అల్లం మనకందరికీ సుపరిచితమైన ఔషధి

దీని గురించి ప్రతీ ఒక్కరికీ కొద్దో గొప్పో తెలిసే ఉంటుంది. ఏదో విధంగా దాని ఉపయోగాలు మనకి తెలిసినవే. కానీ ఆయుర్వేదం ప్రకారం మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం. 
జీర్ణక్రియ
చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ జీర్ణక్రియ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాని కోసం ఎందరో వైద్యుల్ని కలుస్తున్నారు, ఎన్నో మందులు మింగుతున్నారు. కానీ తల్లి లాగా సేదతీర్చే చక్కని ఔషధం అల్లం ఉందన్న విషయం మరిచిపోయాం. అల్లం రసం జీలకర్ర, వాము కలిపి ప్రతిదినం తీసుకున్నట్లయితే భయంకర మైన జీర్ణాశయ వ్యాధులు కూడా దూరం అవుతాయి.
అల్లం లవణ భాస్కరం (ఒక రకమైన ఉప్పు) కలిపి తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
అల్లం బెల్లం నెయ్యి కలిపి వేడిచేసి నాకుతూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
తలనొప్పి జలుబు
గంధం లాగా పొడి అల్లం పట్టు వేయడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది.
జలుబు దగ్గు
అల్లం రసం రోజుకు 5మార్లు తీసుకోవడం వలన చాల వరకు ఉపశమనం కలుగుతుంది.
పసి పిల్లలకు పాలు వేడీచేసి అల్లం పొడి కలిపితే చాలా మంచిది.
కీళ్ళనొప్పులు, విరేచనం వల్ల ఇబ్బంది పడుతున్నవారికి అల్లం పసుపు 1గ్లాసు వేడినీళ్లతో కాచి కషాయం త్రాగడం వల్ల చాలా వరకు తగ్గును.
అల్లం ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యమునకు మంచి చేస్తుందే కానీ హాని మాత్రం చేయదు.