పాకిస్తాన్‌ హిందూ వివాహ చట్టం-2017

అల్ప సంఖ్యాక హిందువుల కోసం హిందూ వివాహ చట్టం-2017 పేరుతో పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టంపై అధ్యక్షుడి సంతకం కావలసి ఉంది. హిందువులు ఇటువంటి ఒక చట్టం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో వారి వివాహాలు అధికారికంగా గుర్తించబడుతాయి. 

బల వంతపు మత మార్పిడి కొంత వరకు తగ్గవచ్చు. పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ సభ్యుడు, న్యాయ వేత్త రమేశ్‌కుమార్‌ క్వానీ ఈ చట్టం సాకారం కావటానికి గత మూడు సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్‌లో ఇంతవరకు హిందువుల వివాహానికి గుర్తింపులేదు. ఈ చట్టం కారణంగా వివా హానికి కనీస వయస్సు 18గా నిర్ణయించబడింది. ఇక మీద వివాహితులైన హిందువులకు ''షాదీ పరథ్‌'' అనే ఒక ధృవ పత్రం ఇస్తారు. దీంతోనైనా హిందువుల స్థితిగతుల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం. 
మతమార్పిడి చేయరు - అందుకే తగ్గుతున్నారు
''హిందువులు మతమార్పిడి చేయరు. పైగా అన్ని మతాలను గౌరవించి ఆదరిస్తారు. కాబట్టే మన దేశంలో హిందువుల జనాభా తగ్గుతున్నది. ఏ ఇతర మతంలో లేదా ఇతర దేశంలో కూడా ఇటువంటి ఉదాత్తమైన స్థితి లేదు'' అని అన్నారు కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ ఉప మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు.
అరుణచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇటీవల ఒక ప్రకటనలో భారతీయ జనతా పార్టీ విమర్శిస్తూ బీజేపి అరుణచల్‌ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఆ విమర్శకు సమా ధానంగా కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజుపై వ్యాఖ్యలు చేశారు. మతోన్మాదానికి నారు వేసి నీరు పోసి పెంచి పోషించినది కాంగ్రెస్‌ పార్టీయే అనీ కానీ అదే పార్టీ ఇప్పుడు మరొకరిని విమర్శించటం విచిత్రం మంటూ మతరాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఇది తగదన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్‌
పాకిస్తాన్‌ ఒక దేశంగా విఫలం చెందినది. ఒక రాజ్యం గా మనలేక పోతున్నది. 18 కోట్ల 20లక్షల జనాభ గల పాకిస్తాన్‌ ప్రపంచంలో అత్యధిక జననాల రేటు కలిగిన దేశం. కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థ, విజృంభిస్తున్న తీవ్ర వాదం, ప్రమాదకరమైన అణ్వాయుధాలు, అదే పనిగా పెరుగుతున్న జనాభా మొదలైన సమస్యలతో పాకిస్తాన్‌ ప్రపంచం మొత్తానికే పెను ప్రమాదంగా మారిందని ఇస్లామాబాద్‌లో సీఐఏ డైరెక్టర్‌గా పనిచేసిన కేవిన్‌హల్‌బర్ట్‌ అన్నారు. పాకిస్తాన్‌ కుప్పకూలితే అది అందరీకి అశ నిపాతం అవుతుంది. కాబట్టి అమెరికా - అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు (ఐఎమ్‌ఎఫ్‌) పాకిస్తాన్‌ ధన సహయం చేస్తున్నాయని ఆయన అన్నారు. కాని పాకిస్తాన్‌ ఆ ధనాన్ని తీవ్రవాదులను పెంచి పోషించడానికి ఉపయోగిస్తున్నదని, తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.