ఇక విజయమే విజయం...

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌కార్యవాహ (జనరల్‌ సెక్రెటరీ) శ్రీ సురేష్‌జీ (భయ్యాజీ) జోషి స్వాగతోపన్యాసంతో అఖిలభారతీయ ప్రతినిధి సభ ప్రారంభమైంది. సభ మాతా అమృతానందమయి, ఇతర స్వామీజీలకు శ్రద్ధాపూర్వక ప్రణామాలు సమర్పించింది.
సర్‌కార్యవాహ వార్షిక నివేదిక సమర్పిం చారు. ఇటీవల దివంగతులైన జ్యేష్ట కార్య కర్తలకు నివాళులతో నివేదిక ప్రారంభ మైంది. పూర్వం అఖిలభారత సేవాప్రముఖ్‌ గా ఉన్న శ్రీ సూర్యనారాయణ రావుకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే దక్షిణ - పూర్వ క్షేత్ర ప్రచారక్‌గా పనిచేసిన, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్‌లలో సంఘకార్యాన్ని విస్తరింపచేసిన శ్రీ రాంభావు హల్దేకర్‌కి కూడా నివాళులర్పించారు. కేరళలో కమ్యూనిస్టు హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. సరిహద్దు ఘర్షణల్లో ప్రాణత్యాగం చేసినవారికి, రాజకీయ దాడుల్లో చనిపోయినవారికి కూడా అ.భా.ప్ర.స నివాళులర్పించింది.

చర్చల ద్వారా పరిష్కారమా.. పార్ల మెంట్‌ చట్టమే పరిష్కారమా..!

రామ జన్మభూమి కేసులను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనము సుబ్రహ్మణ్య స్వామి వాదనలు విన్న తరువాత సున్నితమైన భావోద్వేగా లతో ముడిపడి ఉన్న అయోధ్య సమస్య పరిష్కారానికి కోర్టు బయట అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి కూర్చుని పరిష్కారం సాధించాలని 2017 మార్చి 20తేదీ నాడు సూచించింది. జస్టీస్‌ ఖేహర్‌-జస్టీస్‌ జి.వై.చంద్రచూడ్‌ జస్టీస్‌ ఎస్‌.కే.కౌల్‌ ఆ ధర్మాస నంలో ఉన్నారు. 

ధర్మరక్షణకై పవిత్ర యుద్ధం

''ఇస్లాం మీద పవిత్రయుద్ధం (జిహద్‌) చేయాలి-ధర్మాన్ని రక్షించాలి''-ఈ మాటలు ఒక భారతీయడు కానీ, ఒక హిందుత్వ వాది కాని అన్న మాటలు కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్‌ ట్రంప్‌కు ప్రధాన వ్యూహకర్తగా, జాతీయ రక్షణ కౌన్సిల్‌ సభ్యుడుగా ఉన్న స్టీల్‌ బానన్‌ అన్న మాటలు. 

'వందేమాతరం'కి మేము వ్యతిరేకం

అది మిరాట్‌ పురపాలక సంఘం సమావేశం.. సమావేశానికి ముందు, మేయర్‌ హరికాంత్‌ అహ్లువాలియా వందేమాతరం పాట ప్రారంభించారు. మిగిలిన సభ్యులు కూడా పాడుతున్నారు. మధ్యలో ముస్లిం సభ్యులు కొందరు లేచి బయటకు నడుస్తున్నారు. 

సేవామార్గంలో సంఘం

భారతదేశ సర్వతొముఖాభివృద్ధి రాష్ట్రీయ స్వయంసేవకు సంఘం ''యహమత్‌ సంఘ కిసీ క్షేత్ర్‌కో ఖాలీ రహె జానేదేంగే, ఉమఢ ఘమడ కర్‌ హర్‌ ధరతీకో నందన్‌ వన్‌సా సరసాయే..'' అని పాడుకునే స్వయంసేవక్‌ అన్నంత పని చేశాడు. విద్య, ఆరోగ్య, కార్మిక, కర్షక రంగాలలో ఒకటేమిటి, అన్ని రంగాలలో సంఘం నాణ్యమైన సేవలు అందిస్తూ భారతమాత ఆరాధన చేస్తున్నది. 

ధర్మ నిరతులు - ఆదర్శ సతులు

అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌.

అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం.
అందులో అహల్య, ద్రౌపదీ తప్ప మిగిలిన ముగ్గురూ శ్రీరామాయణ మహాకావ్యంతో సంబంధం ఉన్నా వారే. రామాయణంలో జరిగిన ప్రధాన ఘట్టాలు వారితో ముడిపడి ఉన్నాయి.

కాశ్మీర్‌లో రాళ్ళు విసిరేది కిరాయి మూకలే

జమ్ము-కాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని ఒక గుర్తు తెలియని చోటు రాళ్ళు విసిరే కిరాయి మూకలు ఒక పత్రికా విలేకరితో ముఖా ముఖి సంభాషణ జరిపారు. హిజ్‌బుల్‌ తీవ్రవాద నేత బుర్హాన్‌ వాని మరణం తరువాత జరిగిన అల్లర్లు, అశాంతి వెనుక ఎవరున్నారన్న వాస్తవాలపై భయంకరమైన సత్యం ఆ సంభాషణలో బయటపడింది. 

సామాజిక ప్రజాస్వామ్యం దేశ ఐక్యతకు మూలం

ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా..
అంబేెడ్కర్‌ను ఒక దళిత నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల నాయకుడుగా చెపుతూ ఉంటారు. అంబేడ్కర్‌ ఒక జాతీయ నాయ కుడు. సామాజిక న్యాయం, జాతీయ భావం అనే రెండూ అంబేడ్కర్‌ జీవితంలో రెండు పార్శ్వాలు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే వారి జీవి తంలో సామాజిక న్యాయం, జాతీయ భావం ఉన్నాయి. ఆ రెండిటి మధ్య ఒక సమన్వయం సాధిం చేందుకు ప్రయత్నించేవారు. 

గిల్గిత్‌లో గిల్లికజ్జాలు

ఆర్థిక కారిడార్‌ పేరిట పాక్‌, చైనా కుట్రలు
మొదటి నుంచీ గిల్లికజ్జాలు పెట్టుకునే దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు పొరుగుదేశం చైనా జత కలిసింది. భారత్‌ను ఎప్పుడూ దొంగదెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉండే పాకిస్తాన్‌కు చైనా స్నేహం తోడయ్యింది. నేరుగా భారత్‌ను ఎదుర్కొనే సాహసం చేయలేని చైనా.. ఈ క్రమంలోనే అటునుంచి నరుక్కువస్తోంది. ఫలితంగా రెండు దేశాలు కలిసి కొత్త కుట్రకు తెర తీశాయి. 

అఖిలభారతీయ ప్రతినిధి సభలో పూజ్య అమ్మ ప్రసంగం.. సంక్షిప్తంగా..

ఈ మహా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోకరమైన విషయం. మొట్టమొదటగా మీ అందరితో వ్యక్తిగతంగా కలిసి, కొద్ది సమయం గడపగలిగినందుకు అమ్మ ఆనందంతోపాటు కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎందుకంటే ఏ భారతమాత ఒడిలో సనాతన హిందూ ధర్మం వర్థిల్లుతోందో ఆ తల్లి సేవలో మీరంతా నిరంతరం నిమగ్నమై ఉంటారు. భరతభూమి ఆధ్యాత్మిక భూమి. 'వసుధైవకుటుంబకం' (వసుథ అంతా ఒక కుటుంబం) అనే ఉపదేశాన్ని ఇచ్చింది. 

పశ్చిమబెంగాల్‌లో పెరుగుతున్న జిహాదీ కార్యకలాపాలు - జాతీయ ప్రయోజనాలకు పెను సవాలు

కోయంబత్తూర్‌లో అఖిల భారతీయ ప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానం
పశ్చిమబెంగాల్‌లో నిరంతరం పెరుగుతున్న జిహాదీ హింస, ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతి వ్యతిరేక శక్తులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహం ఇవ్వడం, రాష్ట్రంలో హిందూ జనాభా తగ్గిపోవడం పట్ల అఖిలభారతీయ ప్రతి నిధిసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ముస్లింల మాటేమిటి..?

ప్రపంచంలో ఏ దేశంలోనైనా ముస్లింల నైజం మనం గమనించినట్లైతే సాధారణ స్వభా వానికి భిన్నమైన విధ్వంస స్వభావం ఇస్లాం స్వభావంగా కనబడుతుంది. శాంతికాముకులము అని చెప్పుకుంటూనే వారు విధ్వంసాలు చేస్తూ ఉంటారు. దానితో మిగిలిన వాళ్లు వాళ్లతో మనకు గొడవ దేనికి కొద్ధిగా సర్దుకుపోతే శాంతియుతంగా ఉండవచ్చు అని భ్రమపడుతూ ఉంటారు.

