ప్రముఖులు మాట

'నీరు'లోనే నారాయణడున్నారు. కానీ నేడు నీటి కొరత అధికంగా ఉన్నది. అందువలనే జలసంవర్ధన-సంరక్షణ కొరకు శాసకులు, ప్రశాసకులు, ఉపాసకులందరు కలిసికట్టుగా బాధ్యత వహించి పని చేసే సత్సంకల్పం చేయవలసిన అవసరమున్నది.
- ఆచార్య మహామండలేశ్వర స్వామి అవధేశానందగిరి
అయోధ్య కేలం శ్రీరాములవారి ఆలయం మాత్రమే కాదు. అది సమస్త హిందూ మనోభావాలు సర్వోన్నత్త, నిశ్చల, నిష్ఠాగరిష్ట, సుఖానుభూతుల అభివ్యక్తి. గత నాలుగైదు శతాబ్దాల నుంచి హిందువులు అయోధ్య వైపు తిరిగి దండం పెట్టి, శ్రీరాములవారిని స్మరిస్తు అక్కడ భూ-రజ-కణములను తమ నుదిటన ధరించి, తరించే కలను మదిలో పదిలపరుచుకుని, మందిర నిర్మాణానికి తపించడానికి ఎదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. భవ్య మందిరం దర్శనానికి పరితపిస్తూ ఉన్న వారెందరో ఉన్నారు.
- తరుణ్‌ విజయ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు

రాణాప్రతాప్‌ తరుపున రణరంగంలోకి దూకిన యోధులు కోలు-భీల్‌ జాతికి చెందిన వారుండిరి. వారిలో రాజ్‌పూత్‌ సామాజిక వర్గానికి చెందిన వారు లేరు..! అక్భర్‌ బాదుషా సేనాపతి మాన్‌సింగ్‌ సదరు రాణాప్రతాప్‌ వర్గానికే చెందిన వాడు. అదే విధంగా రాణాప్రతాప్‌ సేనాని అప్ఘానుకు చెందిన సూరి జాతియుడు. రాణాప్రతాప్‌ రాజుకు ఆర్థిక సహకారం మందించిన భామాషా వైశ్యా వర్గానికి చెందినవాడు. కాబట్టి దేశభక్తి భావననను ఏదో ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడంకన్నా, గుడ్డిగా ఆరాధించడం కన్నా వారి గుణగణాలను ఆచరించడం మంచిది.
- ఎన్‌.పి.సింహ్‌, జిల్లా అధికారి, సహారన్‌పూర్‌