'పద్మ' స్త్రీలు...

2017 గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటించిన పద్మ అవార్డులలో మహిళా కుసుమాలు వికసిం చారు. అవార్డులు దశాబ్దాల కాలంగా వారందిస్తున్న సేవలకు తగిన గౌరవం దక్కింది. పద్మ అవార్డులలో 19 అవార్డులు మహిళలు గెలుచుకున్నారు.
మీనాక్షి అమ్మ- ఏడుపదుల పైన వయస్సున ఈ అమ్మమ్మ అంటే కేరళ వారికి ఎనలేని అభిమా నం. సంప్రదాయ కళరి పట్టును కొనసా గిస్తూ ఎంతో మంది ఆత్మరక్షణ విద్యలో శిక్షణను అందిస్తోంది. యుద్ధ విద్యల విభాగంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కడత నట్టు కలరి సంఘం బాధ్యతలను 2007లో చేపట్టారు. 
వి. కోటేశ్వరమ్మ - 92 సంవత్సరాల వి. కోటేశ్వరమ్మ విజయవాడలో మాంటిస్సోరి పాఠశా లను స్థాపించి మానసిక దివ్యాంగులైన పిల్లలకు విద్యను బోధిస్తున్నారు. ఆమె చేసిన కషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేశారు. విజయవాడ తాలుకాలో తొలి పట్ట భద్రురాలిగా 1945లోనే ఆమె గుర్తింపు పొందారు.
డాక్టర్‌ అనురాధ పౌడ్వల్‌ - డాక్టర్‌ అనురాధ పౌడ్వల్‌ గాయనిగా అందించిన సేవలకుగాను పద్మ అవార్డు పొందారు. ఫిల్మ్‌పేర్‌ అవార్డును నాలుగు సార్లు ఆమె దక్కించుకున్నారు. నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు గ్రహీత. ఇప్పటివరకు మొత్తం 8996కు పైగానే పాటలను ఆమె పాడారు. భజన సంకీర్తనలలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ భారతీయ భాషల్లో ఆమె పాటలను పాడారు.
బసంతి దేవి బిష్త్‌- బసంతిదేవి సంప్రదాయ కీర్తనలకు ఉత్తరాఖండ్‌లో ప్రముఖంగా వినిపించే పేరు. తన 40ఏళ్ల వయసులోనే కీర్తనలను పాడడం మొదలుపెట్టారు. ఆమె స్వరం శ్రోతలను ఇట్టే ఆకట్టు కుంటుంది. అందుకే ఆలిండియా రేడియోలో ఉత్తమ గాత్ర విభాగంలో ఆమె పేరుంటుంది. 63 ఏళ్ల బసంతిదేవి పలుమార్లు పద్మశ్రీ అవార్డుకు నామినేట్‌ అయినప్పటికీ, 2017వ సంవత్సరంలో ఆమెకు ఆ గౌరవం దక్కింది. ఆమె ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా వాస్తవ్యులు.
దీపా మాలిక్‌ (దీపా నాగపాల్‌) - దీపాల్‌ మాలిక్‌ 2016 సంవత్సరంలో జరిగిన పారా లంపిక్‌ షర్ట్‌ ఫుట్‌ విభాగంలో రజత పతకాన్ని సాధించారు. పారాఓలంపిక్‌లో పతకాన్ని సాధిం చిన తొలి మహిళ దీపా మాలిక్‌. 2012 సంవత్స రంలో భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది. క్రీడ లలో ఆమె ప్రతిభకు గాను పద్మశ్రీ అవార్డును ప్రభుత్వం అందజేసింది. హర్యాణా రాష్ట్రం, సోనిపట్‌ జిల్లా, బైస్వల్‌ గ్రామం లో సెప్టెంబర్‌ 30, 1970వ సంవత్సరంలో ఆమె జన్మించారు.
భావోవా దేవి - మట్టి గోడలపై అందమైన చిత్రాలు గీయడంలో భావోవా దేవిది అందేవేసిన చెయ్యి. 42 సంవత్సరాల వయసున్న ఆమెకు 13 సంవ త్సరాల నుంచే ఈ కళపై ఎంతో మక్కువ ఉండేది. బీహార్‌ రాష్ట్రం, మధుబని జిల్లా జిట్వాపూర్‌ గ్రామం. ఈ సంప్రదాయ కళకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సన్మానించింది.
అనురాధ కోయిరాల - మహిళల అక్రమ రవాణా బాధితులకు పునరా వాసం కల్పిస్తూ, వారిని వారి కుటుంబాల వద్దకు చేర్చడానికి గుర్తింపుగా నేపాల్‌కు చెందిన అనురాధ కోయిరాలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించి. మైథి నేపాల్‌ అనే పునరావాస కేంద్రాన్ని ఖఠ్మాండులో స్థాపించి నిర్వహిస్తున్నారు. నేపాల్‌-భారత సరిహద్దు ల్లో జరిగే మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఆమె కషి ఎనలేనిది.
