అమరవాణి

శ్లో|| అమిత్రో దణ్ణనీత్యామాయతః
దణ్ణఃసంపదా యో జయతి
దణ్ణనీతి మధితిష్టన్‌ ప్రజాఃసంరక్షతి
దణ్ణాభావే త్రివర్గాభావ
- చాణక్య నీతి
శత్రువు దండనీతికి లొంగుతాడు. దండం సంపదను సంపాదించి పెడుతుంది. దండనీతి అవలంబించిన సంపాదించి పెడుతుంది. దండ నీతి అవలంబించిన వాడు మాత్రమే ప్రజలను రక్షించగలుగుతాడు. దండనీతి అనగా రాజనీతి, పాలనా విధము అని అర్థము. దండం లేకపోతే ధర్మ అర్థకామాలు లేవు.