స్ఫూర్తి

తమ సాధన కాలంలో శ్రీరామకృష్ణులు ఒక రూపాయిని. ఒక మట్టి ముద్దను పుచ్చుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలించి, ''ధనం.. మట్టి ముద్దే ధనం'' అని పలికారు. అలా పలికి ఆ వెంటనే రెండింటినీ గంగలో విసిరివేశారు. ఆయన యాభై ఒక్క సంవత్సరాలు జీవించి ఈ ప్రపంచంలో డబ్బు తాకకుండా జీవించ వచ్చునని రుజువు చేశారు. మథూర్‌, లక్ష్మీనా రాయణ్‌ మార్వాడీ గురుదేవులకు డబ్బు ఇవ్వ బోయారు. ఆయన డబ్బును నిరాకరించడమే కాకుండా తమను ప్రలోభపరచడానికి ప్రయత్ని స్తున్నారని వారిని గట్టిగా చీవాట్లు పెట్టారు.