హితవచనం

కేవలం ప్రణాళిక వల్ల సుభాషితాల వల్ల శుభాకాంక్షల వల్ల ప్రగతి సాధ్యం కాదు. భౌతిక జీవనంలో బ్రహ్మ సాక్షాత్కా రమనే ఉన్నతాదర్శంగలవాడు సాక్షాత్తు శివ స్వరూపుడే అలాంటి మనుష్యులు నేడు కావాలి. నేడీ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి? దిన దిన ప్రవర్ధమవుతూన్న స్వార్ధమే దీనికి కారణం.. రాష్ట్రం పట్ల, దాని సంస్కృతి పట్ల అత్యంత ప్రేమే సంఘ ధ్యేయం. భారతమాత మన తల్లి. తల్లి అందవికారి కావచ్చు, చదువు లేక పోవచ్చు, మరెన్నో దోషాలుండవచ్చు. పృధ్విలో తల్లి ప్రేమను కొలిచే మాప దండం లేదని మన విశ్వాసం. ఈ విషయంలో సంధి షరుతులు లేవు. మౌలిక విషయాలలో సంధి షరతులు పూనుకుంటే రాష్ట్రం నాశనమవు తుందని మన విశ్వాసం. ఈ మన రాష్ట్రం సాక్షాత్తు పరమేశ్వర రూపంలో మన అందరి పూజలను, సేవలను కోరుతూన్నది. భారతీయతను సాక్షాత్కరించుకోవడమంటే ఇదే.

-ప.పూ శ్రీ గురూజీ