మహిళా భద్రత - ప్రభుత్వ పాత్ర

'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా'.. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. అవును.. స్త్రీలను గౌరవించుకోవడం మన సంప్రాదాయం. సంస్క తి. ఇది మన వారసత్వం. మన భారతీయ సంస్క తిలో ప్రక తిని కూడా తల్లిలా భావించి పూజిస్తాం. అలాంటి మన దేశంలో ఇటీవల కాలంలో మహిళలపై ఎన్నో అకత్యాలు జరుగుతున్నాయి. అలాంటి ఘోరాలు జరగడానికి కారణాలు అనేకం ఉండొచ్చు కానీ వాటిని ఆపవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.
 వారితో పాటూ ప్రభుత్వానిది కూడా ఈ బాధ్యత అనడంలో సందేహమేమీ అక్కర్లేదు. మహిళలపై జరుగుతున్న దాడులను నివారించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకుంటున్నాయి. వాటిల్లో కొన్ని... పింక్‌ ఆటోలు
మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో, జార్ఖండ్‌ ట్రాఫిక్‌ పోలీసులు రాంచీలో మహిళల భద్రత కోసం ఓ సరికొత్త పథకం ప్రారంభించారు. ఇందుకోసం 'పింక్‌ లైన్‌' అనే ఆటో రిక్షా సేవలను ప్రత్యేకించి మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఈ ఆటోలు పింక్‌ కలర్‌ రూఫ్‌ను కలిగి ఉండి, మహిళలకు మాత్రమే అనే బోర్డును కలిగి ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి 200 ప్రత్యేక ఆటో రిక్షాలు నడపాలని పోలీసులు యోచిస్తున్నారు. పింక్‌ లైన్‌ ఆటో రిక్షాలను మహిళలే డ్రైవ్‌ చేస్తారు. ఒకవేళ మహిళా ఆటో డ్రైవర్లు అందుబాటులో లేని నేపథ్యంలో, పురుష ఆటో డ్రైవర్లను ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేసి, వారికి ఐడి కార్డులను జారీ చేస్తారు. అంతేకాకుండా, ఇలాంటి ఆటో పింక్‌ లైన్‌ ఆటో రిక్షాలు జిపిఎస్‌ ద్వారా శాటిలైట్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ సదుపాయం వలన సదరు ఆటో రిక్షాలు ఏ రూట్‌లో ప్రయాణిస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయనే సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. జార్ఖండ్‌లో ఉన్నట్లుగానే ఒడిశాలోని భువనేశ్వర్‌లో కూడా ఈపింక్‌ ఆటోలు చక్రం తిప్పుతున్నాయి. ఈ ఆటోలను తేలిగ్గా గుర్తించేందుకు ఓ ప్రత్యేకమైన లేబుల్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. సురక్షితమైన ప్రయాణమే కాదు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వైద్యమందించేందుకు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ కూడా కలిగుంటాయి ఈ ఆటోలు. ప్రయాణీకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సజెషన్‌ బాక్స్‌లు కూడాఈ ఆటోల్లో ఉంటాయి.
ఇక ముంబై కూడా పింక్‌ సిటీ కాబోతోంది. పింక్‌ ఆటోల పేరుతో మహిళలకు రక్షణ కల్పిస్తూ 548 మంది మహిళా ఆటోడ్రైవర్లను నియమించింది మహారాష్ట్ర ప్రభుత్వం. 548 ఆటోల్లో 465 మంది ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ నుంచి మిగిలిన 83 మంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కేవలం మహిళల్నే ఈ ఆటోలకు డ్రైవర్లుగా నియమించనున్నారు. ఇప్పటికే ప్రాసెస్‌ అంతా పూర్తయిపోయింది. పింక్‌ ఆటోల్లో డ్రైవర్లతోపాటు అందులో ప్రయాణించేవారు కూడా మహిళలే అయి ఉండాలి.
2012 ఢిల్లీ ఘటన తర్వాత రాంచీలో ఈ సర్వీస్‌ మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కేరళ దేశంలోనే మొదటిసారిగా మహిళలకోసం మహిళలే నడిపే 24/7 టాక్సీ సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు మంచి ఫలితాలిస్తుండడంతో త్వరలో షీ బస్‌ సర్వీసులు కూడా ప్రవేశపెట్టనుంది కేరళ ప్రభుత్వం.
షీ టీమ్స్‌
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందు కు తెలంగాణ, కర్ణాటకల్లో షీ టీమ్స్‌ విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేశాయి. పోకిరీల చెమడాలు వొలిచి మహిళల్లో ధైర్యం నింపాయి.
తెలంగాణాలో 2014 అక్టోబరు 24న హైదరా బాద్‌ పోలీసులు షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఆకతాయిల భరతం పట్టడానికి 25 ప్రత్యేక బందా లను రంగంలోకి దింపారు. బస్సులు, బస్టాపులు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థినులు, యువతులు, మహిళలను వేధిస్తున్న ఆకతాయిలను కటకటాల వెనక్కి పంపారు. షీ టీముల పనితీరు అంతా పకడ్బందీగా ఉంటుంది. షీ బందం సభ్యులు మారువేషాలతో మామూలు మనుషుల్లో కలిసిపోతారు.
ఆడవాళ్లను వేధిస్తున్న వారిని రహస్యంగా వీడియో తీసి, నిందితులను అదుపులోకి తీసుకుంటారు. షీ బందాల్లోని సభ్యుల ఎంపిక నుంచి శిక్షణ వరకు అంతా వినూత్నంగా ఉంటుంది. అన్నింటినీ రహస్యంగా షూట్‌ చేసి, సమాచారాన్ని సేకరించి నిందుతులకు, ఈవ్‌టీజర్స్‌కు శిక్ష పడేలా చేస్తుంది.
యాంటీ రోమియో స్వ్కాడ్‌
ఉత్తరప్రదేశ్‌లో మహిళల సంక్షేమానికై అక్కడి సీఎం యోగి ఇటీవలే యాంటీ రోమియో స్వ్కాడ్‌ ప్రవేశపెట్టారు. మహిళలను కించపరిచేలా మాట్లాడుతూ, వేధింపులకు గురిచేసిన వారందరినీ శిక్షించడమే ఈ స్క్వాడ్‌ చేసే ముఖ్య పని. స్క్వాడ్‌ సేవల్ని ఉపయోగించుకోవాలంటే చేయాల్సిందల్లా ఒకటే.. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే యాంటీ రోమియో స్క్వాడ్‌కి ఒక్క కాల్‌ చేస్తే చాలు, క్షణాల్లో మీముందు ఉంటారు. ఆకతాయిలకు అడ్డుకట్ట వేస్తారు.