దయాసముద్రుడు

డాక్టర్‌ అంబేడ్కర్‌ చివరి రోజుల్లో రోగగ్రస్తుడైపడి ఉన్నాడు. ఇలాంటి స్థితిలో కూడా ఎవరో ఒకరు తమ దుఃఖ గాధలు చెప్పుకోనేందుకు ఆయన వద్దకు వస్తుండేవారు. ఆయన హృదయం ద్రవించిపోయేది. వారికి సహాయ పడేందుకు ప్రయత్నిస్తుండేవాడు. ఆయన తోటమాలి కూడా జబ్బుపడ్డాడు. ఈ విష
తోటమాలి ఎంతో మనోవ్యధతో ఉన్నాడు. అతనిని ఒక విచారం పట్టుకుంది. తాను మరణించిన తర్వాత తన భార్యకు జరుగుబాటు ఎలా? డాక్టర్‌ అంబేడ్కర్‌ ఎంతో ఆత్మీయంగా తోటమాలికి ధైర్యం చెప్పి ఇలా అన్నాడు- 

 ''దుఃఖించవద్దు ప్రతివాడు ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపోక తప్పదు. దుఃఖించి ఏం లాభం. ధైర్యంగా ఉండాలి. ఇప్పుడే నీకు మందు పంపిస్తాను. నీవు త్వర లోనే కోలుకుంటావు. దిగులుపడవద్దు.'' అలా ధైర్యం చెప్పి ఇంటికి వచ్చి తోటమాలి కోసం మందు పంపించాడు. తోట మాలికి నయమయింది. కాని ఆ రెండవ రోజున అంబేడ్కర్‌ నిద్రలోనే ప్రాణాలు వదిలాడు.
అంబేడ్కర్‌ దయార్ధ్ర హృదయుడు. పరోపకారి. చివరి ఘడియ వరకు ఆయన పేదలకు, ఆనాధలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆనాడు ఆయన న్యాయశాఖా మాత్యుడుగా బాధ్యతలు నిర్వహించాడు. ధైర్య సాహసాలతో సమానత్వం, న్యాయం, మానవత్వం కోసం ఆజన్మాంతం పోరాడిన పురుషసింహం ఆయన.
యం తెలిసింది. ఒక మనిషిని తోడు తీసుకొని, కర్రసాయంతో తడబడుతూ అతని ఇంటికి వెళ్లాడు.