సంభాగ్‌ ఉద్యోగి సాంఘిక్‌ లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌

జనవరి 8, 2017, కేశవ్‌ మెమోరియల్‌ కాలేజీ నారాయణగూడ, సంభాగ్‌ (భాగ్యనగర్‌, సికింద్రాబాద్‌) ఉద్యోగి సాంఘిక్‌లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌ సంక్షిప్తంగా..

సంఘది 91 ఏళ్ల చరిత్ర. సంఘ ప్రారంభపు రోజుల్లో ఎవరూ మనం ఇప్పుడు చూస్తున్న భవ్యదశ్యాన్ని ఊహించి కూడా ఉండరు. కేవలం డాక్టర్జీపై నమ్మకం, విశ్వాసంతో పని చేసుకుంటూ పోయారు. ప్రారంభంలో సంఘం అంటే సమాజంలో ఉపేక్ష భావం ఉండేది. ఎవరూ మనను పట్టించుకునేవారు కాదు. కానీ మన కార్యం పెరిగినకొద్దీ అందరితోపాటు వ్యతిరేకుల దష్టి కూడా మనపై పడింది. నిష్ట, త్యాగాలతో కష్టమైన ఆ కాలఖండాన్ని దాటాం.