సామాజిక సమానత్వం ఒక నిశ్చయం

'ఒకే దేవాలయం, ఒకే స్మశానం, ఒకే నీటి వసతి' ద్వారా సామాజిక సమానత్వం, సమరసతలను సాధించడానికి ఒక చక్కని కార్యాచరణను ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ శ్రీ మోహన్‌ భాగవత్‌ మన ముందుంచారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం లేనివాళ్ళు కూడా ఈ చొరవను
1925లో ప్రారంభమైన నాటి నుండి సామాజిక సమరసత ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలిక స్వభావమైంది. ఆ తరువాత బాలాసాహెబ్‌ దేవరస్‌ దానికి మరింత ప్రాధాన్యత నిచ్చారు. ఈ విషయంలో వారి ఆలోచన గురించి మీరేమంటారు?
సమరసత సాధించనిదే హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం సాధ్యం కాదు. అందువల్ల వివక్షలేని విధానం, ఆచరణ తప్పనిసరి. 
ఇవి ఆర్‌ఎస్‌ఎస్‌కు మొదట నుండీ తెలుసు. సమరసతతో కూడిన వ్యవహారం ఆర్‌ఎస్‌ఎస్‌లో మొదటి నుంచీ ఉంది. బాలాసాహెబ్‌జీ సర్‌సంఘచాలక్‌ అయిన సమయానికి సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల గౌరవం, శ్రద్ధ కొంత పెరిగాయి. సంఘని అనుసరించడానికి, సంఘ చెపుతున్న విషయాలను ఆచరించేందుకు సమాజం కాస్త ముందుకు వచ్చింది. సంఘలోని మానవీయ విలువలు సమాజానికి చాలా అవసరమయ్యాయి. అందుకనే సర్‌సంఘచాలక్‌ బాధ్యత చేపట్టిన వెంటనే బాలాసాహెబ్‌జీ 'సామాజిక చొరవ'ను సంఘ ప్రధాన కార్యాచరణ అంశంగా ప్రకటించారు. ఈ విషయంపట్ల ఇటు స్వయంసేవకులు, అటు మిగిలిన సమాజానికి అవగాహన కల్పించడం కోసం ఆయన వసంతవ్యాఖ్యానమాల ఉపన్యాసం(8 మే, 1974 పూనా) ఇచ్చారు. ఆ ఉపన్యాసాన్ని నెలల తరబడి జాగ్రత్తగా ఆలోచించి తయారు చేసుకున్నారు. అప్పటికే సంఘలో ఆచరణలో ఉన్న సమరసత సాధన వెనుక ఉన్న ఆలోచనను స్వయంసేవకులతోపాటు మొత్తం సమాజం ముందు ఆయన ఉంచారు.
వసంతవ్యాఖ్యానమాలలో బాలాసాహెబ్‌జీ ఉపన్యాసం తరువాత సంఘకార్యంలో
కొత్త మార్పులు ఏమి వచ్చాయి?
సామాజిక వివక్షకు గురైన సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటన్న విషయంపై మథనం మొదలైంది. వాళ్ళు మిగతా సమాజం గురించి ఏమనుకుంటున్నారు? వారికి, మిగతా సమాజానికి మధ్య ఏర్పడిన పెద్ద అగాధాన్ని పూడ్చడం ఎలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందర్భంలోనే సామాజిక సమరసత మంచ్‌ ప్రారంభమైంది. వివిధ సామాజిక సమూహాలతో సత్సంబందాలు ఏర్పరచుకునేందుకు, వారిని శాఖ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయడానికి విశేష ప్రయత్నం మొదలైంది. ముఖ్యంగా వివక్షకు గురై తమను తాము హిందువులమని చెప్పుకునేందుకు కూడా సంకోచిస్తున్న వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనివల్ల సమాజంలో గౌరవాదరాల కోసం ఎదురుచూస్తున్న వివిధ సమూహాలకు ఒక పెద్ద హిందూ సంస్థ బలం తోడైంది.
సమరసత సాధనలో
వచ్చే ప్రధాన అడ్డంకులు ఏమిటి?
నేను ఇంతకుముందే చెప్పినట్లుగా మన అలవాట్లు, మన అభిప్రాయాలే ప్రధాన అడ్డంకులు. మనం రెండు వేల సంవత్సరాలుగా ధర్మం పేరుతో అధర్మపరమైన విషయాలను పాటిస్తూ వచ్చాం. పాతది అంతా మంచి అనే అభిప్రాయాన్ని మార్చుకోకపోతే పరిస్థితిని మార్చలేం. సత్యానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే బాలాసాహెబ్‌జీ చెప్పినట్లు 'సమూలమైన మార్పు' తీసుకురాగలుగుతాం.
సమరసత సాధన ఒక నిరంత ప్రక్రియ అని మీరు చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలు ఈ ప్రక్రియలో ఎలాంటి పాత్ర పోషించాలని మీరు భావిస్తారు?
పండిత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. గోతిలో ఉన్న వ్యక్తి బయటకు రావాలంటే లోపల ఉన్న వాడు కాళ్ళు, చేతులు పైకి ఎత్తితే సరిపోదు. బయట ఉన్నవాడు కూడా ముందుకు వంగాలి. ఇప్పుడు ఇదే జరగాలి. పైన ఉన్నవాళ్ళు కిందికి వంగడానికి సిద్ధపడాలి. ఇతరులకు సహాయం చేయడానికి మన చేతిని చాపాలి. రెండవది, మన ఆలోచన, మాట, వ్యవహారం శాంతియుతంగా, సంతులనంగా ఉండాలి. సమాజంలో అంటరానితనం, అన్యాయం స్పష్టంగా కనిపిస్తున్నాయని బాలాసాహెబ్‌జీ తన ఉపన్యాసంలో చెప్పారు. మనమంతా ఒకే సమాజం. కనుక అందులో సామరస్యాన్ని నెలకొల్పడం మనందరి కర్తవ్యం. అంటరానితనం పాటించేవారు, దానివల్ల బాధపడేవారు ఉన్నంతకాలం సామరస్యం సాధ్యంకాదు. అంతరాలు తగ్గాలన్నా, శాంతిసామరస్యాలు వెల్లివిరియాలన్నా రెండు వైపుల నుంచి దూషణలు, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే మాటలు కట్టిపెట్టాలి.
సామాజిక మార్పులో
ఆర్‌ఎస్‌ఎస్‌ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?
చిత్తశుద్ధితో కూడిన చర్యల ద్వారా సమాజంలో అందరినీ కలపడమే సంఘ ప్రాధమిక ప్రణాళిక. బాహ్య వాతావరణం ఎలాగైనా ఉండనివ్వండి సమాజంలో అన్ని వర్గాలవారు స్నేహపూర్వకంగా మెలగాలి. సాధారణంగా ఒక సమూహానికి చెందినవారి మధ్య స్నేహం, సత్సంబంధాలు ఉంటాయి. అది సహజం. కానీ ఆన్ని సమూహాల మధ్య అలాంటి సంబంధాలు ఉండాలి. ఆ దిశగా సాగే ప్రయత్నాలను మన సమర్థించాలి, ప్రోత్సహించాలి. అదే మన పని. అన్యాయానికి గురైనవారికి సాధ్యమైనంత త్వరగా న్యాయం జరగాలి. సమానత్వ భావన అంతటా వ్యాపించాలి. అందుకోసమే ఈ విషయాలపై సర్వేలు, సద్భావన సమావేశాలు ఏర్పాటు చేయాలి. కొత్త కార్యక్రమాలను రూపొందించాలి.
ఇటీవల మీరు 'ఒకే దేవాలయం, ఒకే స్మశానం, ఒకే నీటి వనరు' అనే పిలుపునిచ్చారు. దీనికి వివిధ పంథాలు, మత పెద్దల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తోంది?
దాదాపుగా అంతా సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీని వెనుక ఉద్దేశ్యాన్ని అంతా ఆమోదిస్తున్నారు. కానీ సంఘ అంటే ఏమిటో అర్థం కానివారు, సంఘాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు మాత్రం ఇప్పుడెందుకు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని విమర్శిస్తున్నారు. కానీ సమాజంలో చాలామంది సంతోషం వ్యక్తం చేసున్నారు. వివక్షకు గురైనవారు ఇది ఒక ఆశాకిరణంగా భావిస్తున్నారు.

మెచ్చుకుంటున్నారు. ఈ సామాజిక సంస్కరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తృతీయ సర్‌సంఘచాలక్‌ శ్రీ బాలాసాహెబ్‌జీ బీజం వేస్తే, ఇప్పుడు శ్రీ మోహన్‌ భాగవత్‌ దానిని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. సామాజిక సమరసత గురించి, బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆలోచన గురించి మోహన భాగవత్‌ తన అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు.