది.