కేరళ కమ్యూనిస్టుల హింసోన్మాదానికి వ్యతిరేకంగా నిరసన

కమ్యూనిస్టులు చేసే హత్యలన్నీ ఏదో తాత్కాలిక ఉద్రేకంలో చేసే హత్యలు కావు. అవన్నీ యోజన బద్ధంగానే చేస్తారు. వారు చేసే హత్యలలో అతిక్రూరత్వం, అమానవీయత, ఆటవికత కలగలిసి ఉంటాయి. చాలా హత్యలలో రాటుదేలిన హంతకులను డబ్బు చెల్లించి నియమించుకుంటారు. హంతకులకు ఆయుధాల సమ కూర్చడం, హత్య జరిగిన తర్వాత వారు ఆశ్రయం పొందే ప్రదేశాలు, వారు పారిపోవడానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని కామ్రేడ్లే చూసుకుంటారు.
సంకటంలో సిపిఎమ్‌
ప్రస్తుతం సిపిఎమ్‌ ఒక సంకటంలో ఉంది. మార్క్సిజం సిద్ధాంతాల్ని నూరిపోసి కార్యకర్తల గణం పెంచుకునే స్థితిలో లేదు. పోని ఉన్నవారైనా పార్టీని అట్టిపెట్టుకొని ఉంటున్నారా అంటే అదీ లేదు. రోజు రోజుకీ సభ్యుల సంఖ్య తగ్గిపోతోంది. కార్యకర్తలను అట్టిపెట్టుకోవడానికి అది హింసమార్గాన్నెంచుకుంది. అయితే కార్యకర్తను హంతకుడిగా మారుస్తున్నారు లేదా పోరాటంలో ఆమరుడవుతున్నాడు. కార్యకర్తలు తగ్గిపోతుండడంతో తమ హత్యా ప్రణాళిక అమలు చేయడానికి సిపిఎమ్‌ నాయకత్వం వృత్తిపరమైన హంతకులకై వెదుకుతున్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో అన్ని రాష్ట్రాలలో కమ్యూనిజం ఉంది. కాని నేడు అది లుప్తమైంది. కమ్యూనిస్టులకు కంచుకోట అనుకున్న బెంగాలులోనే అడుగంటిపోయింది. కేరళ, త్రిపురలలో కూడా ఆశాజనకంగా లేదు. నేడు కమ్యూనిజం 'వెంటిలేటర్‌'పై జీవితం కొనసాగిస్తోందని చెప్పవచ్చు. ఒకప్పుడు నెహ్రూ తర్వాత ఇక ఢిల్లీ గద్దెనెక్కేది ఇ.ఎమ్‌.ఎస్‌. నంబూద్రిపాద్‌ అని కమ్యూనిస్టులు భావించారు. ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగురుతుందని ఆశించారు. కాని అవి నిజం కాలేదు.
1957లో కేరళలో సిపిఎమ్‌ అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇపుడు మతతత్త్వవాదులు అన్నవారి సహకారంతోనే అధికారం పంచుకుంటున్నారు. 'ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఎందుకూ పనికిరాదని కొట్టేసిన' సిపిఎమ్‌ నేడు ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు వ్యతిరేకంగా అందరం ఒకటవుదామంటోంది. సంఘ సిద్ధాంతాలను అనుసరించే వారు అసెంబ్లీకి రాకుండా 'క్రాస్‌ ఓటింగ్‌'కు కూడా పాల్పడుతోంది. ఎన్ని చేసినా సిపిఎమ్‌ అన్నిట్లో విఫలమౌతోంది. ఢిల్లీ అసహనంతో రాజకీయ హత్యలకు తెగించి చేస్తున్న విధ్వంసానికి నిరసనగా దేశంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నవి. అందులో భాగంగా మార్చి 3న తెలంగాణలో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని 24 స్థలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో 15వేల మంది వరకు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ క్షేత్ర ప్రచారక్‌ శ్రీ శ్యాం కుమార్‌ గారు మాట్లాడుతూ ''విద్వేషమే మా సిద్ధాంతం''అని ప్రకటించిన స్టాలిన్‌ వారసులైన కమ్యూనిష్టులకు తొలినాళ్ళలో దేశంలో కొంచెం ఆదరణ లభించిందని, దాని ద్వారా కొన్ని రాష్ట్రా ల్లో వారు అధికారంలోకి కూడా వచ్చారని అన్నారు. కాని కొన్ని రోజుల్లోనే వారి నిజ స్వరూపం తెలుసుకున్న ప్రజలు ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించారని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌, కమ్యూనిజం మనదేశంలో ఒకేసారి ప్రారంభమయ్యాయి. కమ్యూనిజం పేరు మీద ఈనాటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 కోట్ల మందికిపైగా అతి కిరాతకంగా హత్యగావించబడ్డారు. ఆకర్షణీయమైన నినాదాల నడుమ కమ్యూనిజం మొదట్లో ప్రజల ద ష్టిని ఆకర్షించింది. కమ్యూనిజం ప్రపంచాన్ని ఎలుతుందని అందరు విశ్వసించారు. కాని వారి బండారం కొన్ని రోజుల్లోనే బయటపడింది. వారి అసత్య ప్రచారాలను ప్రజలు త్వరలోనే గ్రహించారు. ఈ దేశ మూలాలకు , ధర్మానికి కమ్యూనిజం సరిపడదని ప్రజలు తెలుసుకున్నారు. ఫలితంగా ఈనాడు కమ్యూనిష్టులు దేశంలో ఒక చిన్న మూలకి పరిమితం అయిపోయారు.
కాని సంఘం ప్రజల విశ్వాసంతో పెరుగుతూ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది సహించని కమ్యూ నిస్టులు సంఘంపై భౌతిక దాడులకు తెగబడ్డారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి మద్దతు పలికిన కమ్యూనిస్టులు దేశభక్త ఆర్‌ఎస్‌ఎస్‌ని నిలువరించడానికి అనేక హేయమైన దుశ్చర్యలకు పాల్పడుతోంది. వీటన్నిటినీ తట్టుకొని సంఘం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది.
దేశం క్లిష్ట సమయాల్లో ఉన్న ప్రతీసారి కమ్యూ నిస్టులు శత్రువులకు సహకరించారు. 1962 చైనా యుద్ద సమయంలో చైనాకి మద్దతు తెలిపిన కమ్యూస్టులు, ఎమర్జెన్సీ సమయంలో ఎమర్జెన్సీకి మద్దతు గా నిలిచి తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. అదే కమ్యూనిస్టులు ఈనాడు అఫ్జల్‌గురు లాంటి తీవ్రాదులకు వారసులుగా నిలిచి మరోసారి తమ దేశ వ్యతిరేకతను చాటుకుంటున్నారు.
ఈనాడు కేరళలో చాలామంది పాత కమ్యూ నిస్టులు సంఘంలో చేరుతున్నారు. వారిలో విద్యా వంతులు, ఉపాధ్యాయులు, అధికారులు, జడ్జీలు ఉన్నారు. ఇది సహించలేని కమ్యునిష్టులు ఒకనాటి సహచరులన్న కనికరం లేకుండా వారిపై దాడి చేసి హత్య చేస్తున్నారు. ఇటువంటి దాడులను ఎదుర్కొని తగిన బుద్ధి చెప్పే శక్తి సంఘానికి లేకనో లేక చేతకాకో కాదు. కాని ఆర్‌ఎస్‌ఎస్‌ హింసని విశ్వసించదు.సుహదాÄ్భవ శాంతియుత వాతావరణం కొరకు సంఘం నిజాయితీగా నయనార్‌, ఈఎం నంబూద్రిపాద్‌ లాంటి వారితో సంప్రదింపులు జరిపింది. కాని వారు వంచించే ప్రయత్నం చేసారు. కాబట్టి, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈనాడు సంఘం దేశవ్యాప్త ఆందోళనకు నడుం కట్టింది.