శివరాత్రి మహత్యము

సృష్టి ఆదిలో ఈ చరాచీర జగత్తు అంతా జలమయమై అంధకారము ఆవమించి వుండినది. కల్పాంతము తరువాత తిరిగి పున:సృష్టి చేయవలిసిన విది సృష్టి కర్త ఐన బ్రహ్మది. బ్రహ్మసృష్టి చేయ పూనుకొనగా ఊహస్పృజింపలేదు. పరిపరి విధములుగా ఆలోచించి సృష్టిచేయుటకు ఆశక్తుడై విశ్వమున విహరించుచుండగా సముద్రం మధ్యమున విష్ణువు శేషసాయి అయి పడుకొని ఉండెను. బ్రహ్మ విష్ణువును సమీపించి నీవు ఎవరవు అని అడిగాడు. అప్పుడు శ్రీమహవిష్ణువు నేను జగత్కర్తను ఈ చరాచర జగుత్తుకు ఆధార భూతుడు నేను అని విష్ణువు చెప్పగా ఈ జగుత్తు అంతటి సృష్టికర్తను నేను కనుక ఈ జగత్తుకు ఆధార భూతడను నేనని బ్రహ్మవాగ్వివాదమునకు దిగెను.ఈ విధము బ్రహ్మ-విష్ణువుల మధ్య వాగ్వివాదము నెలకొని ఇద్దరూ అహంకార పూరితులై వారి ఆధిపత్యమును ప్రదర్శింప దలిచారు.ఆ సమయంలో వారిద్దరి మధ్య 'పావక స్థంభ' రూపంలోకి జ్యోతిర్లింగ రూపంలో అధ:పాతాళ లోకం నుంచి ఊర్ధ్వలోకాల వరకు బ్రహ్మండమంతయు వ్యాపించిన స్థూపము ప్రత్యక్షమైనది. ఆ స్థూపమును చూసి ఆశ్యర్యము పొందిన బ్రహ్మ విష్ణువులు వారి అమంకారమును విడిచి, ఈ సృష్టియందు మనకంటే ఇతరమైన దివ్య శక్తి కలదని గ్రహించి, ఆస్థూపముయొక్క ఆది అంతములను తెలుసుకొనుటకు విష్ణువు ఆధోభాగానికి(క్రిందకు) బ్రహ్మా పై బాగానికి ప్రయణమయ్యరు. ఎంతదూరం ప్రయాణించి ప్రయాత్నించిన వారికి ఆ జ్యోతి రూపంలో వున్న స్థూపము యొక్క ఆది అంతములకు గుర్తించలేకపోయారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు తిరిగి యాధాస్థానానికి వచ్చి చేరుకున్నారు. విష్ణువు చిత్త శుద్ధితో నేను స్థూపము యొక్క ఆది మూలాన్ని గుర్తించలేక పోయాను అని ఒప్పుకున్నా కాని బ్రహ్మ అహంకారంతో తాను ఈ స్థూపము యొక్క అంతాన్ని చూశానని చెప్పాడు. అంతేకాకకుండా ఆ సమయంలో పై నుంచి క్రిందకు పడుతున్న మొగలి పువ్వును తాను ఈ స్థూప అంతాన్ని చూసినట్లుగా సాక్ష్యాన్ని చెప్పమన్నాడు. మొగలి పువ్వు అలాగే సాక్ష్యం చెప్పింది. అందుకు స్థూపకారంలో జ్యోతిర్లింగ రూపంలో వున్న పదము శివుడు ఆగ్రహించి చండికాశ్వరుడిని సృష్టించి బ్రహ్మ ఐదు ముఖాలలో అబద్దం చెప్పిన ఐదవ ముఖాన్ని ఖండించమన్నాడు. ఆ విధంగా బ్రహ్మా చతుర్ముఖ బ్రహ్మగా మిగిలిపోయాడు. అంతేకాదు తన ఉనికిని గురించి అసత్యమాడినందున భూలోకంలో ఎక్కడా బ్రహ్మకు ఆలయాలు గాని అర్చనాదులు గాని లేకుండా శపించాడు. అంతేకాదు బ్రహహ్మాకు తప్పుడు సాక్ష్యం చెప్పిన మొగలిపువ్వుకు పూజకు అర్హత లేనిదిగా శపించాడు. ఆ విధముగా సృష్టి నిర్వహణకు సృష్టి కర్తగా బ్రహ్మను. స్థితికర్తగా శ్రీమహావిష్ణువును నిర్ధారించి లయకర్తగా స్వయంగా తాను వ్యవహరిస్తూ ఈ విశ్వంలో సృష్టి-స్థితి-లయములను సమన్వయం చేసిన జ్యోతిర్లింగ రూపంలో తన స్వరూపాన్ని వ్యక్తం చేసిన రోజే మాఘ బహుళ చతుర్ధశి ఆ రోజు అర్ధ రాత్రి 12.00గం||లకు జ్యోతిర్లింగా ఉద్భవించినందున ఆనాటి నుంచి నేటి వరకు మాఘ బహుళ చతుర్ధశి నాడు అర్ధరాత్రి 12.00 గం||లకు లింగోద్ధవ కాలంగా పరిగణించడం జరుగుతుంది. ఆనాడు లయకారుడైనటువంటి పరమశివుని ఆరాధన నిమిత్తం శివలింగాన్ని నమక చమకాలతో అభిషేకించడం పగలంతా నిరాహారంగా ఉపవశించి రాత్రి జాగారము చేస్తూ శివతత్య ధ్యాన పరాయణులై లింగోద్భవ కాలంలో పరమ శివుని పూజలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
''కుర్యాత జగత: కృత్యం సర్దాదికం పుమాన్‌
శివరాత్రి అహోరాత్రం నిరాహారో జితేంద్రియా:
శివ పురణము
శివరాత్రినాడు పగలు రాత్రి ఉపవశించి జాగరణముతో శివుని పూజించుచూ తనలోని అంతర్గత శతృవులైన అరిషడ్వార్గాలను (కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్యార్యాలు) జయించి ఇంద్రియాలను జయించిన వారిగా జితేంద్రయులుగా మారడమే ఈ మహాశివరాత్రి మనకు అందిస్తున్న సందేశం.