సాక్షి మాలిక్‌ - భారత కుస్తీ క్రీడాకారిణిగా సాక్షి మాలిక్‌కు గుర్తింపు ఉంది. 2016జరిగిన ఒలంపిక్‌ పోటీల్లో పాల్గొని కాంస్య పథకాన్ని సాక్షి సాధించారు. హర్యాణ రోహతక్‌ జిల్లాకు చెందిన సాక్షి 2014లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో రజత, ధోహాలో 2015జరిగిన కుస్తీ పోటీల్లో కాంస్య పథకాలను సాధించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
దీపా కర్మకార్‌ - భారతదేశం నుంచి ఒలంపిక్‌ జిమ్నాస్టిక్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా క్రీడాకారిణి దీపా కర్మర్‌. 2016లో జరిగిన ఒలంపిక్‌ పోటీల్లో నాల్గవ స్థానంలో నిలిచారు. 2014లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పథకాన్ని సాధించారు. ఆమె ప్రతిభకు గాను పద్మశ్రీ అవార్డును పొందారు. ఆమె స్వరాష్ట్రం త్రిపుర.
నివేదిత బిడే - తమిళనాడుకు చెందిన నివేదిత బిడే రచయిత. సాహిత్యం, సామాజిక సేవలకు గాను ఆమెకు పద్మశ్రీ అవార్డు ను భారత ప్రభుత్వం అందించింది. కన్యాకుమారి లోని వివేకానంద కేంద్ర భారత వైస్‌- చైర్‌పర్సన్లుగా వ్యవహరి స్తున్నారు.
సునితి సాల్మన్‌ - ఎయిడ్స్‌ నివారణకు చేసిన పరిశోధనలకు, కషికి చెన్నయ్‌ వాస్తవ్యులైన సునితి సాల్మన్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. వైఆర్‌ గటినోడ్‌ సెంటర్‌ ఫర్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ను ఆమె చెన్నయ్‌లో స్థాపించారు. స్వతహాగా ఆమె ఓ మైక్రో బయాలజిస్ట్‌. జూలై 28, 2015వ సంవ త్సరంలో గతించారు.
గురు అరుణ మొహంతి - ఒడిస్సి నాట్యంలో చూపిన నైపుణ్యానికి, కళకు అందించిన సేవలకు గాను ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసింది. ఒడిస్సా వాస్తవ్యులు.
భారతి విష్ణువర్థన్‌ - కర్నాటకకు చెందిన ప్రముఖ నటి. నటన రంగంలో అందించిన విశేష సేవలకు గాను ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును అంద జేసింది. సంగీతం, నత్యం వివిధ విభాగాల్లో ఆమె సేవలను అందించారు.
పరస్సల బి.పొన్నమ్మల్‌ - కర్నాటక సంగీతంలో ఆమె అందించిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 16ఏళ్ల వయసు నుంచేే సంగీతం పట్ల మక్కువ కనబరిచే వారు.
సుఖ్రీ బొమ్మగౌడ - జానపద కళల విభాగంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కర్నాటక హళ్లక్కి ఒక్కలిగా గిరిజన తెగకు చెందిన ఆమె సుఖ్రీ అజ్జిగా సుపరిచయం.
ఎలా అహ్మద్‌ - అస్సంలో ఏకైన మహిళా పత్రికను నడుపుతూ సేవలందిస్తున్నందుకు గాను సాహిత్య విభాగంలో పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు.
భావన సోమయ్య - గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన భావన సొమయ్య పాత్రికేయురాలిగా సుపరిచుతు రాలు. రచయిత. సాహిత్యం రంగంలో చేసిన సేవ లకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అంద జేసింది.
డాక్టర్‌ భక్తి యాదవ్‌ - మధ్యప్రదేశ్‌ ఇండోర్కి చెందిన డాక్టర్‌ భక్తి యాదవ్‌ అక్కడి తొలి మహిళా మెడిసిన్‌ పట్టభద్రురాలు. వైద్య రంగంలో ఆమె చేసిన విశేష కషికి పద్మశ్రీ అవార్డును అందు కున్నారు.
యువరాణి మహాచక్రి సిరిన్ధరన్‌ - సాహిత్యం, విద్యా రంగాలలో అందించిన సేవలకు గాను థాయిలాండ్‌ యువరాణి మహాచక్రి సిరిన్ధరన్కు భారత అత్యున్నత పురస్కారం పద్మభూషన్‌ భారత ప్రభుత్వం ఆమెకు అందించింది. థాయిలాండ్‌ రాజు భూమిభల్‌ అదుల్యధేజ్‌ రెండవ కుమార్తె. ఏప్రిల్‌ 2, 1955వ సంవత్సరంలో ఆమె జన్మిం చారు. థాయిలాండ్‌ సంగీతం, సంస్క తిని వివిధ దేశాలకు పరిచయం చేస్తూ వాటి అభివద్ధికి, ప్రాచుర్యానికి ఎంతగానో కషి చేస్తున్నారు.