గృహ వైద్యం : వంటింటి పదార్థాలలో అతి ముఖ్యమైన వాము

వంటింటి పదార్థాలలో అతి ముఖ్యమైన వాము లేని వంటిల్లు ఉండదు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఇమిడిఉన్నాయి. వాము చేసే మేలు ఒక్కమాటలో చెప్పలేనిది. ఇది చిన్న చిన్న కడుపునొప్పుల నుండి పెద్ద పెద్ద (క్యాన్సర్‌ వంటి) వ్యాధులను నయం చెయ్యగలిగే ఔషధం.

కడుపు నొప్పిగా ఉన్నప్పుడు వాము, వేడినీళ్ళు, ఉప్పు కలిపిన కషాయం త్రాగవచ్చు. జలుబు చేసినప్పుడు (బాగా పడిశం పట్టినప్పుడు) ఈ వాముగింజలను కుంపటిమీద నిప్పులో వేసి, వచ్చేపొగనిపీల్చడం వల్ల ఉపశమనం కలుగుతుంది.