ఆధిపత్యం కోసం చైనా ఆరాటం

ఆసియా ఖండంపై పూర్తి పట్టు సాధించి ప్రపంచ ఆధి పత్యానికి ఆరాటపడుతున్నది చైనా. ఈ నేపథ్యంలో పురాతన సిల్క్‌ రోడ్‌ కార్యక్రమం పునరుద్ధరణ పేరుతో బీజింగ్‌లో చైనా పాలకులు కొన్ని రోజుల క్రితం అట్టహసంగా నిర్వహించిన కార్యక్రమం 'వన్‌బెల్ట్‌ వన్‌ రోడ్‌' ఒక తాజా ఉదాహరణ. చైనా ఆధిపత్యధోరణితో వ్యవహరిస్తూ కొత్త కొత్త వ్యవస్థలను నిర్మాణం చేస్తున్నది. ఈ రోజున ప్రపంచ దేశాలలో పెట్టుబడులు పెట్టే దేశంగా దూకుడుగా ముందుకు వెళ్తున్నది. 

మసీదులపై లౌడ్‌స్పీకర్స్‌ తొలగించిన మహ్మద్‌ అలీ

దేశంలో ధార్మిక స్థలాలలో వినియోగిస్తున్న లౌడ్‌స్పీకర్ల గురించి చర్చ జరుగుతోంది. ముంబాయికి చెందిన 66సం||ల మహ్మద్‌ అలీ ఆలియాస్‌ (బాబుబయ్య) మసీదులలో లౌడ్‌స్పీకర్ల ద్వారా ఆజాన్‌ను చెప్పే పద్ధతి ఇస్లామిక్‌ పద్దతి కాదని, వాటిని తొలగించాలని అంటున్నారు. లౌడ్‌స్పీకర్లను ఉపయోగించకపోవడం వలన ఇస్లాంకు వచ్చిన నష్టమేమి లేదని, 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం ఏర్పాడిన నాటి నుంచి అవి మతంలో భాగం కాదని అంటున్నారు.
ఈమేరకు ముంబాయి హైకోర్టులో ఒక పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

ఆవాలు

ఇది చాల అద్భుతమైన ఔషధం. ఆవ గురించి చెప్పుకుంటూపోతే చాలా పెద్ద గ్రంథమే వ్రాయవచ్చు. కానీ దాని క్లుప్తంగా ఆకులు, గింజలు యొక్క ఔషధ గుణాలు తెలుసుకుందాం. మన పెరట్లో చాలా విరివిగా పోషక సంరక్షణం లేకుండా పెరిగే ఔషధ మొక్క ఇది. ఆకులు ముద్దగా నూరి దెబ్బ తగిలిన చోట కట్టుగట్టిన నొప్పులు, వాపులు తగ్గును. ఆవాల నూనెను చిన్న పిల్లల(నెలల పిల్లల) మూర్ధస్థానంలో (అంటే మాడు మీద - ఎక్కడైతే ప్రేమతో తలపైన ముద్దు పెట్టు కుంటామో అక్కడ) ప్రతీ రోజు వ్రాయడం వల్ల మాడు గట్టిపడుతుంది. ఆవాల ఆకులు, గింజలలో విటమిన్‌-ఏ, విటమిన్‌-ఈ చాలా విరివిగ ఉంటుంది. అం
పైన చెప్పిన విధంగా ఆవాలగురించి ఎంతో వ్రాయవచ్చు. 

భారతీయ సమాజంలో స్త్రీ పాత్ర

మన వేద, పురాణ, ఇతిహాసాలన్నీ స్త్రీని ఆదిపరాశక్తిగా కిర్తించాయి. సమాజాభివృద్ధిలో ఆమె పాత్ర గుర్తించి అభినందించాయి. అనాటి కాలం నుంచి ఈనాటివరకు సమాజంలో స్త్రీ తనపాత్రని నిరూపించుకుంటూనే ఉంది. భర్తకి మంచి భార్యగా, తనబిడ్డకి తల్లిగా, మొదటి గురువుగా ఇలా అనేక సందర్భాలలో ఇమిడిపోతూ విభిన్నమైన పాత్రలతో సంతానాన్ని తీర్చిదిద్దుతూ తద్వారా మంచి సమాజం ఏర్పడటానికి తనవంతు కృషి చేస్తోంది. (సంస్కారవంతమైన ప్రజలు మాత్రమే సంస్కారమైన సమాజాన్ని ఏర్పాటు చేయగలరు కదా!) ఇలా ఈమె నిర్వహించే బాధ్యతలు తనకెంతో ఉన్నతస్థానాన్ని ఏర్పరుస్తాయి. 

