ఇస్రో విజయంపై శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌

భారతదేశంలో కేవలం ఆధ్యాత్మిక విజ్ఞానంలోనే కాదు, భౌతిక విజ్ఞానరంగంలో కూడా అగ్రగామిగా నిలిచింది. ఆర్యభట్ట మరియు వరాహమిర నుండి మొదలుకొని అగణిత వైజ్ఞానిక పరిశోధనల వలన నేడు ప్రపంచంలో భారతదేశపు ఔన్నత్యం ప్రత్యేకంగా పేర్కొనబడుతున్నది.
ఇస్రో 104 ఉపగ్రహాలను ప్రయోగించి సఫలీకృతం కావడం ద్వారా తన విశిష్టతను ఇనుమడింప చేసుకున్నది.

పెరుగు వలన కలిగే ఫలితాలు

పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అదుÄతే ఫలితాలు పొందండి.
1. కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపు కుని తాగాలి. దీంతో జీర? సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటి వి తగ్గుతాయి.

'పద్మ' స్త్రీలు...

2017 గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటించిన పద్మ అవార్డులలో మహిళా కుసుమాలు వికసిం చారు. అవార్డులు దశాబ్దాల కాలంగా వారందిస్తున్న సేవలకు తగిన గౌరవం దక్కింది. పద్మ అవార్డులలో 19 అవార్డులు మహిళలు గెలుచుకున్నారు.
మీనాక్షి అమ్మ- ఏడుపదుల పైన వయస్సున ఈ అమ్మమ్మ అంటే కేరళ వారికి ఎనలేని అభిమా నం. సంప్రదాయ కళరి పట్టును కొనసా గిస్తూ ఎంతో మంది ఆత్మరక్షణ విద్యలో శిక్షణను అందిస్తోంది. యుద్ధ విద్యల విభాగంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కడత నట్టు కలరి సంఘం బాధ్యతలను 2007లో చేపట్టారు. 

గుడిబండ రామ్‌మందిరం - వనవాసి మరియు నగరవాసి మహిళల సంగమం

భాగ్యనగర్‌ సంభాగ్‌ వనవాసి కళ్యాణ్‌ పరి షత్‌ మహిళా విభాగం మరియు అచ్చంపేట్‌ మండ లం లోని గుడిబండ గ్రామస్తులు కలిసి కొన్ని అని వార్య కారణాల వలన ఆగిపోయిన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 9వ తేదీన ఒక ఉత్సాహ పూరితమైన వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో ''విగ్రహం ప్రతిష్ఠ'' కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం ఒక వనవాసి మరియు నగర వాసి మహిళా సంగమంలా కనిపించింది. నాలుగు సంవత్సరాల క్రితం, భాగ్యనగర్‌ సంభాగ్‌ (హైదరా బాద్‌ మరియు సికింద్రాబాద్‌) వనవాసి కళ్యాణ్‌ పరిషత్‌ మహిళా విభాగం నాగర్‌ కర్నూలు జిల్లా, అచ్చంపేట్‌ ''మల్లికార్జున నిలయం'' విద్యార్థుల పోషణ బాధ్యతను స్వీకరించింది. ఈ వసతి గహం లో చెంచు తెగకు చెందిన పిల్లలు ఉంటారు. 

భారతీయ విలువలతోనే అభివృద్ధి

ఈ దేశాన్ని తిరిగి వైభవోపేతం చేయాలంటే అసలు దీని మూల తత్వాన్ని తెలుసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ మోహన్‌భాగవత్‌ అన్నారు. భావూసాహెబ్‌ భుస్కుటే ప్రజా ట్రస్ట్‌ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌ భాగవత్‌ దేశమంటే ప్రజలు, నీటి వనరులు, అడవులు, భూమి, జంతువులు మొదలైనవని, ఇవన్నీ సక్రమంగా, సురక్షితంగా ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. 

