సేవాభారతి, తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల చదువుకు బాసటగా పరుగు

సేవాభారతి తెలంగాణ ప్రాంతం వారు 2017 జనవరి 22న 'బాలికల విద్య కోసం పరుగు' ను నిర్వహించారు. ఈ పరుగులో 5300 మంది నమోదు చేయించుకోగా 4500 మంది పాల్గొన్నారు. వీరిలో 1650 మంది మహిళలు. విద్య, వివేకం, సామాజిక అవగాహన కలిగిన మగువ వివాహంతో పుట్టినిల్లు వీడి, భర్త చేయి అందుకుని మెట్టినింటిలో ఉంటూ కుటుంబ వ్యవస్థకు ప్రాణం పోసి, తద్వారా ఉన్నత సమాజ నిర్మాణానికి ఆధారం అవుతుంది. నిరుపేదల ఎక్కువగా వుండే నగరాల్లోని బస్తీలు, గ్రామాలలో కిశోరి వికాస్‌ కేంద్రాల ద్వారా ప్రతిరోజు పాఠశాల తర్వాత సాయంత్రం 2 గంటల పాటు 4 నుండి 10వ తరగతి చదువుతున్న బాలికలకు విద్య, ఆరోగ్య, వ త్తి విద్య, భారతీయ సాంస్కతిక విలువలు, స్వీయ శిక్షణ, వ్యక్తిత్వ వికాసం మున్నగు విషయాలలో శిక్షణను ఇస్తున్నారు. పూర్తిగాచదవండి