హితవచనం

హిందూ సంస్కృతిని రక్షించడానికి ఒక శక్తివంతమైన సంఘటన నిర్మించాలని అంటే, కేవలం సంఖ్యను పెంచడం కాక హిందువులలో ''మేమీ పనిచేయ గలమనే'' ఆత్మ విశ్వాసాన్ని జాగృతమొనరించడమే.
ప్రస్తుతం మనదేశంలో ఉంటున్న విదేశీయులు కాని, రేపు వద్దామని గాలి మేడలు కట్టుకొనే ఇతరులు కానీ, హిందూ దేశంలో హిందువులనణచాలనే దుస్సాహ సానికి తలపడలేనంత శక్తిని, సామర్థ్యాన్ని, సుదృఢ సంఘటనను హిందూ సమాజంలో నిర్మించడమే సంఘం చేయదలచుకున్న పని. 
హిందూజాతి సుఖదుఃఖములే నాకూ, నా కుటుంబానికీ సుఖఃదుఃఖములు. హిందూ జాతికి జరిగే అవమానం మా అందరికీ అవమానం - ఇలాంటి ఆత్మీయ ప్రవృత్తిని హిందువుల ప్రతి రక్తకణంలోనూ వ్యాపింపచేయాలి. ఇదే రాష్ట్ర ధర్మానికి తారకమంత్రం.
తన బాగును చూసుకోగల శక్తి హిందూ సమాజానికి కలిగింపచేయడమే సంఘం తలపెట్టిన కార్యం. తనను తాను రక్షించుకోవడం చేతకాకుండానే మరొకరిని రక్షించడానికి పరుగులెత్తే అలవాటు మనకు దాపురించింది! ఇది తొలగిపోనిదే మనం బాగుపడ జాలం. ఆత్మసంరక్షణశాలిగా అవడమే హిందూ సమాజానికి వైభవం.