సేవామార్గంలో సంఘం

భారతదేశ సర్వతొముఖాభివృద్ధి రాష్ట్రీయ స్వయంసేవకు సంఘం ''యహమత్‌ సంఘ కిసీ క్షేత్ర్‌కో ఖాలీ రహె జానేదేంగే, ఉమఢ ఘమడ కర్‌ హర్‌ ధరతీకో నందన్‌ వన్‌సా సరసాయే..'' అని పాడుకునే స్వయంసేవక్‌ అన్నంత పని చేశాడు. విద్య, ఆరోగ్య, కార్మిక, కర్షక రంగాలలో ఒకటేమిటి, అన్ని రంగాలలో సంఘం నాణ్యమైన సేవలు అందిస్తూ భారతమాత ఆరాధన చేస్తున్నది. 
మహరాష్ట్రలోని ఔరంగబాద్‌లో డాక్టర్‌ హెడ్గె వార్‌ వైద్యశాల పేరుతో ఒక ఉత్తమ వైద్యశాలని నడుపుతున్నది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వైద్యకీయ పేరుతో ఒక ఉత్తమ వైద్యశాలని నడుపుతున్నది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వైద్యకీయ ప్రతిష్టానం (బిఎవిపి) అనే సంస్థ ద్వారా ఈ కార్యం నడుస్తున్నది.
కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి (సిఎస్‌ఆర్‌) అనే పథకం క్రింద, ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిల్‌& నేచురల్‌ గ్యాస్‌ కమిషన్‌ (ఓఎన్‌జిసీ) అస్సాంలోని శివసాగర్‌ జిల్లా రాజబేరిలో ఒక బృహత్‌ వైద్యశాల నిర్మించ పూనుకున్నది.
దీనికోసం ఓఎన్‌జిసి బాబాసాహెబ్‌ - అంబేడ్కర్‌ వైద్యకీయ ప్రతిష్టానం సహాయంతో నిర్మాణానికై ఒక ఒప్పందం (యంఓయు) కుదుర్చుకున్నది. అస్సాంలో నిర్మించే ఈ వైద్యశాల స్వరూపం ఈ విధంగా ఉంటుంది- 3కోట్ల 75లక్షల విలువైన 50ఎకరాల స్థలంలో మూడు వందల పదమూడు (313) కోట్ల వ్యయంతో 300 పడకల వైద్యశాలలో అంతర్గత వైద్యం, శిశు చికిత్స, సామాన్య శస్త్ర చికిత్స, చెవి, ముక్కు, గొంతు, వ్యాధులు, స్త్రీ సంబంధిత వైద్యసేవల రంగాలలో నిపుణులచే చికిత్స అందజేయబడుతుంది. ఇందులో ప్రజా సౌకర్యం కోసం 70శాతం తగ్గింపు ధరలకే వైద్యం చేస్తారు. వచ్చిన ఆదాయం మొత్తం పరిశోధనలకై వెచ్చిస్తారు. ఓఎన్‌జీసీలో సిబ్బంది శాఖ (డైరెక్టర్‌) శ్రీ డి.డి మిశ్రా ఈ వివరాలు తెలియజేశారు.
సేవాభారతి ద్వారా ఇప్పటికే జరుగుతున్న సేవలకు ఇది అదనం. సేవాభారతి గిరిజనులకు విద్యవైద్య సేవలు, పోషకాహరం, నిరాశ్రయుల సేవ , బ్రిడ్జ్‌ పాఠశాలలు ఇంకా ఎన్నో విధాల సేవలు అందిస్తున్న నిర్ణయం తెలిసిందే.