రావణ కాష్టం - కశ్మీర్‌ లోయ

భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి కశ్మీర్‌ లోయ దేశంలో ఒక రావణ కాష్టంగా ఉంది. కశ్మీర్‌ సమస్య కు మూల కారణం భారత్‌లో విలీనమైన సమయంలో కశ్మీర్‌లోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్‌ మూకలను మన సైన్యం తిప్పి కొడుతూ పరిగెత్తిస్తూ ఉంటే అప్పటి మన ప్రధాని నెహ్రూ ఏక పక్షంగా యుద్ద విరమణ ప్రకటించారు. దాని కారణంగా కశ్మీర్‌లోని కొంత భూభాగం పాకిస్తాన్‌ ఆధీనంలో ఉండి పోయింది.

దేశ హితం కన్నా ప్రాణం ముఖ్యం కాదు

'ప్రాణలైనా అర్పిస్తాం....సాధిస్తాం' అనే నినాదాలు మనం తరుచు వింటూ ఉంటాం. ఐతే నిజంగానే ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచిన ఒక వీరకిశోరం మన మధ్యనే ఉన్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాసు గ్రేహౌండ్స్‌ విభాగంలో ఒక కానిస్టేబుల్‌ ఇప్పుడు తెలంగాణ కౌంటర్‌ ఇంటలిజెంటు శాఖలో పని చేస్తున్నాడు. హజ్రత్‌ హజీ మొహ్మద్‌ ఆలమ్‌ జీద్‌ అఫ్రీదీ ఒక ఇస్లామిక్‌ తీవ్రాది. 

అల్లం మనకందరికీ సుపరిచితమైన ఔషధి

దీని గురించి ప్రతీ ఒక్కరికీ కొద్దో గొప్పో తెలిసే ఉంటుంది. ఏదో విధంగా దాని ఉపయోగాలు మనకి తెలిసినవే. కానీ ఆయుర్వేదం ప్రకారం మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం. 

మహిళా భద్రత - ప్రభుత్వ పాత్ర

'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా'.. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. అవును.. స్త్రీలను గౌరవించుకోవడం మన సంప్రాదాయం. సంస్క తి. ఇది మన వారసత్వం. మన భారతీయ సంస్క తిలో ప్రక తిని కూడా తల్లిలా భావించి పూజిస్తాం. అలాంటి మన దేశంలో ఇటీవల కాలంలో మహిళలపై ఎన్నో అకత్యాలు జరుగుతున్నాయి. అలాంటి ఘోరాలు జరగడానికి కారణాలు అనేకం ఉండొచ్చు కానీ వాటిని ఆపవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.

మీ 'మిషనరీ' సేవలు ఇక చాలు!

ఇటీవల అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు 107మంది భారత హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, మన దేశంలో నిషేధించబడ్డ అమెరికా స్వచ్చంద సంస్థ 'కంపాషన్‌ ఇంటర్నేషనల్‌'ను (సీఐ) భారత్‌లో తన సేవా కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించాలని కోరుతూ, ఒక లేఖ రాశారు. దాంట్లో 'ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్స్‌) ఆక్ట్‌' ప్రకారం ప్రభుత్వం అమలుపరుస్తున్న తీరుతెన్నుల్లో పారదర్శకత, స్థిరత్వం కొరవడిందంటూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. దానికి సమాధానంగా బిజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ బల్బీర్‌సింగ్‌ పుంజ్‌ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఐ భారతీయ బాలల శ్రేయస్సుకు ఏ విధంగా హాని తలపెడుతోందో వివరిస్తూ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల ద్వంద్వ వైఖరిని బహిరంగ లేఖ ద్వారా ఎండగట్టారు. 

వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ

ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచి, పట్టాభిషిక్తుడయిన రోజును (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) ఇప్పుడు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాము. శివాజీకి ముందు, ఆ తరు వాత కూడ అనేకమంది రాజులు సామ్రాజ్యాలను ఏర్పరచారు. కాని వాటిని వేటిని 'హిందూ సామ్రాజ్యాలు' అని ప్రత్యేకంగా చెప్పుకోవటం లేదు. శివాజీ తన సామ్రాజ్యాన్ని ఏర్పరచినప్పటి పరిస్థితులు, అందుకై అనుసరించిన పద్ధతుల వల్ల అది ప్రత్యేకమయ్యింది. 

రాజస్థాన్‌ గ్రామాలకు జలకళ తెచ్చిన ఆమ్లా రుయా

రాజస్థాన్‌లోని 100 గ్రామాల ప్రజలకు ఆమె ఒక 'జల దేవత'. నీరులేక ఎండిపోతున్న తమ బతుకులను సస్యశ్యామలం చేసిన 'గంగమ్మ తల్లి'. సం
భారీ ఆనకట్టలకంటే చెక్‌డ్యాంల వల్ల ప్రయోజనాలు ఎక్కువ. వీటి నిర్మాణానికి ఖర్చు చాలా తక్కువ. ప్రజల్ని మరొక ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉండదు. అలాగే అవసరానికంటే మించి నీటిని నిల్వ చేయాల్సిన అగత్యం ఉండదు. ఆనకట్టకు గండిపడి చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉండదు.

హద్దు మీరిన చైనా - సరిహద్దు దాటిన నిర్ణయాలు

మొదటినుంచీ అరుణాచల్‌ప్రదేశ్‌పై కన్నేసిన చైనా.. కొత్త కొత్త వ్యూహాలకు తెరతీస్తోంది. కొద్ది కాలంగా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. భారత్‌అభ్యంతరాలను తోసిరాజని కవ్వింపు చర్యల కు పాల్పడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమ దేశంలోని దక్షిణ టిబెట్‌లో భాగమని పాతపాటే పాడుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు కీలక ప్రాంతాల పేర్లను ఏకపక్షంగా మార్చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను మార్చేసింది డ్రాగన్‌ కంట్రీ చైనా. దలైలా మా, టిబెట్‌ప్రజలతో అనుబంధం ఉన్న ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. 

సామాజిక సమానత్వం ఒక నిశ్చయం

'ఒకే దేవాలయం, ఒకే స్మశానం, ఒకే నీటి వసతి' ద్వారా సామాజిక సమానత్వం, సమరసతలను సాధించడానికి ఒక చక్కని కార్యాచరణను ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ శ్రీ మోహన్‌ భాగవత్‌ మన ముందుంచారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం లేనివాళ్ళు కూడా ఈ చొరవను
1925లో ప్రారంభమైన నాటి నుండి సామాజిక సమరసత ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలిక స్వభావమైంది. ఆ తరువాత బాలాసాహెబ్‌ దేవరస్‌ దానికి మరింత ప్రాధాన్యత నిచ్చారు. ఈ విషయంలో వారి ఆలోచన గురించి మీరేమంటారు?
సమరసత సాధించనిదే హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం సాధ్యం కాదు. అందువల్ల వివక్షలేని విధానం, ఆచరణ తప్పనిసరి. 

ఉదారవాద మేధావుల భేద తంత్రాన్ని వమ్ము చేయాలి

ఈ మధ్య కాలంలో గోరక్షకుల పేరుతో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని దేశమంతా మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, హిందువులు ఉన్మాదులుగా మారుతున్నారని కొందరు మేధావులు పని గట్టుకొని దేశ విదేశాలలో ప్రచారం చేస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలను ఆసరాగా చేసుకుని ఉదారవాద మేధావులు హిందుమతోన్మాదులు దేశమంతా యోజనాబద్ధంగా దాడులు చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపిస్తున్నదని, ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే మైనార్టీలపై దాడులు, హిందూ మతోన్మాదం అని పదే పదే ప్రచారం చేస్తున్నారు. 

