ప్రకంపనలు సృష్టిస్తున ట్రంప్‌ ప్రకటనలు

ముస్లింలు మెజార్టీ సంఖ్యలో 7దేశాలు ఇరాక్‌, ఇరాన్‌, సిరియా, సొమలియా, లిబియా, సురాన్‌, యమన్‌ ప్రజలు అమరికాకు రాకుండా 3నెలాలు నిషేధం విధించాడు. అట్లాగే మెక్సికో దేశంపై కూడా ఆంక్షాలు విధించాడు. ఇదంతా చూస్తుంటే ట్రంప్‌ తదుపరి లక్ష్యం భారత్‌ అన్న అనుమానం వ్యక్తం అవుతున్నది. అమరికాలో వివిధ ఉద్యోగాలలో భారతీయ సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగులు కల్పించే పేరుతో భారతీయులను ఏమైనా ప్రభావితం చేస్తాడా అనే ప్రశ్న ఎదురవుతుంది. తన దేశంలో మతస్వేచ్చను కాపాడటానికే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్ననని తన ప్రకటనను సర్ధి చెప్పుకున్నాడు. ట్రంప్‌ బాటలో కువైట్‌ కూడా 5 ముస్లిం దేశాల ప్రజలకు విసాల మంజూరుపై నిషేధం విధించింది.అందులో సిరియా,ఇరాన్‌, ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ దేశాలున్నాయి. ట్రంప్‌ ప్రకటనలపై ప్రపంచంలో అనేక దేశాల నుండి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ ఇంకా ఏం ప్రకటనలు చేస్తారని ఆందోళనతో ఉన్నాయి.