చర్చల ద్వారా పరిష్కారమా.. పార్ల మెంట్‌ చట్టమే పరిష్కారమా..!

రామ జన్మభూమి కేసులను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనము సుబ్రహ్మణ్య స్వామి వాదనలు విన్న తరువాత సున్నితమైన భావోద్వేగా లతో ముడిపడి ఉన్న అయోధ్య సమస్య పరిష్కారానికి కోర్టు బయట అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి కూర్చుని పరిష్కారం సాధించాలని 2017 మార్చి 20తేదీ నాడు సూచించింది. జస్టీస్‌ ఖేహర్‌-జస్టీస్‌ జి.వై.చంద్రచూడ్‌ జస్టీస్‌ ఎస్‌.కే.కౌల్‌ ఆ ధర్మాస నంలో ఉన్నారు. 

భాగస్వామ్యపక్షాలు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి ప్రధాన న్యామూర్తి జస్టీస్‌ ఖేహర్‌ కాని మరోకరైన సిద్ధమని తెలియచేశారు. ఈ నెల 31లోపు నిర్ణయం తీసుకుని తమకు తెలుప వలిసిందిగా జస్టీస్‌ ఖేహర్‌ సూచించారు. దానితో అయోధ్య విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఆచితూచి తమ సానుకూల ఆభిప్రాయం వ్యక్తం చేశాయి. భాగస్వామ్య పక్షాలు రాజకీయాల జోలికి పోకుండా కలిసి కూర్చుని చర్చించుకునేందుకు ఒక అంగీకారానికీి రావాలి. దేశం భాగస్వామ్య పక్షాల సానుకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నది.
బాబర్‌ సేనాని మీర్‌భక్షి అయోధ్యలోని రామ మందిరాన్ని 1528సం||లో కూలగొట్టి బాబర్‌ పేరుతో ఒక కట్టాడాన్ని నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని భవ్యమైన రామమందిరాన్ని నిర్మానం చేసేందుకు 77సార్లు పోరాటాలు జరిగాయి. ఆ పోరాటలలో నాలుగు లక్షల మంది హిందూవులు తమ ప్రాణాలను బలి చేశారు. బ్రిటిష్‌ పరిపాలన సమయంలో సామరస్య పరిష్కారానికి జరిగిన వారి ప్రయత్నాలను బ్రిటిష్‌ వారు అడ్డుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1989 సంవత్సరంలో రామజన్మభూమి న్యాస్‌ పేరుతో ఒక సంస్థ ఏర్పడి దేశమంత ఉద్యమం చేసింది. రామశిలా పూజలతో దేశమంతా స్థలా వివాదం అందరికి తెలిసింది. రామజన్మభూమి స్థలంలో భవ్యమైన మందిర నిర్మాణానికి దేశమంతా సంకల్పించింది. రామజన్మభూమి స్థలంలో మందిర నిర్మాణానికి శిలాన్యాస్‌ (భూమి పూజ) కార్యక్రమం జరిగింది. ములయంసింగ్‌ పాలిస్తున్న సమయంలో కరసేవ జరిగింది. ఆ సమయంలో ములాయంసింగ్‌ ప్రభుత్వం కరసేవకులపై విరుచుకుపడి అనేక మందిని చంపేసింది. 1992 సం|| ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కరసేవ జరిగింది. ఆ కరసేవలో రామజన్మభూమి స్థలంలో ఉన్న బాబర్‌ కట్టాడాన్ని ఆనవాళ్లు లేకుండా పూర్తిగా తొలగించి ఒక చిన్న రామ మందిరాన్ని అక్కడే నిర్మించారు. చిన్న మందిరం నిర్మాణమైన కొద్ది సమయంలోనే కేంద్రబలగాలు రంగప్రవేశం చేసి ఆ స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి నుంచి రాముడు తనజన్మభూమిలో ససైన్య సమేతంగా కొలివుదీరి ఉన్నాడు. దానితో ప్రజా ఉద్యమాలతో ఆ ఘట్టానికి తెర పడింది.
60సం||లుగా నడుస్తున్న రామజన్మభూమి స్థలం వివాదకేసులు అన్నింటిని విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు అలహాబాద్‌ హై కోర్టుకు బదలీ చేసింది. అలహాబాద్‌ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో కొందరు ముస్లిం పెద్దలు ఒకవేళ బాబ్రి కట్టడం కింద గతంలో దేవాలయం ఉన్నదని నిరూపించబడితే దానిని మేము వదులకుంటామని ప్రకటించారు. ఆ నేపథ్యంలో 1993 సం|| సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న సంధించింది. బాబ్రి కట్టడం స్థలంలో గతంలో దేవాలయం ఉన్నాదా..? దానిని పురావస్తుశాఖ ద్వారా పరిశోధన చేయించమని ఆదేశించింది. ఆ స్థలంలో తవ్వకాలు జరిపి వెలువడిన చారిత్రక ఆధారాల ద్వారా గతంలో అక్కడ దేవాలయం ఉన్నదని నివేదిక సమర్పించబడింది. ప్రస్తుతం రామలల్లా ఎక్కడ ఉన్నాడో (మధ్య గుమ్మటం కింద) అదే రామజన్మభూమి స్థలంగా గుర్తించారు. దాంతో కోర్టు విచారణ వేగవంతమై అలాహాబాద్‌ హై కోర్టు 2010 సెప్టెంబర్‌ 30వ తేదీన సంచలన తీర్పునిచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తన తీర్పు చెప్పింది. అందులో ఒక న్యాయమూర్తి అది రామజన్మభూమి స్థలం దానిని దేవాలయ నిర్మాణానికి ఇచ్చేయాలని తన ఆభిప్రాయన్ని వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు అది రామజన్మభూమి స్థలమని ఒప్పుకుంటూనే దానిని మూడు భాగాలు చేసి ముగ్గరికి పంచారు. ప్రజా స్వామ్యంలో తీర్పు సత్యాసత్యలతో సంబంధం లేకుండా మెజార్టీ ఇజ్‌ దా లా కాబట్టి తీర్పు అట్లా వచ్చింది. ఆ తీర్పు సారాంశము సుప్రీంకోర్టు తలుపు లు తట్టడమనటం దానితో సహజంగానే ఆ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడకు చేరి ఆరు సంవత్సరాలు గడిచిపోయినాయి. సుబ్రమణ్యస్వామి చొరవతో సుప్రీంకోర్టు సమస్య పరిష్కారానికి కోర్టు బయట భాగస్వామ్య పక్షాలు కలిసి చర్చించి పరిష్కారం చేసుకోవాలని సూచించింది. ఈ విషయంపై మీడియాలో చర్చలు ప్రారంభమ య్యా యి. ఈ రోజున కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో రెండు చో ట్లా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమి జరుగుతుంది..? అని దేశ ప్రజలు వేచి చూస్తున్నారు!