సామాజిక ప్రజాస్వామ్యం దేశ ఐక్యతకు మూలం

ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా..
అంబేెడ్కర్‌ను ఒక దళిత నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల నాయకుడుగా చెపుతూ ఉంటారు. అంబేడ్కర్‌ ఒక జాతీయ నాయ కుడు. సామాజిక న్యాయం, జాతీయ భావం అనే రెండూ అంబేడ్కర్‌ జీవితంలో రెండు పార్శ్వాలు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే వారి జీవి తంలో సామాజిక న్యాయం, జాతీయ భావం ఉన్నాయి. ఆ రెండిటి మధ్య ఒక సమన్వయం సాధిం చేందుకు ప్రయత్నించేవారు. 
దేశానికి నష్టం కలిగించే పని వారు ఎప్పుడూ చేయలేదు. తాను సమస్యలు ఎదుర్కొన్నా, నష్టపోయినా దేశానికి నష్టం కలిగించలేదు. ఆ కాలంలో ఈ దేశంలో ఉన్న అనేక సిద్ధాంతాల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉండేది. ఆ సైద్ధాంతిక సంఘర్షణ ఈ రోజున కూడా కొనసాగుతున్నది. ఆ సైద్ధాంతిక సంఘర్షణల పట్ల చాలా స్పష్టమైన అభిప్రాయలు అంబేడ్కర్‌కు ఉండేవి. ఆ అభిప్రాయలు ఈ రోజున అక్షరసత్యాలు. ఈ మధ్యకాలంలో అంబేడ్కర్‌ పేరుతో విశ్వ విద్యాల యాలలో విద్యార్థి సంఘాలు ఏర్పడి పని చేస్తు న్నాయి. ఆ సంఘాలు అంబేద్కర్‌ గురించి మాట్లాడు తూ వారి ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడం కనబడుతుంది. ఈ మధ్య సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి భాగ్యనగర్‌ సభలో మాట్లాడుతూ దళితులు, కమ్యునిస్టులు కలవాలని పిలుపునిచ్చారు. అట్లాగే ముస్లింల వెబ్‌సైట్‌ ''టూ సర్కిల్‌.నెట్‌''లో దళితుల ముస్లింలు కలిస్తే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చని రాశారు. ముస్లింలు రాజ్యాధికారం కోసం దళితులను దగ్గర తీసే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు కూడా పెద్ద ఎత్తున దళితులను దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మిషనరీలకు పెద్ద ఎత్తున దళితులను మతం మార్చి వారిని నిలుపుకునేందుకు రాజ్యంగబద్ధంగా దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు వాళ్లకు కూడా వర్తింప చేయించాలని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున జాతీయ వ్యతిరేక శక్తులన్ని దళితుల చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ల బహు సంఖ్యాకులు. వాళ్లను రెచ్చగొట్టడం సులభమని ఆ శక్తుల ఆలోచన. అయితే అంబేడ్కర్‌ ఈ శక్తుల గురించి చాలా తీవ్రం గా ఆ రోజుల్లోనే హెచ్చరించారు. 1937 సెప్టెం బర్‌ మొదటి వారంలో మైసూరులో జరిగిన వెనుక బడిన తరగతుల వారి సభాకార్యక్రమంలో అంబే ద్కర్‌ మాట్లాడుతూ ''నేను కమ్యూనిస్టులతో చేతులు కలిపి సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేయాలని కొందరు అంటూ ఉంటారు కానీ అది అసంభవమైన విషయం. కమ్యూనిస్టులు అట్టడుగు వర్గాల అభ్యన్నతి గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ల కోసం వారు చేసేది ఏమి ఉండదు. తమ లక్ష్యాన్ని సాధించుకునేందుకు వారిని పావులుగా ఉపయోగించుకుంటారు. అటువంటి వారు అట్టడుగు వర్గాల వారికి శత్రువులు. వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని'' హెచ్చరించారు. మానవ జీవితం కేవలం ఆర్థిక విషయాలు మాత్రమే పరిమితం కాదు. ఇంకా అనేక విషయాలు ఉంటాయని సూచించారు. అంబేద్కర్‌ ముస్లింల గురించి అయితే ఏకంగా ఒక పుస్తకమే రాశారు. ఆ పుస్తకంలో ఆ రోజుల్లో ముస్లింల కార్యకలాపాల గురించి, కాంగ్రెస్‌ మొదలైన రాజకీయ పార్టీలు ముస్లింలను ఎట్లా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయనే విషయాలు దానిలో ఉన్నాయి. ఏ శక్తులను అంబేద్కర్‌ దళితులకు దూరం గా ఉంచాలని ప్రయత్నించారో ఆ శక్తులు ఇప్పుడు దళితులను దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిణామాలను, అంబేద్కర్‌ ఆలోచనలను హిందూ సమాజం జాగ్రత్తగా గమనించి హిందూ సమాజంలో సమరసత వాతావరణం నిర్మింప చేయటానికి కృషి చేయవలసిన అవసరం ఉంది. 1949 నవంబర్‌ 25న భారతరాజ్యాంగాన్ని ఆమోదించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్‌ ప్రస్థావించిన అంశాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేశం రాజకీయ స్వాతంత్య్రం సంపాదించు కొంది. ఇంకా సాధించ వలసింది సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజస్వామ్య మనేది ఒక జీవన విధానం. దానిలో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే మూడు అంశాలు చాలా ప్రధాన మైనవి. ఈ మూడు ఒకదానితో ఒకటి పెనవేసు కుని ఉంటాయి. వాటిని విడదీస్తే అప్పుడు సామాజిక ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తి ఆధిపత్యాన్ని మేలుకొల్పుతుంది.
స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదరభావం లేని స్వేచ్ఛ సమానత్వా లకు మనుగడ ఉండదని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి దానిని సాధించేందుకు ఏమి చేస్తున్నాం? అంబేద్కర్‌ కలలు సాకారం చేసేందుకు ఏమి చేస్తున్నామని మనలను మనం ప్రశ్నించు కోవాలి. అంబేద్కర్‌ హిందూ సమాజంలో ఏర్పడిన లోపాలను తొలగించేందుకు పని చేయాలని చెప్పారు. ఆ దిశలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం ప్రయత్నిస్తూ ఉంటే ఈ దేశంలో కొన్ని శక్తులు మాత్రం హిందూ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరు చెప్పి దేశ సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంబేద్కర్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నిర్మాత డాక్టర్‌జీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1935 సం|| ఒక సంఘ శిబిరానికి అంబే ద్కర్‌ వచ్చారు. అక్కడ స్వయం సేవకులు ఎలా కలిసిమెలిసి సోదర భావంతో ఉన్నారో పరిశీలిం చారు. సంఘ పని పెరగాలని ఆకాంక్షించారు. అంబేద్కర్‌ కలలను సాకారం చేసేందుకు సంఘం నిరంతరం కృషి చేస్తున్నది. సామాజిక సమరసత లేనిదేె హిందూ సమాజ సంఘటన లేదు. ఆ దిశలో విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి.అదే సామాజిక ప్రజాస్వామ్యానికి నాంది అవుతుంది. ఈ దిశలో వేగంగా అడుగులు వెయ్యటమే అంబేద్కర్‌కు మనం సమర్పించే నిజమైన నివాళి అవుతుంది.