కేరళ కమ్యూనిస్టుల హింసోన్మాదానికి వ్యతిరేకంగా నిరసన

కమ్యూనిస్టులు చేసే హత్యలన్నీ ఏదో తాత్కాలిక ఉద్రేకంలో చేసే హత్యలు కావు. అవన్నీ యోజన బద్ధంగానే చేస్తారు. వారు చేసే హత్యలలో అతిక్రూరత్వం, అమానవీయత, ఆటవికత కలగలిసి ఉంటాయి. చాలా హత్యలలో రాటుదేలిన హంతకులను డబ్బు చెల్లించి నియమించుకుంటారు. హంతకులకు ఆయుధాల సమ కూర్చడం, హత్య జరిగిన తర్వాత వారు ఆశ్రయం పొందే ప్రదేశాలు, వారు పారిపోవడానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని కామ్రేడ్లే చూసుకుంటారు.
సంకటంలో సిపిఎమ్‌
ప్రస్తుతం సిపిఎమ్‌ ఒక సంకటంలో ఉంది. మార్క్సిజం సిద్ధాంతాల్ని నూరిపోసి కార్యకర్తల గణం పెంచుకునే స్థితిలో లేదు. పోని ఉన్నవారైనా పార్టీని అట్టిపెట్టుకొని ఉంటున్నారా అంటే అదీ లేదు. రోజు రోజుకీ సభ్యుల సంఖ్య తగ్గిపోతోంది. కార్యకర్తలను అట్టిపెట్టుకోవడానికి అది హింసమార్గాన్నెంచుకుంది. 

ఎం. సి. జయదేవ్‌ జీ

18, ఫిబ్రవరి 1932న జన్మించిన మైసూర్‌ చెన్నబసప్ప జయదేవ్‌ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత న్యాయవాద విద్య అభ్యసిస్తున్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంసేవక్‌గా మారారు.
చదువు పూర్తయిన తరువాత జయదేవ్‌ బెంగళూరులోని ప్రముఖ హిందుస్థాన్‌ గ్యారేజ్‌ మోటార్స్‌లో కొన్ని సంవత్సరాలు పనిచేశారు. 1960లో బెంగళూరు మహానగర్‌ కార్యవాహగా బాధ్యతలు స్వీకరించిన జయదేవ్‌జీ 1975వరకూ చక్కగా నిర్వర్తించారు. బెంగళూరు మహానగర్‌లో ఎక్కువకాలం కార్యవాహ బాధ్యతలు నిర్వర్తించినవారిలో వారు కూడా ఒకరు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న జయదేవ్‌జీ జైలుశిక్ష అనుభవించారు. జ్యేష్ట ప్రచారక్‌ యాదవ్‌రావ్‌ జోషితోపాటు 1977లో జైలు నుండి విడుదలయ్యారు. 

భరతమాత సేవలో...

సమాజ కార్యం కోసం జీవితాన్ని సమర్పించి తుది శ్వాస వరకూ ఆ పనిలోనే నిమగ్నమైన అనేకమంది ప్రచారకులు ఉన్నారు. అలాంటి వారి లో రాంభావు హల్దేకర్‌, ఎం.సి. జయదేవ్‌లు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో పనిచేసిన జ్యేష్ట ప్రచా రక్‌లు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు స్వర్గస్థులయ్యారు.
రాంభావ్‌ హల్దేకర్‌
'హల్దేకర్‌జీ' గా అందరికీ తెలిసిన రామచంద్ర సదాశివ హల్దేకర్‌ 5.2.1930న మహా రాష్ట్రలోని శంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌) జిల్లా హల్తా గ్రామంలో జన్మిం చారు. హైదరాబాద్‌లో బిఎస్‌సి చదువు తున్నప్పుడే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పట్ల ఆకర్షితులై ప్రచారక్‌గా వచ్చారు. 

