ఇస్రో విజయంపై శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌

భారతదేశంలో కేవలం ఆధ్యాత్మిక విజ్ఞానంలోనే కాదు, భౌతిక విజ్ఞానరంగంలో కూడా అగ్రగామిగా నిలిచింది. ఆర్యభట్ట మరియు వరాహమిర నుండి మొదలుకొని అగణిత వైజ్ఞానిక పరిశోధనల వలన నేడు ప్రపంచంలో భారతదేశపు ఔన్నత్యం ప్రత్యేకంగా పేర్కొనబడుతున్నది.
ఇస్రో 104 ఉపగ్రహాలను ప్రయోగించి సఫలీకృతం కావడం ద్వారా తన విశిష్టతను ఇనుమడింప చేసుకున్నది.

 దీని సాఫల్యం వలన ఇస్రో ఖాతాలో మరొక జ్యోతిని జోడించగలిగింది. భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తన అంతరిక్ష విజ్ఞానరంగానికి పటిష్టమైన ప్రతిష్ఠను సవినయంగా చాటించగలిగింది. ఈ సందర్భంగా దీనికై అహర్నిశలు శ్రమించిన వైజ్ఞానులకు తత్సంబంధిత అధికారులకు ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి మాయొక్క విశేషమైన శుభాకాంక్షలు.
-శ్రీ భయ్యాజీ జోషి, సర్‌కార్యవాహ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