రావణ కాష్టం - కశ్మీర్‌ లోయ

భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి కశ్మీర్‌ లోయ దేశంలో ఒక రావణ కాష్టంగా ఉంది. కశ్మీర్‌ సమస్య కు మూల కారణం భారత్‌లో విలీనమైన సమయంలో కశ్మీర్‌లోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్‌ మూకలను మన సైన్యం తిప్పి కొడుతూ పరిగెత్తిస్తూ ఉంటే అప్పటి మన ప్రధాని నెహ్రూ ఏక పక్షంగా యుద్ద విరమణ ప్రకటించారు. దాని కారణంగా కశ్మీర్‌లోని కొంత భూభాగం పాకిస్తాన్‌ ఆధీనంలో ఉండి పోయింది.
 పాకిస్తాన్‌ దానిని ఆజాద్‌ కశ్మీర్‌ అంటుంది. మిగిలిన కశ్మీర్‌ను కూడా ఏదో విధంగా అక్రమించుకోవాలని పగటి కలలు కంటోంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాకిస్తాన్‌ చేయని ప్రయత్నం లేదు. భారత్‌ ఏ క్షణంలో కూడా కశ్మీర్‌ నుంచి దృష్టి మరల్చనివ్వని పరిస్థితులు పాకిస్తాన్‌ నిర్మాణం చేస్తుంది. నిరంతరం దాడులు దాని పనిగా ఉంది.
కశ్మీర్‌ భారత్‌లో విలీనం అయినప్పటి నుంచి కశ్మీర్‌ రాజకీయలు షేక్‌ అబ్దుల్లా కుటుంబం చుట్టు తిరుగుతున్నాయి. ఈ రోజు ఫారుక్‌ అబ్దుల్లా, ఓమర్‌ అబ్దుల్లా ఆ పాత్రను పోషిస్తున్నారు. కాంగ్రెస్‌ వారి చుట్టు తిరుగుతూ ఉంటారు.
ముస్లిం రాజకీయాలు ఈ మధ్య ఒక సభలో ఫారుక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ కశ్మీర్‌లో సాయుధ బలగాల ప్రాబల్యం పెరుగుతున్నదని, కశ్మీర్‌ను మనం కోల్పోతున్నామని అన్నాడు. కశ్మీర్‌ సమస్య శాశ్వత పరిష్కారానికే మూకల రాళ్లవర్షం కురిపిస్తున్నారంటూ ప్రజలను అదే పనిగా రెచ్చగొడుతూ ఉంటే దానికి గట్టి సమాధానం కశ్మీర్‌ ప్రభుత్వం కాని అక్కడున్న రాజకీయ నాయకులు కానీ చెప్పలేక పోతున్నారు.
బుర్హన్‌ వాని వధ తరువాత దక్షిణ కశ్మీర్‌లో రాళ్లు విసరటమనేది ఒక పరిశ్రమగా మారిపోయింది. గడిచిన సంవత్సరంలో కశ్మీర్‌ లోయలో 1029దాడులు జరిగాయి. ఆ దాడులలో 3550మంది గాయపడ్డారు. అందులో 1300మంది సీిఆర్‌ఫిఎఫ్‌ జవాన్లు కాగా మిగిలిన 2230మంది స్థానిక పోలీసులు. అంటే స్థానిక పోలీసులు ఉగ్రవాదంపై పోరాడుతూనే ఉన్నారనేది సత్యం. ప్రజలను రెచ్చగొట్టే వారిపై ప్రభుత్వాలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేక పోతున్నాయనేది పెద్ద ప్రశ్న . పైగా సాయుధ బలగాలపై కోర్టులలో కేసులు వేస్తుంటారు. ఈ మధ్య శ్రీనగర్‌ హైకోర్టులో పెల్లట్‌ గన్‌లకు వ్యతిరేకంగా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఒక కేసు వేసింది. శ్రీనగర్‌ హైకోర్టు దానిని కొట్టివేసింది. ఆ తరువాత అసోసియేషన్‌ వాళ్లు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఏప్రిల్‌ 10న దానిపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతూ ''కశ్మీర్‌లో పెల్లట్‌ గన్స్‌ వద్దంటున్నారు సరే కాని ప్రాణాలు తీసేందుకు దాడులు చేస్తున్న అల్లరి మూకలను ఎలా అడ్డుకోవాలో మీరే సూచించండి. అల్లరి మూకల దాడులను తిప్పికొడుతున్న భద్రతాదళాలపై రాళ్లు విసురుతున్నారు వాళ్లు 12సంవత్సరాల లోపు పిల్లలే. అల్లరి మూకలు వెనుక ఉండి పిల్లలను ఎందుకు