యుగపరివర్తకులు డాక్టర్‌ హెడ్గెవార్‌

భారతదేశ చరిత్రలో-1857 నుండి 1947 వరకు జరిగిన పరిణామాలు, ఆ మధ్య కాలంలో దేశంలో నిర్మాణమైన పరిస్థితులు వాటి ప్రభావం నుండి ఈ దేశం ఇంకా పూర్తిగా బయట పడలేదు. ఆ రోజుల్లో నిర్మాణమైన సంఘర్షణ ఇంకా కొనసా గుతూనే ఉన్నది. దానికి ముగింపు పలికినప్పడే ఈ దేశంలో సుస్థిరత నెలకొంటుంది. ఆ మధ్య కాలంలో ఈ దేశంలోనే అనేమమంది మహా పురుషులు జన్మించారు. ఆ మహా పురుషులలో యుగానుకూల మార్పులకు తెరలేపి పనిచేసిన వారితో పేర్కొనదగిన వారు డాక్టర్‌ కేశవరావు బలరాంపంత్‌ హెడ్గెవార్‌ వారిని డాక్టర్‌జీ అని పిలుస్తుంటారు. వారు ఉగాది పండుగ రోజున జన్మించారు. 1889 సం. ఏప్రియల్‌ 1న ఒక నిరుపేద కుటుంబంలో డాక్టర్‌జీ జన్మించారు. 

పాకిస్తాన్‌ హిందూ వివాహ చట్టం-2017

అల్ప సంఖ్యాక హిందువుల కోసం హిందూ వివాహ చట్టం-2017 పేరుతో పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టంపై అధ్యక్షుడి సంతకం కావలసి ఉంది. హిందువులు ఇటువంటి ఒక చట్టం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో వారి వివాహాలు అధికారికంగా గుర్తించబడుతాయి. 

ప్రతిక్రియాత్మక జాతీయ వాదానికి తెరలేపుతున్న పాశ్చాత్య దేశాలు

వలసల దేశమైన అమెరికాలో అక్రమవలసలు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్రమ వలస దారులను తిరిగివాళ్ళ దేశాలకు పంపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంపు ధృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా కనబడుతున్నది. అమెరికా అమెరికన్లదే అనే నినాదం అమెరికాలో జోరుగా విస్తరిస్తున్నది. దానితో ఉన్మాద చర్యలు కూడా ప్రారంభమైనాయి. గత వారం అమెరికా కాన్సాస్‌ నగర శివారు ఓలత్‌ లోని బార్‌లో శ్రీనివాస్‌ కూచిభొట్లను చంపిన విష యాన్ని పత్రికలలో చూశాం. ఎట్టకేలకు దానిని విద్వేష నేరంగానే పరిగణిస్తూ దర్యాప్తులు జరుపుతున్నట్లు ఎఫ్‌.బి.ఐ. ప్రకటించింది.

హితవచనం

హిందూ సంస్కృతిని రక్షించడానికి ఒక శక్తివంతమైన సంఘటన నిర్మించాలని అంటే, కేవలం సంఖ్యను పెంచడం కాక హిందువులలో ''మేమీ పనిచేయ గలమనే'' ఆత్మ విశ్వాసాన్ని జాగృతమొనరించడమే.
ప్రస్తుతం మనదేశంలో ఉంటున్న విదేశీయులు కాని, రేపు వద్దామని గాలి మేడలు కట్టుకొనే ఇతరులు కానీ, హిందూ దేశంలో హిందువులనణచాలనే దుస్సాహ సానికి తలపడలేనంత శక్తిని, సామర్థ్యాన్ని, సుదృఢ సంఘటనను హిందూ సమాజంలో నిర్మించడమే సంఘం చేయదలచుకున్న పని. 

అమరవాణి


శ్లో|| మ్లేచ్ఛానామపి సువృత్తం గ్రాహ్యమ్‌
గుణే నమతరః కార్యః
శత్రోరపి సుగుణో గ్రాహ్యః
విషాదస్యమృతం గ్రాహ్యమ్‌
మ్లేచ్ఛులదే అయినా మంచి నడవడికను గ్రహించాలి. ఇతరుల సద్గుణాలు చూచి అసూయ పడకూడదు. శత్రువు నుండైనా సుగుణం నేర్చుకోవాలి. విషంలో ఉన్నా అమృతం గ్రహించాలి.

అత్యంత పెద్ద తప్పిదం

లెఫ్టిస్టుల అత్యంత పెద్ద తప్పిదం ఏమిటంటే వారు ఇస్లామిక్‌ ఉగ్రభావ జాలాన్ని ఎన్నడూ ''ఒక ప్రజ్వలిత విషయం'' గా ఒప్పుకోనే ఒప్పుకోరు. దీనిని రైటిస్టుల నెత్తిన రుద్దేస్తారు. 
-తస్లీమా నస్రీన్‌, బంగ్లాదేశ్‌ రచయిత్రి

మహిళా శ్రమను జీడీపీలో లెక్కించాలి!

పార్లమెంటులో మహిళా రిజర్వే షన్‌ అమలు కావాల్సిందే. ప్రస్తుతం లోక్‌సభలో మహిళల ప్రాతినిథ్యం 11.3%గా ఉంది. విశ్వవ్యాప్తంగా మాత్రం ఇది 22.8%గా ఉంది. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వని సమాజం నాగరిక సమాజం అనిపించుకోదు. దేశంలో జీడీపీని లెక్కించే సమయంలో మహిళల శ్రమను, ఉత్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలా చేయకుంటే మహిళల పట్ల వివక్ష చూపుతున్నట్లే లెక్క.
- ప్రణబ్‌ ముఖర్జి, రాష్ట్రపతి

రామ మందిరం గురించి..

జ్యోతిష్యశాస్త్రంలో
-యోగి ఆదిత్యనాథ్‌, ఎంపి గోరఖ్‌పూర్‌
రామ మందిరం గురించి చెబుతూ ఎప్పు డైతే శ్రీరామచంద్రుడు వారి అమ్మమ్మ గారి ఇల్లు అయిన ఛత్తీస్‌గఢ్‌లో విరాజిల్లుతాడో అప్పుడే అయోధ్యలో భగవాన్‌ శ్రీరాములవారి భవ్య మందిర నిర్మాణమార్గం సుగమమై సాగలదు.

ప్రముఖులు మాట

గోఆధారిత - ప్రకృతి సహజమైన వ్యవసాయం ద్వారానే మానవులు మరియు రైతులు సురక్షితులుగా ఉండగలరు. విష పూరిత, రసాయనాల వాడకం వలన పంట భూమి రోగగ్రస్తమవడం ఖాయం 
-స్వామి రామ్‌దేవ్‌, యోగగురు  

స్ఫూర్తి

ఆవిడకి కేవలం 16 ఏళ్ళ వయస్సులో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా బోసు గారు నిధుల కొరకు, ఐ.ఎన్‌.ఏ వాలంటీర్ల కొరకు రంగూన్‌ కు వచ్చారు. ఆయన స్ఫూర్తివంతమైన మాటలకి ముగ్ధురాలై రాజమణి తన ఒంటిపైన గల ఖరీదైన వజ్రాల మరియు బంగారు నగలను ఐ.ఎన్‌.ఏ కు దానం చేసారు. ఆ మర్నాడే రాజమణి తండ్రిని కలుసుకొని 'మీ అమ్మాయి అమాయకత్వం వలన నగలన్నీ దానం చేసింది. 

ఉగాది

'ఉగాది' అన్న తెలుగు మాట ''యుగాది'' అన్న సంస్కృత పద రూపం. ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి క్రొత్త కల్పంతో బ్రహ్మ సృష్టిని ఆరంభించిన రోజు. దీనికి ఆధారం''సూర్య సిద్ధాంతం'' అనే ఖగోళ జ్యోతిష గ్రంధంలోని శ్లోకం.
''చైత్రమాస జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తడైవచ''- అంటే బ్రహ్మ కల్పం ఆరంభమే మొదటి యుగాది.