హితవచనం

వేల సంవత్సరాలుగా ఏ విధమైన బాధ లేకుండా మనం జాతీయ జీవనాన్ని సాగిస్తూ వచ్చాం. అలా మన ఉనికిని, సామర్ధ్యాన్ని నిలుపుకుంటూ వచ్చాం. మన దేశ చరిత్రలో స్వాతంత్య్రం కోసం చేసిన యుద్ధాలు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అనేక సంఘర్షణల మధ్య కూడా భారతదేశం తన అస్తిత్వాన్ని, చరిత్రను కాపాడుకుంటూ వచ్చింది.

ఇవ్వడం నేర్చుకోవాలి

సమర్థరామదాసు ఒక ఊళ్ళో కేవలం ఐదు ఇళ్ళ నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఒక గ్రామంలో వృద్ధమహిళ ఒంటరిగా ఉండేది. ధనికురా లైనా ఆమె ఎవరికీ ఏ దానం చేయదని అంతా చెప్పారు. ఆమెకు దానగుణం నేర్పడం కోసం సమర్థరామదాసు ఆ ఇంటికే వెళ్ళారు. 'భవతి భిక్షాందేహి' అని భిక్ష కోసం అడిగారు. వృద్ధురాలు బయటకై నా రాకుండా లోపల నుంచే నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ ఇవ్వను అని గట్టిగా అరిచింది. అయినా సమర్థరామదాసు తన ప్రయత్నం విరమించలేదు. 

కంచి పరమాచార్య జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి జయంతి మే 20

నడిచే దైవంగా ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి పూర్వాశ్రమ నామం స్వామి నాధన్‌. 1894 మే 20వ తేదీన అనురాధ నక్షత్రంలో ఒక కన్నడ సాంప్రదాయ బ్రాహ్మణ కు
అనతి కాలంలోనే వారు కూడా మరణించడంతో 1907 ప్రభవనామ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన 13 సంవత్సరాల వయస్సులో ''చంద్రశేఖర సరస్వతి''గా సన్యాస దీక్ష తీసుకున్నారు. 1907 మే 9వ తేదీన కంచి కామకోఠి పీఠం 68వ పీఠాధితిగా పట్టాభిషిక్తులయ్యారు. 

అమరవాణి

శో|| విద్యాధన మధనానామ్‌
విద్యా చోరైరపిన గ్రాహ్య
విద్యాయా సులభా ఖ్యాతిః
యశఃశరీం న వినశ్యతి
ధనం లేని వాళ్లకు విద్యయే ధనం. విద్యను దొంగలు కూడా అపహరించజాలరు.
విద్యవల్ల ప్రసిద్ధి చిక్కును. విద్యావంతుల భౌతిక శరీరం నశించినా యశస్సు అనే శరీరం నశించదు.
- చాణక్య నీతి

ప్రముఖులు మాట

కశ్మీరులో కొన్ని సంవత్సరాల నుంచి రాళ్లనే ఆయుధాలుగా మార్చి అసహ్యపు దాడికి పూను కుంటున్నారు. మత మౌఢ్య మూకలు కశ్మీరు యువతరాన్ని, వారి క్రియాశీల జీవనశైలిని వాహాబీ ఇస్లామ్‌, జిహద్‌ హైజాక్‌ చేసేసింది. కశ్మీరులో విసిరే రాళ్లు కేవలం భారతీయ సైనికులు, హిందు వుల పై కాదని, 'కాశ్మీరీ-సంప్రదాయం' పైనే అన్నది మరువరాదు. ఈ ధోరణి తమ జన్మభూమి, తమ పూర్వీకుల పట్ల తీవ్ర వ్యతిరేకత - అహస్యపు ఆలోచనలు రేకేత్తించి ఉంటే అది వారి పురోగతికే పెను ప్రమాదం.
ఆర్‌ఎస్‌ఎన్‌. సింహ్‌, మాజీ సైనిక గుప్తచారి విభాగం అధికారి