ప్రముఖులు మాట

ఎప్పుడైతే ఎన్‌కౌంటర్లో తీవ్రవాదులు హతులౌతుంటే, పాక్‌ ప్రేరిత ఉగ్రవాద వేర్పాటు దారులు పైసలు పంచి అమా యక యువకులను పోలీస్‌సైన్యం ఎదుట నిల బెట్టుతూ రెచ్చగోట్టుతుంటారు. ఈ మధ్య తీవ్ర వాదులు వేరే మార్గల ద్వారా పారిపోతున్నారు.
- డిజిపి, జమ్ముకాశ్మీర్‌ ప్రాంతం 

అమరవాణి

శ్లో|| అమిత్రో దణ్ణనీత్యామాయతః
దణ్ణఃసంపదా యో జయతి
దణ్ణనీతి మధితిష్టన్‌ ప్రజాఃసంరక్షతి
దణ్ణాభావే త్రివర్గాభావ
- చాణక్య నీతి
శత్రువు దండనీతికి లొంగుతాడు. దండం సంపదను సంపాదించి పెడుతుంది. దండనీతి అవలంబించిన సంపాదించి పెడుతుంది. దండ నీతి అవలంబించిన వాడు మాత్రమే ప్రజలను రక్షించగలుగుతాడు. దండనీతి అనగా రాజనీతి, పాలనా విధము అని అర్థము. దండం లేకపోతే ధర్మ అర్థకామాలు లేవు.

మహాభారతం

అత్యంత శక్తివంతమైనది ధర్మం. సత్యం సహజంగా నిర్మలమైనది. అయినప్పటికి ఒక్కొక్కప్పుడు పాపం చేత ధర్మం, అసత్యం చేత సత్యం విడిపోయి తమ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడవచ్చు. అసత్యం, అధర్మం విచ్చలవిడిగా సమాజంలో విహరిస్తుంటే రాజ్యపాలన నిర్వహిస్తున్నవారు తమకేమీ పట్టనట్లు ఊరుకుంటే వారు తమ సర్వనాశనాన్నే కొనితెచ్చుకొన్న వారవుతారు. అంతే కాని ధర్మం, సత్యం నశించవు. ధర్మాన్ని, ధర్మానికి మూలమైన సత్యాన్ని దైవం సదా కాపాడుతూ ఉంటుంది. ఉద్ధరించబడిన సత్య ధర్మాలు సమాజానికి శాంతి సౌభాగ్యాలను అందజేస్తూనే ఉంటాయి.

దయాసముద్రుడు

డాక్టర్‌ అంబేడ్కర్‌ చివరి రోజుల్లో రోగగ్రస్తుడైపడి ఉన్నాడు. ఇలాంటి స్థితిలో కూడా ఎవరో ఒకరు తమ దుఃఖ గాధలు చెప్పుకోనేందుకు ఆయన వద్దకు వస్తుండేవారు. ఆయన హృదయం ద్రవించిపోయేది. వారికి సహాయ పడేందుకు ప్రయత్నిస్తుండేవాడు. ఆయన తోటమాలి కూడా జబ్బుపడ్డాడు. ఈ విష
తోటమాలి ఎంతో మనోవ్యధతో ఉన్నాడు. అతనిని ఒక విచారం పట్టుకుంది. తాను మరణించిన తర్వాత తన భార్యకు జరుగుబాటు ఎలా? డాక్టర్‌ అంబేడ్కర్‌ ఎంతో ఆత్మీయంగా తోటమాలికి ధైర్యం చెప్పి ఇలా అన్నాడు- 

శ్రీరామనవమి

శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధనవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నం అభిజిత్‌ ముహూర్తంలో మధ్యాహ్నం 12గం||ల వేళ త్రేతాయుగంలో జన్మించాడు. పదునాలుగు సంవ త్సరాల అరణ్యవాసం, రావణ సంహారంతర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్త్తుడైనాడు. ఈ సంఘటన రోజునే (చైత్ర శుద్ధ నవమి) రాముల కళ్యాణం కూడా జరిగింది. దేశంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖసంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల నమ్మకం. మహాత్మాగాంధీ కూడా స్వాతంత్య్రానంతరం భారతదేశంలో రామరాజ్యంగా విలసిల్లాలని భావించారు.