ధర్మ నిరతులు - ఆదర్శ సతులు

అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌.

అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం.
అందులో అహల్య, ద్రౌపదీ తప్ప మిగిలిన ముగ్గురూ శ్రీరామాయణ మహాకావ్యంతో సంబంధం ఉన్నా వారే. రామాయణంలో జరిగిన ప్రధాన ఘట్టాలు వారితో ముడిపడి ఉన్నాయి.

ముగ్గురూ మూడు రాజ్యాలకు అధినేత్రిలు అని చెప్పొచ్చు. అయోధ్య రాముడి భార్య సీతాదేవి అయితే, కిష్కింధరాజు వాలి భార్య తార, లంకానగర అధినాయకుడు రావణాసురుని భార్య మండోదరి. ఈ ముగ్గురు స్త్రీలు తమ భర్తను అనుక్షణం ధర్మమార్గంలో ప్రయాణించేలా చేయడానికి తమవంతు క షి చేసినవారే. వీరి గుణగణాలు ప్రతి మహిళకు ఆదర్శం. ఈ ముగ్గురు పతివ్రతా మూర్తుల గురించి తెలుసుకుందాం.
సీతాదేవి
''శ్రీ రామాయణం'' అంటే లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. ఇందులో సీతాదేవి మహాత్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని ''సీతాయాశ్చరితం మహత్‌'' అని వెల్లడిచేశారు. శ్రీరాముడు భగవంతుడేనన్న అర్థం,హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది.
క్షమ..దయ...ధైర్యం...వివేకం...ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. ఆమె లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావులు, మేథావులు పరిశోధనలు కూడా చేశారు. సీతలోని సుగుణాలు ఏ కాలం మగువలకైనా ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ సూార్తిేదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.. ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గ హిణిగా మెలిగిన మహాసాధ్వి 'సీతాదేవీ'. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణ చరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై కల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మ స్థాపనకు కారణం అయింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందరాÄలేలో చెప్పారు.
తారాదేవి
వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టి, అతన్ని రాజ్యబహిష్క్రుతున్ని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతో రామబాణానికి నేలకొరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవున్ని రాజ్యానికి రాజును చేసింది. కిష్కింధ రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామకార్యానికి సుగ్రీవున్ని సమాయిత్తం చేసింది. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు. ముఖ్యం గా సుందరకాండలో హను మంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు చదివితే తెలుస్తుంది. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చ రిస్తుంది. వాలి వినడు చని పోతాడు. ఆతర్వాత కూడా రామకార్యం మరిచి పోయాడని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణా చాతు ర్యంతో చల్లపరుస్తుంది. ఆమె ఆ సమ యంలో చెప్పిన మాటలు చూడండి. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా, నేనూ దక్కాము. భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా' అంటూ మాటాడగల్గిన చతుర తార . ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరకాండలో అదుÄతేంగా వివరించబడి ఉంది.
మండోదరి దేవి
రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు. అతడి భార్యే మండోదరి దేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరి దేవి మిక్కిలి సౌందర్య రాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమేగాదు అంతస్సౌందర్యం కూడా కలిగింది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్న ఈ స్త్రీరత్నాన్ని చూసి ఆమే సీతాదేవి అనుకున్నాడు కూడా. రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరస్త్రీ వ్యామోహం వద్దని, నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురునికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయ డానికి సాహసించింది.