యుగపరివర్తకులు డాక్టర్‌ హెడ్గెవార్‌

భారతదేశ చరిత్రలో-1857 నుండి 1947 వరకు జరిగిన పరిణామాలు, ఆ మధ్య కాలంలో దేశంలో నిర్మాణమైన పరిస్థితులు వాటి ప్రభావం నుండి ఈ దేశం ఇంకా పూర్తిగా బయట పడలేదు. ఆ రోజుల్లో నిర్మాణమైన సంఘర్షణ ఇంకా కొనసా గుతూనే ఉన్నది. దానికి ముగింపు పలికినప్పడే ఈ దేశంలో సుస్థిరత నెలకొంటుంది. ఆ మధ్య కాలంలో ఈ దేశంలోనే అనేమమంది మహా పురుషులు జన్మించారు. ఆ మహా పురుషులలో యుగానుకూల మార్పులకు తెరలేపి పనిచేసిన వారితో పేర్కొనదగిన వారు డాక్టర్‌ కేశవరావు బలరాంపంత్‌ హెడ్గెవార్‌ వారిని డాక్టర్‌జీ అని పిలుస్తుంటారు. వారు ఉగాది పండుగ రోజున జన్మించారు. 1889 సం. ఏప్రియల్‌ 1న ఒక నిరుపేద కుటుంబంలో డాక్టర్‌జీ జన్మించారు. 
డాక్టర్‌జీకి బాల్యం నుండి దేశభక్తి భావం జాజ్వల్యమానంగా ఉండేది. చిన్న వయస్సులో వందేమాతర ఉద్యమం ప్రభావం కూడా వారిపై పడింది. విజయదశమి సమయంలో దేశంలో స్వాతంత్య్రం సంపాదనకు ఆ పండుగే ప్రేరణ కావాలని ఉపన్యసించారు. విప్లవకారులతో కలిసి పనిచేయ డానికి డాక్టర్‌ కోర్సు పేరుతో కలకత్తా వెళ్లారు. డాక్టర్‌ కోర్సు చదువుతూనే అనుశీలన సమితిలో చేరి పనిచేశారు. ఆ సమయంలో ఆ పనిలో ఉన్న లోటుపాట్లు కూడా అధ్యయనం చేశారు. ఈ బాటలో పనిచేస్తే స్వాతంత్య్రం సంపాదించటం అసాధ్యమని గుర్తించి ఆ సంస్థ నుండి బయటకువచ్చారు. అయినా వాళ్ళతో సంబంధాలు కొనసాగించారు. డాక్టర్‌ కోర్సు పూర్తిఅయిన తరువాత నాగ్‌పూర్‌కు వచ్చి కాంగ్రెస్‌ సంస్థలో చేరి స్వాతంత్య్ర పోరాటం చేస్తూ ఉండే వారు. నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభల సమయంలో అక్కడి వ్యవస్థలో పనిచేశారు. ఆ సమయంలో దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం తీర్మానం పెట్టించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు అది సాధ్యం కాలేదు. ఆ రోజుల్లో దేశంలో జరుగుతున్న పరిణా మాలను చాలా దగ్గరగా పరిశీలించిన అధ్యయనం చేశారు. ఆ సంక్లిష్ట పరిస్థితులలో దేశాన్ని సరిగా ముందుకు తీసుకునిపోవటానికి మార్గం సుగమం చేసేందుకు కృషిచేశారు. ఆ దిశలో జరిగిన ప్రయ త్నాల ఫలితమే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం. ఒకసారి ఒక నిష్కర్షకు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో ఉన్న బాధ్యతల నుండి పూర్తిగా బయటకు వచ్చి సంఘ కార్యంలో లీనమై పనిచేశారు. అయినప్పటికీ స్వాతంత్య్ర పోరాటంలో వ్యక్తిగతంగా పాల్గొన్నారు. పెరుగుతున్న సంఘ కార్యానికి స్వాతంత్య్ర పోరాటా నికి మధ్య ఒక వారధిగా డాక్టర్‌జీ పనిచేశారు.
సంఘ కార్యాన్ని ప్రారంభించడానికి దారి తీసిన పరిస్థితులను, సంఘ కార్యపు ఆవశ్యకతను డాక్టర్‌జీ చెప్పిన మాటలలో మనం అర్థం చేసుకో వాలంటే ఆ రోజుల్లో డాక్టర్‌కు ఇచ్చిన తొమ్మిది ఉపన్యాసాలు చదవాలి. వాటిని చదివితే సంఘ కార్యంపట్ల డాక్టర్‌జీ ఆలోచనలు స్పష్టమవుతాయి.