పల్లెల రూపురేఖలను మారుస్తున్న సమాజం, స్వయంసేవకులు

గ్రామీణ వికాసం గురించి నానాజీ దేశ్‌ముఖ్‌ 'యుగానుకూల గ్రామ పునర్నిర్మాణం' అనే పదాన్ని ఉపయోగించేవారు. ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి గ్రామాలతో ముడిపడి మౌలిక విషయాలలో జాగ్రత్తవహిస్తేనే గ్రామీణ వికాసం సాధ్యపడుతుంది. జనసంపద అన్నింటి కంటే విలువైనది. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఉపాధి, ఆరోగ్యం వంటివి అందరికీ అందాలి. 

శ్రీగురుభ్యోన్నమః

శంకం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్ర భాష్య కృతౌ వందే భాగవతౌ పునః పునః
(భగవంతుడు శివుడు, విష్ణువు, వ్యాసుడు, శంకరాచార్యులను నేను పూజిస్తాను. వేదాంత సూత్రాలు వ్రాసిన వ్యాసునికి, వ్యాఖ్యానాలు వ్రాసిన శంకరాచార్యులకు పదేవదే నమస్కరిస్తాను.)
గురుపౌర్ణమి(ఆషాఢశుద్ధ పౌర్ణమి) నాడు ఈ గురుపరంపరకు నమస్కరిస్తూ అవిచ్ఛన్నంగా వస్తున్న భారతీయ నాగరకత గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటాం. గురు-శిష్య వ్యవస్థ ప్రాముఖ్యతను మరోసారి గ్రహిస్తాం. గురువు అంటే మనలోని అజ్డానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు. 

ఉజ్వల భారతం నిర్మిద్దాం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సంఘ శిక్షవర్గ సమారోప్‌ (ముగింపు) కార్యక్రమం హైదరబాద్‌ అన్నోజీగూడ లోని శ్రీ విద్యా విహార్‌ స్కూల్‌ లో వైభవోపేతంగా జరిగింది. 21 రోజుల శిక్షా వర్గ లో 380 ప్రదేశాల నుంచి మొత్తం 580 మండి శిక్షణ పొందారు. ఇటువంటి శిక్షావర్గలు ప్రతి సంవత్సరం దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో జరుగుతాయి. సమారోప్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన %జ్‌Iజుచీు% ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, %ణతీ%. బివిఆర్‌. మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ తాను హిందువునని చెప్పుకునేందుకు గర్విస్తానని అన్నారు.

చైనా ప్రభావం నుంచి భారత్‌ ను విముక్తం చేయాలి

మే 20,21 లలో స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు గౌహతిలో జరిగాయి. వాటిలో ఆమోదించిన తీర్మానం. చైనా వల్ల మన ఆర్థిక వ్యవస్థకు, మన యువత ఉపాధి అవకాశాలకు, జాతీయ సమైక్యత, భద్రతలకు పెద్ద ముప్పు అని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ పదే పదే చెపుతూనే ఉంది. 1996-97 తరువాత 19 ఏళ్లలో చైనా నుంచి దిగుమతులు 78 రెట్లు పెరిగాయి. అవి మన దేశీయ ఉత్పత్తులలో 22 శాతం ఆక్రమించాయి.

నీటి సమస్యకు సమాధానం జల సంరక్షణే

3290 లక్షల హెక్టార్‌ల వ్యవసాయ క్షేత్రం కలిగిన భారతదేశం ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద దేశం. ప్రకృతి మనకు వివిధ రకాలైన సారవంతమైన మట్టి ఇచ్చింది. ఇందులో వివిధ రకాలైన జీవజాలం మనుగడ సాగిస్తోంది. వివిధ పంటలకు అనుకూలంగా వాతావరణం ఉండడంవల్ల వ్యవసాయ ఉత్పత్తి కూడా బాగా ఉంటుంది. కానీ మారుతున్న వాతావరణ పరిస్తితుల్లో మన అవసరాలు తీరే అవకాశం ఉందా? వాతావరణ కాలుష్యం, తరుగుతున్న అడవులు, తగ్గుతున్న వర్షపాతం పెద్ద సవాళ్ళు గా నిలుస్తున్నాయి. 

అంతర్గత భద్రతకు సవాళ్లు విసురుతున్న మావొయిస్టులు

భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమై మే 23కి 50సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ సందర్భంగా నక్సల్బరీ ఉద్యమా నికి అనుకూలంగా, వ్యతిరేకంగా అనేక మంది తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.ఈ 50 సంవత్సరాల కాల ఖండంలో ఆ ఉద్యమం అనేక ఓడిదుడుకులు చూసింది. తాము చేసిన తప్పులను పదే పదే చేస్తూ సామాన్య ప్రజల నుంచి కూడా దూరమయింది. 

కార్తకర్తకు కొలబద్ద

కార్యకర్త విలువను కొలవ డానికి మనం ఉపయోగించే కొలబద్ద ఏమైన ఉందంటే అది అతని విశ్వసనీయతే. ఒక వ్యక్తియొక్క సామర్థ్యం, నైపుణ్యం, కార్యతత్పరత గొప్పవే కావచ్చు. కాని అతనితో సంఘకార్యం పట్ల ధృఢనిశ్చయంపై ఆధారపడిన నిస్వార్థమైన నిబద్ధత లేక పోయినట్లైతే అతడిని కార్యకర్త అని మనం అనలేం. ఒక వైపున సామర్థ్యం, కార్యకుశలత, తత్పరత, మరొక వైపున విశ్వసనీయత, సైద్దాంతిక నిబద్ధత - వీటి మధ్య ఎన్నుకోవలసి వస్తే మనం విశ్వసనీయత, ప్రతిబద్ధత ఉన్న వ్యక్తినే ఎన్నుకుంటాం. అతనికి సామర్థ్యం, నైపుణ్యం తక్కువగా ఉన్నా సరే, సమర్పితభావంలేని కార్యశీలుని కన్నా తక్కువ కార్యశీలత కలిగినప్పటికీ ఆత్మ సమర్పణ భావం ఉన్న వ్యక్తియే మన కార్యదృష్టిలో వాంఛనీయుడు.

అందరూ హిందూ బంధువులే..

అంటరానితనం హిందూ సమాజానికి ఒక శాపం. అంటరానితనం, ఎక్కువ తక్కువలు మొదలైన బేధభావాలతో హిందూ సమాజం చిన్నా భిన్నమైంది. ఆ కారణంగా చాలమంది హిందూ ధర్మాన్ని వదిలి విధర్మీయులుగా పోతున్నారు. అందుకని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సావర్కర్‌ సంకల్పించుకున్నారు.
సత్యాగ్రహం చేసి సావర్కార్‌ రత్నగిరిలోని విఠలేశ్వర దేవాలయంలో అంటరానివారికి ప్రవేశం కల్పించారు. రత్నగిరిలో పతితపావన మందిరాన్ని నిర్మించి దాని ప్రారంభోత్సవాన్ని శ్రీ శంకరాచార్యులచేత చేయించారు. 

జూన్‌ 26 బంకిచంద్ర చటర్జీ జయంతి

స్వాతంత్య్రోద్యమంలో కోట్లాది భారతీయులను ఉర్రూతలూగించిన ''వందేమాతరం'' గీత రచయిత బంకించంద్ర చటర్జీ. ''ఆనందమఠం'' అనే నవలలో మాతృభూమిని దుర్గాదేవితో పోలుస్తూ ఈ స్తోత్రాన్ని వ్రాశారు. ఆయన బెంగాలీ భాషలో ఇంకా అనేక నవలలు, కథలు, కథానికలు రచించారు. 

అమరవాణి

శ్లో|| దాన భోగోనా శస్తి
స్రోగతయో భవంతి విత్తస్య
యోనద దాతిన భుజ్ఞేతస్య
తృతీయా గతిర్భవతి
ధనమునకు దానమని, భోగమని, నాశమనీ మూడు దశలు కలవు. కావున ఒకరికి ఇవ్వక, తాను అనుభవించక కూడబెట్టిన వాని ధనమునకు నాశనమే కలుగును.

ప్రముఖులు మాట

'నీరు'లోనే నారాయణడున్నారు. కానీ నేడు నీటి కొరత అధికంగా ఉన్నది. అందువలనే జలసంవర్ధన-సంరక్షణ కొరకు శాసకులు, ప్రశాసకులు, ఉపాసకులందరు కలిసికట్టుగా బాధ్యత వహించి పని చేసే సత్సంకల్పం చేయవలసిన అవసరమున్నది.
- ఆచార్య మహామండలేశ్వర స్వామి అవధేశానందగిరి