మహిళా శ్రమను జీడీపీలో లెక్కించాలి!

పార్లమెంటులో మహిళా రిజర్వే షన్‌ అమలు కావాల్సిందే. ప్రస్తుతం లోక్‌సభలో మహిళల ప్రాతినిథ్యం 11.3%గా ఉంది. విశ్వవ్యాప్తంగా మాత్రం ఇది 22.8%గా ఉంది. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వని సమాజం నాగరిక సమాజం అనిపించుకోదు. దేశంలో జీడీపీని లెక్కించే సమయంలో మహిళల శ్రమను, ఉత్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలా చేయకుంటే మహిళల పట్ల వివక్ష చూపుతున్నట్లే లెక్క.
- ప్రణబ్‌ ముఖర్జి, రాష్ట్రపతి