డాక్టర్‌జీ సమకాలీన పరిస్థితులు:
ఆ రోజుల్లో రాజులు - రాజ్యాలు వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతూ బ్రిటీష్‌ ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్‌లో నిర్మాణం చేయడానికి ప్రయ త్నాలు జరుగుతున్న సమయమది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే అనేక రాజకీయ పార్టీలు కూడా పుట్టుకొస్తున్న సమయమది. ఇంకొక ప్రక్క ద్విజాతి సిద్ధాంతంతో ముస్లింలకు ఒక దేశాన్ని సాధించాలని ముస్లింలీగ్‌ పనిచేస్తున్నది. ముస్లిం జనాభా విపరీతంగా పెరగడం అనే సమస్య కూడి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ముస్లిం ప్రాబల్యం పెరుగుతున్నది. దానిని నిరోధించడానికి ఆర్య సమాజ్‌ తన శక్తియుక్తుల్ని ఒడ్డి పనిచేస్తున్న సమయమిది. బ్రిటిష్‌ వాళ్ళు ఈ దేశంలో తమ పరిపాలను సుస్థిరం చేసుకొనేం దుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న సమయమది. తమ వలసవాదాన్ని సమర్థించుకొనేందుకు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని బ్రిటిష్‌ వారు మనపైకి వదిలిన సమయమది. బ్రిటిష్‌ వాళ్ళు ఈ దేశం మొత్తాన్ని సర్వే చేసి అనేక విషయాలు అర్థం చేసుకుంటున్న సమయమిది. ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని మరిచిపోయేటట్లుగా, ఈ దేశం యెడల ఒక ఉదాసీన వైఖరి జనించే విధంగా అనేక కుట్రలు జరుగుతున్న సమయం. అందులో ఈ దేశం యొక్క చరిత్రను వక్రీకరిండం. ఈ దేశ చరిత్రను 1. ఈ దేశం మీద దాడిచేసిన విదేశీ దురాక్రమణదారులను, వారిని ఎదిరించి పోరాటం చేసిన వారిని ఇద్దరిని ఒక గాటన కట్టివేసి ఆ చరిత్రను మనతో చదివించటం ప్రారంభించిన సమయమది'' ఆ సమయంలోనే ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ కూడా తమ సిద్దాంతాలకు అనుగుణంగా ఈ దేశ చరిత్రకు వ్యాఖ్యానాలు చేస్తున్న సమయమది. క్రమక్రమంగా వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని కలిపి ఉంచుతున్న ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ఈ దేశ ధర్మాన్ని, ఈ దేశ జాతీయతకు ప్రశ్నార్థకం చేసే మేధావివర్గం పుట్టుకువచ్చి పనిచేస్తున్న సమయమది. ''మనం హిందువులం'' అని చెప్పు కునేందుకే సిగ్గుపడేలా వాతావరణం క్రమంగా దేశమంతా విస్తరిస్తున్న సమయమది. ఇస్లాం, క్రైస్తవం మతం మార్పిడులు కూడా జోరుగా సాగుతున్న సమయమది. ఇంకొక కీలక పరిణామం ఈ దేశంలో రాజ్యశక్త్తే సర్వస్వం అవుతున్న వేళ అది. ఎన్నికలు, బలాబలాల పరీక్ష మొదలవుతున్న సమయమది. ఈ పరిస్థితులలో ఈ దేశాన్ని ఈ దేశంగా నిలబెట్టడం ఒక పెద్ద సవాలుగా నిలబడింది.
ఆ సవాలును స్వీకరించి డాక్టర్‌జీ సంఘ కార్యాన్ని ప్రారంభించారు. హిందూ సమాజ సంఘ టనా కార్యానికి రెండు విశేషాలు జోడించారు.
1. సంఘ కార్యం ఈశ్వరీయ కార్యం 2. సంఘ కార్యం రాష్ట్రీయ కార్యం. ఈ రెండు మాటలతో సమాజ సంఘటన కార్యం గురించి డాక్టర్‌జీకిగల కల్పన మనకు అర్థమవుతుంది. డాక్టర్‌జీ హిందూ సమాజానికి సంబంధించి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారు. ''ఇది హిందూ రాష్ట్రము. ఇది ఒక వాదాతీ తమైన సత్యము. మనం అందరం బంధువులం. ఈ హిందూ సమాజాన్ని సంఘటిత పరచడమే మన లక్ష్యం'' - ఇది డాక్టర్‌జీ విశ్లేషణ. దూరదృష్టితో ఆలోచించి ప్రారంభించిన ఈ కార్యం ఈ రోజున దేశమంతా విస్తరించడమే కాదు ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించి అక్కడ ఉన్న హిందువులను సంఘటిత పరుస్తున్నది. ఈ దేశంలోని అన్ని జీవనరంగాలలో స్వయం సేవకులు ప్రవేశించి ఆ రంగాలను శక్తివంతం చేసేందుకు కృషిచేస్తున్నారు. సంఘం ఈ రోజున ఒక నిర్ణయాత్మక శక్తిగా సమాజంలో ఉంది. ఈ దేశహితం గురించి ఆలోచించే వారెవరైనా, ఈ దేశానికి నష్టం కలిగించాలని ఆలోచించే వారెవరైనా సంఘాన్ని విస్మరించే పరిస్థితి ఈరోజు లేదు. రాజకీయాలకు అతీతంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నిం టికి ప్రేరణ ప్రోత్సహిస్తున్నది సంఘం.
