ప్రముఖులు మాట

ఎప్పుడైతే ఎన్‌కౌంటర్లో తీవ్రవాదులు హతులౌతుంటే, పాక్‌ ప్రేరిత ఉగ్రవాద వేర్పాటు దారులు పైసలు పంచి అమా యక యువకులను పోలీస్‌సైన్యం ఎదుట నిల బెట్టుతూ రెచ్చగోట్టుతుంటారు. ఈ మధ్య తీవ్ర వాదులు వేరే మార్గల ద్వారా పారిపోతున్నారు.
- డిజిపి, జమ్ముకాశ్మీర్‌ ప్రాంతం 

నేడు న్యూఢిల్లీలో ఒక శక్తి వంతమైన జాతీయవాద ప్రభుత్వ మున్నది. దేశ హితమే ప్రథమ ధ్యేయంగా కాంక్షించి నిర్ణయాలు గైకొంటుంది. మేము వేరే దేశంపైన ఒత్తిడికాని ప్రభావంకాని ప్రదర్శించ డాన్ని విశ్వసించము. అదే విధంగా ఇతర దేశాలు మాపై ఒత్తిడికాని, భయంకాని బెదిరింపులకు పూనుకుంటే అదిరేది, బెదిరేది అంతకన్నా లేదు.
- కిరణ్‌ రిజీజు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
 
ఇక ఉత్తర ప్రదేశ్‌లో శక్తివంతమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వం మనుగడలో ఉన్నది. ఎవరికి ఏ రకంగా నూ బెదరవలసిన పని లేదు. అందరి కోసం అందరి వికాసం మా నినాదమే కాదు విధానం కూడా. కాని ఎవ్వరి పట్ల కూడా తుష్టీకరణ జరగదు. గుండాలు-మాఫీయాలు, మత మౌఢ్యులు కావాలంటే రాష్ట్రం వదిలి వెళ్లదలిస్తే వెళ్లి పోవచ్చును. చట్టం ముందు అందరు సమానమే. 15సంవత్సరాల కలుషిత-కళంకిత రాజ్యాన్ని 15 రోజుల్లో స్వచ్ఛత-భద్రత- బాధ్యతాయుత రాష్ట్రంగా మార్చుటమే మా ప్రథమ లక్ష్యం.
- యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి