స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను నియంత్రించాలి

భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి దేశాన్ని అన్ని రంగాలలో శక్తివంతం చేసేం దుకు అనేక ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఆ ప్రయత్నాలకు సంబంధించిన సమీక్ష ఇంతవరకు సమగ్రంగా జరగలేదు అనడానికి అనేక ఉదహ రణలు చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో భారత సర్వోత్య న్యాయస్థానం సుప్రీకోర్టు ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి కేంద్రప్రభుత్వా న్ని నిలదీసింది. దేశంలో ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసే పేరుతో ప్రభుత్వ పథకాలు, ప్రజలకు మధ్య ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు పుట్టుగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. సొసైటీలు, ట్రస్టుల పేరుతో ఈ సంస్థలు రిజిష్ట్రర్‌ చేయించుకుని గుర్తింపు పొందిన సంస్థలుగా అవతరించాయి. వాటి సంఖ్య దేశంలో 32లక్షల దాకా ఉంది. ఇన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రపంచంలో బహుశా ఏ దేశంలో ఉండవు. మన జనాభతో పోలిస్తే ప్రతి 390మందికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నట్లే. ఈ సంస్థల్లో కొన్ని విదేశాలలోని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఇతరత్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకుని నిధులు సేకరి స్తున్నాయి. ఇలాంటివి దేశంలో 23వేలకు పైగా ఉన్నాయి. వీటిలో 20వేల సంస్థలను లెక్కలు సరిగా చూపని కారణంగా కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. దేశంలోని స్వచ్ఛంద సంస్థలు తమ ఆర్థిక వివరాలు అంటే సేకరించిన నిధులు, ఖర్చులు ప్రభుత్వానికి ఎంత వరకు సమర్పించాయో వివరాలు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో సిబిఐ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోని 32లక్షల స్వచ్ఛంద సంస్థల్లో 3లక్షల సంస్థలు మాత్రమే లెక్కలు సమర్చించాయని తెలిసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 6,654 కోట్ల రూపాయలు ఈ స్వచ్చంద సంస్థల చేతులో పోసినట్లుగా సమాచా రం. ఇన్ని కోట్ల రూపాయల సంబంధించిన లెక్కల వివరాలు తెలుసుకోకపోవ టంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, మార్చి నెలాఖరుకల్లా సేకరిం చాలని ఆదేశించింది. స్వచ్ఛంద సంస్థల వ్యవహా రాలను, కార్యకలాపాలను నియంత్రించే వ్యవస్థ ఇంతవరకు లేకపోవటం చాలా ఆశ్చర్యకర మైన విషయం. ఈ మధ్య ఇంటలిజెన్స్‌ బ్యూరో అం దించిన 21పేజీల నివేదికలో ఒక విషయం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. దేశంలో విదేశీ నిధులు అందుకుంటున్న పలు స్వచ్ఛంద సంస్థలు దేశ ఆర్థిక ప్రగతిని కుంగదీస్తున్నాయని తెలిసింది. ఇటువంటి సంస్థలను గుర్తించి వాటిని రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రగతి పారదర్శ కంగా ఉండాలంటే స్వచ్ఛంద సంస్థల నియంత్రణకు సంబంధించిన ఒక వ్యవస్థను రూపొందించడం తప్పనిసరి. ఈ మధ్య కాలంలో దేశానికి సంబంధిం చిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను డబ్బే శాసిస్తున్నది. రాజకీయ పార్టీలు డబ్బు ద్వారా అధికారాన్ని కొనుక్కుంటున్నాయి. రాజకీయ పార్టీలు విరాళాలు విపరీతంగా సేకరిస్తున్నాయి. 2004-05 నుంచి 11సంవత్సరాల కాలఖండంలో దేశంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలు, ఆ విరాళాలు ఎవరిచ్చారు అనే విషయం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆ విరాళాలలో 11,362 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినట్లుగా తెలుస్తున్నది. అందులో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా వచ్చినట్లుగా తెలుస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఆదాయంలో అజ్ఞాత విరాళాల వాటా 83%, బీజేపీ 65%, బీఎస్పీ 100% సమాజ్‌వాది పార్టీ 94% శిరోమణి అకాలీదళ్‌కు 87% నిధులు అందినట్లుగా తెలుస్తున్నది. ఎన్నికల ప్రక్రియను పార్టీలు సజావుగా నడిపేందుకు వాటిలో పార దర్శకత అవసరం. ఎన్నికల సంఘం ఈ విషయం లో కఠినంగా వ్యవహరించి ఎన్నికల్లో ధన బలాన్ని నిరోధించాలి. ఈ దిశలో ప్రయత్నాలు ప్రారంభం అయినట్లుగా తెలుస్తున్నది. దేశంలో ఎన్జీవోలు, రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దే విషయంలో ప్రజలు కూడా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువచ్చి దేశ సమగ్ర వికాసానికి కృషి చేయల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిధులను స్వాహా చేయడంలో స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలకు మధ్య ఉండే సంబంధాలను వెలుగులోకి తీసుకువచ్చి అభివృద్ధి పేరుతో ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఈ దోపిడి వ్యవస్థను అంతం చేయవలిసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది.