గ్రామీణ వికాసం గురించి నానాజీ దేశ్ముఖ్ 'యుగానుకూల గ్రామ
పునర్నిర్మాణం' అనే పదాన్ని ఉపయోగించేవారు. ప్రకృతి సంరక్షణ, పర్యావరణ
పరిరక్షణ వంటి గ్రామాలతో ముడిపడి మౌలిక విషయాలలో జాగ్రత్తవహిస్తేనే గ్రామీణ
వికాసం సాధ్యపడుతుంది. జనసంపద అన్నింటి కంటే విలువైనది. ఒక గ్రామం
అభివృద్ధి చెందాలంటే ఉపాధి, ఆరోగ్యం వంటివి అందరికీ అందాలి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు, సమాజంతో కలిసి
దేశవ్యాప్తంగా యుగానుకూల గ్రామీణ పునర్నిర్మాణం కోసం విజయవంతమైన, సఫలమైన
ప్రయత్నం చేశారు. దీని ప్రభావం ఇప్పటికే 1000 గ్రామాల్లో స్పష్టంగా
కనిపిస్తోంది. దేశంలో ఉన్న మొత్తం శాఖల్లో మూడువంతులు గ్రామీణ
ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటి సంఖ్య దాదాపు 30,000. గోసంరక్షణ, ఆరోగ్యం,
దేవాలయం మొదలైన విషయాల ద్వారా వస్తున్న సామాజిక పరివర్తన ఇప్పుడు ఈ
గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
కోయంబత్తూర్లో మాతా అమృతానందమయి ఆశ్రమం ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు
నాటే కార్యక్రమం వల్ల మఠ వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. నగరంతో
పోల్చుకుంటే ఆశ్రమంలో ఉష్టోగ్రత మూడు డిగ్రీలకంటే తక్కువ ఉంటుంది.
ఆశ్రమానికి వచ్చే వారంతా తప్పనిసరిగా మొక్కలు నాటాలనే నిబంధన అక్కడ ఉంది.
అసోం నలబాడీ జిల్లాలోని సాదాకుర్చీ గ్రామంలో పెట్టుబడి అవసరం లేని
వ్యవసాయ పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఈ గ్రామంలో పంచగవ్య ఉత్పత్తులు కూడా
పెద్ద ఎత్తున లభిస్తాయి. దీని ప్రభావం చుట్టుపక్కల అనేక గ్రామాలపైన కూడా
పడింది.ఈ గ్రామాల్లో స్వయంసేవకులు చేసిన కృషిని ప్రశంసిస్తూ అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వం సత్కరించింది కూడా.
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గంగదేవపల్లి గ్రామంలో ఒకే నీటి
వనరు నుండి గ్రామం మొత్తం నీరు వాడుకుంటుంది. దీనివల్ల నీటి దుర్వినియోగం
కూడా అరికట్టబడింది. ఇక్కడ విడిగా ఇళ్లలో నీరు పట్టుకునే అవసరం ఉండదు. ఇళ్ల
బయట ఒక నిర్ధారిత ప్రదేశం వరకు నీరు సరఫరా అవుతుంది. అక్కడ నుండి నీరు
తెచ్చుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంజిల్లా కడము గ్రామంలో బాలసంస్కార కేంద్రాల
ప్రభావం బాగా కనిపిస్తుంది. ఈ గ్రామంలో నడిచే బాల సంస్కార కేంద్రాలవల్ల
చుట్టపక్కల అనేక గ్రామాలకు చెందిన పిల్లలకు సంస్కారాలు అందుతున్నాయి. ఈ
కేంద్రాలు పాఠశాలల మాదిరిగా నడుస్తాయి. ఇలా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో
గ్రామీణ వికాస కార్యక్రమాలు సఫలవంతంగా జరుగుతున్నాయి.
- డా. దినేష్, గ్రామవికాస ప్రముఖ్