వివేకం.. యువత మమేకం..యువజాగరణలో సంస్కృతీ ఫౌండేషన్‌

'ఈ దేశం మీ చేతుల్లో ఉంది' అన్న వివేకా నందుని పిలుపు.. యువత హృదయాలలో ఎల్లప్పుడు మార్మోగి, ఈ దేశ పౌరుల్ని విలువలున్న, ఉత్తమ గుణాలు కలిగిన వివేకవంతులుగా తయారుచేయాల్సిన అవసరం వచ్చిందంటోంది హైదరాబాద్‌కు చెందిన 'సంస్కతి ఫౌండేషన్‌'. వివేకానంద జయంతిని పురస్కరించుకుని పలు స్ఫూర్తి దాయక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది.