ధర్మరక్షణకై పవిత్ర యుద్ధం

''ఇస్లాం మీద పవిత్రయుద్ధం (జిహద్‌) చేయాలి-ధర్మాన్ని రక్షించాలి''-ఈ మాటలు ఒక భారతీయడు కానీ, ఒక హిందుత్వ వాది కాని అన్న మాటలు కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్‌ ట్రంప్‌కు ప్రధాన వ్యూహకర్తగా, జాతీయ రక్షణ కౌన్సిల్‌ సభ్యుడుగా ఉన్న స్టీల్‌ బానన్‌ అన్న మాటలు. 

అమెరికన్‌గా జన్మించి క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్న ఇతడు తరుచుగా ''ధర్మం'' అనే పదం వాడుతూ ఉంటాడు. శ్రీమత్‌ భగవద్గీత అంటే విపరీతమైన ఇష్టం. స్టీల్‌ బానన్‌ ఇలా అంటున్నాడు-''గత 2000-2500 సంవత్సరాలలో ప్రపంచంలో నైతిక పతనం జరిగింది.మన అన్ని సమస్యలకి పరిష్కారం ధర్మరక్షణలోనే ఉన్నది. భగవద్గీత మనకు మార్గం చూపిస్తున్నది.'' ముస్లింలు, ముస్లిం దేశాల మీద అమెరికా పెట్టిన ఆంక్షలు అన్నీ కూడా స్టీవ్‌బానన్‌ పనే అని అమెరికన్లు అంటున్నారు.