పూజ్యనీయ డాక్టర్‌జీ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే.. ఒక ప్రశ్న సంఘకార్యం దేశమంతట విస్తరించటానికి కృషిచేస్తూనే సమాజంలో సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసే వారు. రాజకీయాలకు ఆలస్యంగా సంఘాన్ని నిల బెట్టారు. ఆ రోజుల్లో సంఘం వుంటే కాంగ్రెస్‌కు పూర్తి అసహనం ఉండేది, హింరి మహాసభకు పూర్తి అసంతృప్తి ఉండేది. కాంగ్రెస్‌ అసహనం, హిందూ మహాసభ అసంతృప్తి ఈ రెండింటి నుండి దూరంగా సంఘ కార్యాన్ని నిలబెట్టడంలో డాక్టర్‌జీ సఫలీకృత మైనారు. డాక్టర్‌కి మద్దెల లాగా రెండు వైపుల వాయింపులు ఉండేవి. వాటికి అతీతంగా సంఘం కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు.
ఒక ప్రశ్న డాక్టర్‌జీ హిందూ సమాజ సంఘటన కార్యము : రెండవ ప్రక్క డాక్టర్‌ అంబేద్కర్‌ సామాజిక ప్రజాస్వామ్యం కోసం ప్రయ త్నం. డాక్టర్‌జీ ప్రతిపాదించిన హిందూ సమాజ సంఘటన కార్యంలోనే సామాజిక ప్రజాస్వామ్యం ఉన్నది. సమాజంలోని అందరిని కలుపుకుని పోవ టం అనేదే మూలసూత్రం. అంబేద్కర్‌ ప్రతిపాదిం చిన సామాజిక ప్రజాస్వామ్యంలో ''సామాజిక ప్రజాస్వామ్య మనేది ఒక జీవన విధానం. దీనిలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉండాలనేది వారి సూత్రం. ఈ మూడు ఒకదానితో ఒకటి మమేకమవ్వాలనేది వారి ఆలోచన. స్వేచ్ఛ లేని సమానత్వము వ్యక్తిగత చొరవను చంపేస్తుంది, సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెల కొలుపుతుంది. సోదరభావం లేని స్వేచ్ఛ, సమాన త్వం సహజంగా ఉండలేవు'' ఇవి అంబేద్కర్‌ ఆలోచ నలు. డాక్టర్‌జీ ఆలోచనలలో ఈ దేశంలోని మన మందరం ఈ హిందూ సమాజం యొక్క అవయవ స్వరూపులం అని చెప్పారు. దానిలోనే అన్ని ఉన్నాయి. సమాన ఆలోచనలు కలిగిన వారినందరిని సంఘానికి దగ్గరగా తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేశారు. సంపూర్ణ హిందూ సమాజం శక్తివంతంగా నిల బడాలి. రాజ్యశక్తిని అదుపులో ఉంచగలిగే ఒక సామాజికశక్తి సమాజంలో నిర్మాణం కావాలి. దానికోసం డాక్టర్‌జీ పనిచేశారు.
ఈ రోజున దేశంలో సంఘం శక్తివంతంగా ఉంది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు క్రమంగా బలహీనమవుతున్నాయి. ఈ దేశంలో గందరగోళం సృష్టించే సిద్ధాంతాలు కూడా క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఈరోజు దేశంలో మేము హిందు వులం అని చెప్పుకొనేందుకు పవరూ సిగ్గుపడటం లేదు. దేశహితం గురించి ఆలోచిస్తూ పనిచేస్తున్న శక్తులన్నింటిని సమన్వయపరిచే ప్రయత్నం ఈ రోజున కూడా జరుగుతున్నది.'' దేశహితం అనే గీటురాయి మీద'' జరిగే మన పనిలో దేశహితం గురించి పనిచేస్తున్న అందరిని కలుపుకొని పోతు న్నాము. డాక్టర్‌జీ ఆలోచనల సాకార రూపం ఈ రోజు మనం చూస్తున్నాము. అటువంటి మహనీ యులు ఉగాది పండుగ రోజున జన్మించి ఈ యుగా నికి ఒక ద్రష్టగా మారారు. యుగానుకూల మార్పు లకు తెరలేపారు. అటువంటి మహాపురుషుడ్ని స్మరించుకోవటం, ఆ పనిలో లీనం కావటం మనం వారికి సమర్పించే నిజమైన శ్రద్ధాంజలి.