మహాభారతం

అత్యంత శక్తివంతమైనది ధర్మం. సత్యం సహజంగా నిర్మలమైనది. అయినప్పటికి ఒక్కొక్కప్పుడు పాపం చేత ధర్మం, అసత్యం చేత సత్యం విడిపోయి తమ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడవచ్చు. అసత్యం, అధర్మం విచ్చలవిడిగా సమాజంలో విహరిస్తుంటే రాజ్యపాలన నిర్వహిస్తున్నవారు తమకేమీ పట్టనట్లు ఊరుకుంటే వారు తమ సర్వనాశనాన్నే కొనితెచ్చుకొన్న వారవుతారు. అంతే కాని ధర్మం, సత్యం నశించవు. ధర్మాన్ని, ధర్మానికి మూలమైన సత్యాన్ని దైవం సదా కాపాడుతూ ఉంటుంది. ఉద్ధరించబడిన సత్య ధర్మాలు సమాజానికి శాంతి సౌభాగ్యాలను అందజేస్తూనే ఉంటాయి.