నడిపిస్తున్నారు. ఎక్కువగా 13 నుంచి 25 సంవత్సరాల వయస్సు వున్న వారే గాయ పడుతున్నారు. అల్లరి మూకలు ఎందుకు గాయ పడడం లేదు.'' అని సూటిగా కశ్మీర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్న మనకు అనేక విషయాలను అర్థం చేస్తున్నది. దాడులు యోజన బద్ధంగా జరుగు తున్నాయని తేలుతోంది. ఆ భేద తంత్రాన్ని అక్కడి ప్రభుత్వం ఎందుకు ఛేదించ లేక పోతున్నది? ఎందుకంటే కశ్మీర్‌ సమస్య 1) కశ్మీర్‌ వేర్పాటువాదులు 2) షేక్‌ అబ్దుల్లా కుటుంబ రాజకీయాలు 3) పాకిస్తాన్‌ 4) రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నాలుగు స్తంభాలాటలాగా మారిపోయింది. కశ్మీర్‌ సమస్యపై దేశంలో కూడా
భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కశ్మీర్‌ ఒక జాతి అని, ఆ జాతి ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నారని, దానికి తాము మద్ధతు ఇస్తామని కొందరు అంటున్నారు. దేశంలో జాతీయ వాదం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దానితో మైనార్టీలు ఆభద్రతలో పడుతున్నారు. కశ్మీరీలు భారతీయులే, అంతేకానీ పూర్తిగా నిర్మూలించ వలసిన లేదా తరమికొట్టవలసిన కీటకాలు కాదు. భద్రత బలగాలు-కశ్మీర్‌ పౌరులు ఇద్దరికి హక్కులు ఉన్నాయని అంటూ వాదిస్తున్నారు.
ఇక టివి ఛానల్‌లు రాజ్యంగం వర్సేస్‌ పౌరులు అనే కథనాలు ప్రసారం చేస్తూ మిగతా విషయాలను ఉపేక్షిస్తున్నాయి.కశ్మీరీలను భారతరాజ్యంగ బాధితులుగా ఉదారవాదులు పరగణిస్తూ ఉన్నారు. జాతి ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ కశ్మీర్‌ వ్యవహరాలను చక్కదిద్దాలని జాతీయ వాదులు కోరుకుంటారు. ఇట్లా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నడుస్తున్నది. కశ్మీర్‌ అసలు సమస్య ముస్లిం సమూహాల ఆక్రమణ స్వభావం. ముస్లింలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ తమదే. దానిలో ఇంక ఎవరు జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే ఆందోళన మార్గం పడుతారు. కశ్మీర్‌లోని మేధావి వర్గాలు మాత్రం పాకిస్తాన్‌ నుంచి కశ్మీర్‌ను కాపాడుకోవటంలో కేంద్రం తమకు సహకరించాలని, అభివృద్ధికై డబ్బులు కేటాయించాలని కోరుకుంటూనే పాలన దృష్ట్యా ఒక స్వతంత్య్ర దేశంగా చూడాలని, ఎటువంటి జోక్యం చేసుకోకూడదనేది వారి డిమాండ్‌. మరో ప్రక్క కశ్మీర్‌ తమ సొత్తని, దానిని భారత్‌ నుంచి ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్‌ చూస్తున్నది. ఈ దేశంలోని ఉదారవాద మేధావులు కశ్మీర్‌ లోయను ముస్లింలకు వదిలి పెట్టేస్తే పీడ పోతుందని అని అంటుంటారు. ఒక వేళ అదే జరిగితే పీడ పోవడం కాదుకాని కొత్త కొత్త పీడలు తయారవుతాయి. ఈ విషయలను అర్థం చేసుకోవాలి. కశ్మీర్‌ సమస్య సార్వభౌమత్వాని కి ఎదురవుతున్న సమస్య కాబట్టి కశ్మీర్‌ విషయంలో అచితూచి అడుగేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పాకిస్తాన్‌ అక్రమణలో ఉన్న భాగాన్ని స్వాధీనం చేసుకోవటమే. ఈ విషయంలో పార్లమెంట్‌లో ఏక గ్రీవ తీర్మానం చేసింది. దానిని అమలు చేసే వరకు అది ఒక రావణ కాష్టమే.