అమరవాణి

శో|| విద్యాధన మధనానామ్‌
విద్యా చోరైరపిన గ్రాహ్య
విద్యాయా సులభా ఖ్యాతిః
యశఃశరీం న వినశ్యతి
ధనం లేని వాళ్లకు విద్యయే ధనం. విద్యను దొంగలు కూడా అపహరించజాలరు.
విద్యవల్ల ప్రసిద్ధి చిక్కును. విద్యావంతుల భౌతిక శరీరం నశించినా యశస్సు అనే శరీరం నశించదు.
- చాణక్య నీతి