భరతమాత సేవలో...

సమాజ కార్యం కోసం జీవితాన్ని సమర్పించి తుది శ్వాస వరకూ ఆ పనిలోనే నిమగ్నమైన అనేకమంది ప్రచారకులు ఉన్నారు. అలాంటి వారి లో రాంభావు హల్దేకర్‌, ఎం.సి. జయదేవ్‌లు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో పనిచేసిన జ్యేష్ట ప్రచా రక్‌లు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు స్వర్గస్థులయ్యారు.
రాంభావ్‌ హల్దేకర్‌
'హల్దేకర్‌జీ' గా అందరికీ తెలిసిన రామచంద్ర సదాశివ హల్దేకర్‌ 5.2.1930న మహా రాష్ట్రలోని శంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌) జిల్లా హల్తా గ్రామంలో జన్మిం చారు. హైదరాబాద్‌లో బిఎస్‌సి చదువు తున్నప్పుడే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పట్ల ఆకర్షితులై ప్రచారక్‌గా వచ్చారు. 
1954లో భాగ్యనగర్‌ ప్రచారక్‌గా, 1959 నుండి 1962 వరకూ పాలమూరు, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాలతో ఉన్న హైదరాబాద్‌ విభాగ్‌ ప్రచారక్‌గా ఉన్నారు. ఆ తరువాత 1963 వరంగల్‌ విభాగ్‌ (ఆదిలా బాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలు), 1978 నుండి విజయవాడ విభాగ్‌ (పశ్చిమ గోదా వరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు) ప్రచారక్‌గా పనిచేశారు. 1980-89 ఆంధ్రప్రదేశ్‌ (ఉమ్మడి) సహ ప్రాంత ప్రచారక్‌గా, 1989-91 ప్రాంత ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1991లో ఆంధ్రప్రదేశం, ఒరిస్సా కలిసిన ఆగ్నేయ క్షేత్రానికి క్షేత్రప్రచారక్‌గా ఉన్నారు. 199లో ఒరిస్సాలో వచ్చిన తుఫాను తరువాత చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిం చారు. 2003 నుండి దశాబ్దానికి పైగా దక్షిణ మద్యక్షేత్ర (ఆంధ్ర ప్రదేశం, కర్ణాటక) కార్యకారిణి సదస్యులుగా ఉన్నారు.
హల్దేకర్‌జీ మంచి జ్ఞాపకశక్తి ఉండేది. చాలాకాలం తరువాత కలిసినా కార్యకర్తల్ని గుర్తుపట్టడమే కాక, పేరు పెట్టి పిలవడం అందరినీ ఆశ్చర్యపరచేది. కార్య కర్తల కుటుంబాలలో వ్యక్తిగతమైన, ఆత్మీయ పరిచ యాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని గ్రామాల్లో హల్దేకర్‌జీకి ఆత్మీయ సంబంధాలున్నాయి. పుట్టినది మహారాష్ట్రలోనైనా హల్దేకర్‌జీ ఆంధ్ర ప్రదేశ్‌నే స్వస్థలం చేసుకున్నారు. కొద్దికాలంలోనే తెలుగు మాట్లాడటం, వ్రాయడం నేర్చుకున్నారు. తెలుగులోనే చక్కగా ఉపన్యాసం ఇచ్చేవారు. ఆ భాషలో ఎంత ప్రావీణ్యత సంపాదించారంటే ఇతర భాషల్లో ఉన్న పుస్తకాలను తెలుగులోకి అనువ దించారు. గోవింద దాండేకర్‌ మరాఠీలో రాసిన డాక్టర్జీ జీవిత చరిత్రను హల్దేకర్‌జీ. పెనుతుఫానులో దీప స్తంభం' అనే పేరుతో, మృణాళిని జోషి రచిం చిన గురూజీ జీవితాన్ని 'ఓం రాష్ట్రాయ స్వాహా' పేరుతో, శరద్‌ హేబాల్క్కర్‌ రాసిన బాలాసాహెబ్‌ దేవరస్‌ జీవితచరిత్రను ఆయన తెలుగులోకి అనువ దించారు. ఆలాగే 2013లో 'ఆంధ్రప్రదేశ్‌లో సంఘ ప్రగతిలో ఆత్మీయ జ్ఞాపకాలు', 'సమర్థ రామదాసు' అనే రెండు పుస్తకాలు కూడా అందించారు. 2011లో సొంతూరు హల్దాలో వారికి పిత్రార్జితంగా వచ్చిన యావదాస్తిని సంఘా నికి ఇచ్చేశారు.

వారులేని లోటు తీర్చలేని దైనా, వారి జీవితాలు మాత్రం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయి. ఆ ఇద్దరి జీవిత విశేషాలు క్లుప్తంగా...