మీ 'మిషనరీ' సేవలు ఇక చాలు!

ఇటీవల అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు 107మంది భారత హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, మన దేశంలో నిషేధించబడ్డ అమెరికా స్వచ్చంద సంస్థ 'కంపాషన్‌ ఇంటర్నేషనల్‌'ను (సీఐ) భారత్‌లో తన సేవా కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించాలని కోరుతూ, ఒక లేఖ రాశారు. దాంట్లో 'ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్స్‌) ఆక్ట్‌' ప్రకారం ప్రభుత్వం అమలుపరుస్తున్న తీరుతెన్నుల్లో పారదర్శకత, స్థిరత్వం కొరవడిందంటూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. దానికి సమాధానంగా బిజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ బల్బీర్‌సింగ్‌ పుంజ్‌ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఐ భారతీయ బాలల శ్రేయస్సుకు ఏ విధంగా హాని తలపెడుతోందో వివరిస్తూ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల ద్వంద్వ వైఖరిని బహిరంగ లేఖ ద్వారా ఎండగట్టారు. 
' ప్రియమైన అమెరికా శాసనకర్తల్లారా, 1968లో భారత్‌లో సీఐ తన కార్యకలాపాలను ప్రారంభించి న నాటి నుంచి ఆ సంస్థ రికార్డు ఏమిటి? అనాథ బాలల శ్రేయస్సే భారత్‌లో సీఐ కార్యకలాపాల ప్రధాన లక్ష్యమైతే, అటువంటి సేవలను అమెరికాలోనే అందించవల్సిన అవసరం ఎంతైనా వున్నదనేది ఒక వాస్తవం. 2011లో, అమెరికాలో బాలల పేదరికం అంతకుమున్నెన్నడూలేని విధంగా రికార్డు స్థాయికి పెరిగింది. ప్రపంచపు అతి సంపన్న దేశంలో 16.7 మిలియన్‌ బాలలకు కుటుంబ భద్రత లేదని 2011లో వెల్లడయింది. ఈ దురదష్టవంతులైన బాలల సంఖ్య 2007లో కంటే 35 రెట్లు అధికం. మొత్తం అభి వద్ధిచెందిన దేశాలలో బాలల పేదరికం విషయంలో అమెరికాది ద్వితీయ స్థానం!
అర్బన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2016లో నిర్వహించిన ఒక అధ్యయనంలో అల్పాదాయ కుటుంబాలకు చెందిన టీనేజర్లు తమ ఆకలిదప్పులను తీర్చుకోవడానికై మాదక ద్రవ్యాలను విక్రయించడం లేదా వ్యభిచారానికి పాల్పడక తప్పని దుస్థితిని ఎదుర్కొంటున్నారని వెల్లడయింది. ఉండడానికి ఎటువంటి ఇల్లు లేని బాలల సంఖ్య 2013లో రికార్డు స్థాయిలో 25 లక్షలకు (ప్రతి 30 మంది బాలల్లో ఒకరు ఇల్లులేని వారే) పెరిగిందని నేషనల్‌ సెంటర్‌ ఆన్‌ ఫ్యామిలీ హోమ్‌లెస్‌నెస్‌ తన 2014 వార్షిక నివేదికలో పేర్కొంది.
మీ దేశంలో బాలలు పేదరికంతో పాటు కుటుంబాల విచ్ఛిత్తి వల్ల కూడా అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రతి 36 సెకండ్లకు ఒక జంట విడాకులు తీసుకొంటున్నది. అంటే రోజుకు దాదాపు 2400, వారానికి 16,800, సంవత్సరానికి 8,76,000 విడాకులు మంజూరవుతున్నాయి.
మా వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవడం న్యాయబద్ధమేనా? భారత్‌లో కరుణా బాల వికాస్‌ ట్రస్ట్‌ ద్వారా సీఐ పనిచేస్తుంది. ప్రతిరోజూ క్రైస్తవ ప్రార్థనలు జరపడం, క్రైస్తవ పండుగలను మాత్రమే జరపడం, బైబిల్‌ పఠనం విషయంలో బహుమతులు ఇవ్వడం మొదలైనవి ఆ సంస్థ నిర్వహించే బాలల 'సంక్షేమ' కార్యకలాపాలలో భాగంగా వున్నాయి. సీఐ లక్ష్యాలు ఏమిటో స్పష్టం కాలేదా?
అలాంటి 'సేవ' ఇక మాకు చాలు. 15వ శతాబ్దిలో గోవా తీరానికి పోర్చుగీస్‌ నావికులు వచ్చిన తరువాత అటువంటి 'సేవ'ను మేము ఎంతో పొందాం. ఈస్టిండియా కంపెనీ అధికార పత్ర చట్టం (ఛార్టర్‌ ఆక్ట్‌) 813 లో ఒక నిబంధనను చేర్చడంలో చర్చ్‌ సఫలమవడంతో బ్రిటిష్‌ మిషనరీలకు మన దేశపు ద్వారాలు తెరుచుకున్నాయి. 'సేవ' పేరుతో మిషనరీలు కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు. సామాజిక వర్గాలను విడదీశారు. మతం మార్చుకున్న వ్యక్తులను వారి జన్మభూమి సంస్క తీ సంప్రదాయాలకు పూర్తిగా దూరం చేశారు.
మీరు, అమెరికా ప్రజాస్వామ్యపు ప్రముఖ నాయకులు. రొట్టె ముక్కను విసిరి ఆత్మలను కొనుగోలు చేసే కుంభకోణంలో దయచేసి భాగస్వాములు కావద్దు. నా యీ అభ్యర్థనను మీరు వినకపోతే జీసస్‌ క్రీస్తు మిమ్ములను క్షమించడు గాక క్షమించదు.ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.'