కంచి పరమాచార్య జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి జయంతి మే 20

నడిచే దైవంగా ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి పూర్వాశ్రమ నామం స్వామి నాధన్‌. 1894 మే 20వ తేదీన అనురాధ నక్షత్రంలో ఒక కన్నడ సాంప్రదాయ బ్రాహ్మణ కు
అనతి కాలంలోనే వారు కూడా మరణించడంతో 1907 ప్రభవనామ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన 13 సంవత్సరాల వయస్సులో ''చంద్రశేఖర సరస్వతి''గా సన్యాస దీక్ష తీసుకున్నారు. 1907 మే 9వ తేదీన కంచి కామకోఠి పీఠం 68వ పీఠాధితిగా పట్టాభిషిక్తులయ్యారు. 
 87వ సంవత్సరముల పీఠాధినతిగా వున్న కాలంలో రామేశ్వరం నుంచి కాశీ వరకు రెండుసార్లు కాలినడకన పర్యటించి సనాతన ధర్మం విశిష్టతను తెలియజేశారు. 1994 జనవరి 8వ తేదీన మహా సమాధి పొందారు.

టుంబంలో తమిళనాడులోని దక్షిణ ఆర్కాటు జిల్లా విల్లుపురంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి జిల్లా విద్యాశాఖాధికారిగా ఉండేవారు. స్వామినాధన్‌ ప్రాథమిక విద్య తిండివనం పట్టణంలోని అమెరికన్‌ మిషన్‌ హైస్కూలులో జరిగింది.చదువులో అసమాన ప్రజ్ఞాపాటవాలు కనపర్చారు. 1905లో ఉపనయనం జరిగిన తరువాత వేదాధ్యయనం ప్రారంభించారు. 1906లో తిండివనంలో 66వ శంకరా చార్యులను చాతుర్మాస దీక్షలో మొదటిసారిగా దర్శించారు. అప్పటి నుంచి తండ్రితో కలిసి కంచి మఠాన్ని తరుచుగా సందర్శించే వారు. 1906లోనే 66వ శంకరాచార్య జబ్బు పడినప్పుడు స్వామినాధన్‌ పెద్దతల్లి గారి కుమారుడు లక్ష్మీనాధన్‌ 67వ శంకరాచార్యగా నియమితులయ్యారు.